విశాఖ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఆమరణ దీక్ష భగ్నం, తెల్లవారుజామున హాస్పిటల్ కి తరలించిన పోలీసులు

టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. తెల్లవారుజామున విశాఖపట్నంలోని దీక్ష శిబిరం వద్దకు..

విశాఖ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఆమరణ దీక్ష భగ్నం, తెల్లవారుజామున హాస్పిటల్ కి తరలించిన పోలీసులు
Follow us

|

Updated on: Feb 16, 2021 | 7:32 AM

టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. తెల్లవారుజామున విశాఖపట్నంలోని దీక్ష శిబిరం వద్దకు చేరుకున్న పోలీసులు, పల్లాను బలవంతంగా శిబిరం నుంచి లేపారు. అనంతరం ఆయన్ను షీలా నగర్ లోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి తరలించారు. మాజీ ఎమ్మెల్యే పల్లాను ఆస్పత్రికి తరలించే క్రమంలో దీక్ష శిబిరం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆస్పత్రికి తరలించే క్రమంలో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు ప్రతిఘటించారు. ఈ క్రమంలో పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. రోడ్డుపై బైఠాయిస్తూ పోలీసు వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. వెంటనే పోలీసులు వారిని పక్కకు నెట్టుకుంటూ వాహనాన్ని ముందుకు తీసుకువెళ్లారు. అక్కడినుంచి పల్లా ను కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ కు తరలించారు. హాస్పిటల్‌కి చేరుకున్న వెంటనే మాజీ ఎమ్మెల్యే పల్లా కి వైద్య పరీక్షలు నిర్వహించారు. సెలైన్లు ఎక్కించి వైద్య సేవలు అందిస్తున్నారు హాస్పిటల్ సిబ్బంది.

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం గత ఆరు రోజులుగా గాజువాక టీడీపీ కార్యాలయంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు పల్లా శ్రీనివాసరావు. శనివారం నుంచే మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. వైద్యపరీక్షల్లో షుగర్ లెవెల్స్ పడిపోయినట్లు, 8 కేజీల వరకు వెయిట్ లాస్ అవటంతో పాటు కొన్ని అనారోగ్య సమస్యలను గుర్తించారు. పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు పలువురు టీడీపీ నేతలు పల్లా ఆరోగ్యంపై ఆదివారమే ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు సైతం దీక్ష శిబిరాన్ని సందర్శించి శ్రీనివాస్ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు విశాఖ పర్యటన ఖరారు అయింది. అయితే తెల్లవారుజామున ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మాజీ ఎమ్మెల్యే నీ పోలీస్ లు ఆస్పత్రికి తరలించడం విశేషం.

Read also : తెలంగాణ సక్సెస్ ఫుల్ పథకాన్ని బెంగాల్‌లో తెచ్చిన సీఎం మమత, తిరిగి అధికారంలోకి వచ్చేందుకు అడుగులు