Sandeep Nahar: బాలీవుడ్‌లో విషాదం.. మరో యువ నటుడు ఆత్మహత్య.. ఫేస్‌బుక్‌లో వీడియో పోస్ట్ చేసి.. ఆపై..
Bollywood - Sandeep Nahar suicide: సినీ ఇండస్ట్రీలో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం నాటినుంచి బాలీవుడ్‌లో నిత్యం ఏదో ఒక సంఘటన వెలుగులోకి..
Bollywood – Sandeep Nahar suicide: సినీ ఇండస్ట్రీలో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం నాటినుంచి బాలీవుడ్‌లో నిత్యం ఏదో ఒక సంఘటన వెలుగులోకి వస్తోంది. తాజాగా మరో బాలీవుడ్ నటుడు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఎంఎస్ ధోనీ చిత్రంలో కోస్టార్‌గా నటించిన సందీప్ నహర్ (33) సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబై గోరేగావ్ ప్రాంతంలోని తన నివాసంలో సందీప్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి ముందు సందీప్ తన ఫేస్‌బుక్‌లో ఓ వీడియోను సైతం పోస్ట్ చేశాడు. తన భార్యతో పడలేకపోతున్నానంటూ ఆ వీడియోలో వెల్లడించాడు. అయితే ఈ ఘటనకు తన భార్యను నిందించవద్దంటూ నహర్ ప్రాథేయపడ్డాడు. ఉరివేసుకున్న అనంతరం గమనించిన కుటుంబసభ్యులు నహర్‌ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ముంబై పోలీసులు వెల్లడించారు.
గతేడాది ఎంఎస్ ధోనీ చిత్రం హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే సినిమా నటుడు చనిపోవడంతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సందీప్ నహర్ ఎంఎస్ ధోని చిత్రంతోపాటు.. అక్షయ్ కుమార్‌తో కలిసి అన్‌టోల్డ్ స్టోరీ, కేసరి వంటి చిత్రాల్లో కూడా నటించాడు.
Also Read: