Today Petrol and Diesel Price: మళ్లీ బాదేశారు.. వరుసగా ఎనిమిదవ రోజూ పెరిగిన పెట్రోల్ ధరలు.. ఈసారి ఎంత పెరిగిందంటే..

Today Petrol and Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు ఇప్పటంతలో బ్రేక్‌లు పడేలా కనిపించట్లేదు. తాజాగా మరోసారి పెట్రోల్, డీజిల్..

Today Petrol and Diesel Price: మళ్లీ బాదేశారు.. వరుసగా ఎనిమిదవ రోజూ పెరిగిన పెట్రోల్ ధరలు.. ఈసారి ఎంత పెరిగిందంటే..
Follow us

|

Updated on: Feb 16, 2021 | 7:28 AM

Today Petrol and Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు ఇప్పటంతలో బ్రేక్‌లు పడేలా కనిపించట్లేదు. తాజాగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా దేశీయ చమురు కంపెనీలు ఎనిమిదవ రోజు కూడా ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. లీటర్ పెట్రోల్‌పై 26 పైసలు పెంచగా.. డీజిల్‌పై 29 పైసలు పెంచాయి. తాజాగా పెరిగిన ధరల ప్రకారం తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 92.53 కాగా, లీటర్ డీజిల్ ధర రూ. 86.55 గా ఉంది. తెలంగాణలో వరంగల్ జిల్లాలో లీటర్ డీజిల్ ధర రూ. 86.14 చొప్పున ఉంది. ఇక పెట్రోల్ ధర రూ. 92.11 గా ఉంది. కరీంనగర్ జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 92.41కు లభిస్తుండగా, డీజిల్ రూ. 86.43 లకు లభిస్తోంది.

ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి. ఏపీలోని విజయవాడ నగరంలో లీటర్ పెట్రోల్ రూ. 95.55 లకు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ రూ. 89.02 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.03 కాగా, డీజిల్ లీటర్‌కి రూ. 87.55 గా ఉంది. కృష్ణా జిల్లాలో డీజిల్ ధర రూ. 88.51 కాగా, పెట్రోల్ ధర రూ. 95.00 గా ఉంది. గుంటూరు జిల్లాలో పెట్రోల్ ధర రూ. 95. 55 ఉండగా.. డీజిల్ ధర రూ. 89.02గా ఉంది.

పెట్రోల్ ధరల తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రికార్డు స్థాయిలో రూ.88.99కి చేరింది. లీటరు డీజిల్‌ ధర రూ.79.35గా ఉంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా పెట్రోల్‌ ధర రూ.95.46కి చేరుకుంది. ఇక డీజిల్ ధర రూ.86.34కు చేరింది. మరోవైపు రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో పెట్రోల్‌ ధర రూ.100కు చేరువైంది. ప్రస్తుతం ఈ పట్టణంలో లీటరు పెట్రోల్‌ ధర రూ.99.56గా ఉంది. డీజిల్‌ ధర రూ.91.48 పలుకుతోంది. మధ్యప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ రాష్ట్రంలోని చాలా నగరాల్లో పెట్రోల్ ధర రూ. 100కు చేరువలో ఉంది.

ఇలా వరుసగా పెరుగుతున్న పెట్రోల్ రేట్లను చూసి సామాన్య ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఓవైపు నిత్యావసర ధరలు భగభగమంటున్నాయి. వంటనూనెలు, కూరగాయలు, పప్పుదినుసులు, ఇతర రేట్లన్నీ భారీగా పెరుగుతుండటంతో జనాలు దిక్కతోచని స్థితిలో ఉన్నారు. ఇలా అన్ని రేట్లు పెరిగిపోతుంటే.. తాము బ్రతికేదెలా అంటూ ప్రశ్నిస్తున్నారు.

Also read:

Sandeep Nahar: బాలీవుడ్‌లో విషాదం.. మరో యువ నటుడు ఆత్మహత్య.. ఫేస్‌బుక్‌లో వీడియో పోస్ట్ చేసి.. ఆపై..

Nagababu-Python Photos: కొండ చిలువను పట్టుకున్న నాగబాబు.. నాగుపాముతో నాట్యం చేయించిన నాగబాబు ఫ్యామిలీ.