Four banks privatization: త్వరలో మరో నాలుగు బ్యాంకులు ప్రైవేటీకరణకు కేంద్రం అడుగులు.. ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత
కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన వ్యయ అంచనాలను అందుకునేందుకుగానూ..
Four banks privatization: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన వ్యయ అంచనాలను అందుకునేందుకుగానూ.. పెట్టుబడుల ఉపసంహరణకు ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇందులో భాగంగా 4 ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రైవేటుపరం చేసేందుకు అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు ఈ లిస్ట్‌లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
2021-22 ఫైనాన్సియల్ ఇయర్‌లో ఇందులో 2 బ్యాంకుల్నిమొదట ప్రైవేటుపరం చేయనున్నారని తెలుస్తోంది. అయితే, బ్యాంకుల ప్రైవేటీకరణ కత్తు మీద సాము అన్న విషయం తెలిసిందే. అనేక వేలమంది ఉద్యోగులతో సదరు బ్యాంకులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో బ్యాలెన్సింగ్ చేస్తూ.. తొలుత చిన్న, మధ్య స్థాయి ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటుకు అప్పగించే ప్రక్రియ జరుగుతున్నట్లు అధికార వర్గాల సమాచారం. వీటికి రెస్పాన్స్ ఎలా వస్తుందో చూసి.. ఆ తర్వాత ప్రభుత్వం మేజర్ స్టెప్స్ వేయనుందని సదరు బ్యాంకులకు చెందిన పేరు చెప్పడానికి ఇష్టపడని ఉన్నతాధికారులు చెప్పారు.
బ్యాంకుల ప్రైవేటీకరణ ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సోమవారం నుంచి 2 రోజుల సమ్మెకు దిగారు ఉద్యోగులు. ఇక.. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశం కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఉద్రిక్తతలకు దారితీస్తున్న విషయం తెలిసిందే.
Also Read:
‘ప్రాణాలు అడ్డు వేసైనా కార్యకర్తలను రక్షించుకుంటా’.. హిందూపురంలో బాలయ్య ఎమోషనల్ కామెంట్స్