వైజాగ్ కు భారీ వెసల్

విశాఖ హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్.. హెచ్పీసీఎల్ కు భారీ వెసల్ తరలి వచ్చింది. గుజరాత్లో ఎల్ అండ్ టీ కంపెనీ రూ.45కోట్ల వ్యయంతో ఈ వెసల్ ను తయారు చేశారు. విశాఖ షిప్ యార్డుకు వచ్చిన ఈ పరికరాన్ని హెచ్పీఎల్ రిఫైనరీ సెంటర్ కెపాసిటీని పెంచేందుకు ఈ భారీ వెసల్ ను దిగుమతి చేసుకున్నారు. 728టన్నుల బరువు.. 70 మీటర్లు వున్న ఈ పరికరాన్ని షిప్ యార్డు నుంచి హెచ్పీఎల్ కు తరలించడానికి భారీగా శ్రమించాల్సి […]

వైజాగ్ కు భారీ వెసల్
Follow us

| Edited By:

Updated on: Feb 19, 2019 | 1:01 PM

విశాఖ హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్.. హెచ్పీసీఎల్ కు భారీ వెసల్ తరలి వచ్చింది. గుజరాత్లో ఎల్ అండ్ టీ కంపెనీ రూ.45కోట్ల వ్యయంతో ఈ వెసల్ ను తయారు చేశారు. విశాఖ షిప్ యార్డుకు వచ్చిన ఈ పరికరాన్ని హెచ్పీఎల్ రిఫైనరీ సెంటర్ కెపాసిటీని పెంచేందుకు ఈ భారీ వెసల్ ను దిగుమతి చేసుకున్నారు. 728టన్నుల బరువు.. 70 మీటర్లు వున్న ఈ పరికరాన్ని షిప్ యార్డు నుంచి హెచ్పీఎల్ కు తరలించడానికి భారీగా శ్రమించాల్సి వచ్చింది. 520 టైర్లున్న ప్రత్యేక కంటైనర్ తో షిప్ యార్డు నుంచి షిఫ్ట్ చేశారు. భారీ వెసల్ ను తరలించే క్రమలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మార్గంలో కరెంట్ సరఫరాను నిలిపివేశారు. భారీ కంటైనర్ వెళ్లడానికి వీలుగా కొన్ని చోట్ల రోడ్ డివైడర్లను కూడా తొలగించాల్సి వచ్చింది. పోలీసులు, జీఈవెంసీ అధికారులు, సిబ్బంది దగ్గరుండి మరీ మానటరింగ్ చేశారు. భారీ వెసల్ ను చూసేందుకు స్థానికులు రోడ్డుకు ఇరువైపులా భారీగా గుమిగూడారు.