IT Sector Jobs: ఐటీ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. త్వరలోనే భారీగా ఉద్యోగ నియామకాలు.!!

IT Sector Jobs: ఐటీ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది పెద్ద ఎత్తున నియామకాలు జరగనున్నాయని తెలుస్తోంది...

IT Sector Jobs: ఐటీ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. త్వరలోనే భారీగా ఉద్యోగ నియామకాలు.!!
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 16, 2021 | 8:24 PM

IT Sector Jobs: ఐటీ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది పెద్ద ఎత్తున నియామకాలు జరగనున్నాయని తెలుస్తోంది. ఐటీ రంగంలోని సుమారు 95 శాతం సీఈఓలు పెద్ద ఎత్తున ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవాలని భావిస్తున్నట్లు నాస్కామ్(NASSCOM) సర్వే వెల్లడించింది. అలాగే 67% మంది సీఈఓలు ఆర్ధిక సంవత్సరం 2020తో పోలిస్తే 2021 ఆర్ధిక సంవత్సరంలో ఐటీ రంగం మెరుగైన ఫలితాలను సాధిస్తుందని అభిప్రాయపడుతున్నారు.

2020-21 (ఎఫ్‌వై 21) ఆర్థిక సంవత్సరంలో సమాచార సేవల రంగం ఆదాయ వృద్ధిని 2.3 శాతంగా నాస్కామ్(NASSCOM) అంచనా వేసింది. అలాగే ఐటీ కంపెనీల ఆదాయం ఎఫ్‌వై 21లో 194 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేసింది. అటు 2020-21 ఆర్ధిక సంవత్సరం రెండో భాగంలో టాప్ ఇండియన్ ఐటీ కంపెనీలు మెరుగైన పనితీరును కనబరిచినట్లు సర్వే పేర్కొంది.

సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవరుచుకోవడంతో పాటు డిజిటల్ పద్దతులను వేగవంతం చేయడంతో కరోనా కాలంలో ఈ వృద్ది సాధించగలిగినట్లు ఐటీ ఇండస్ట్రీ బాడీ ”న్యూ వరల్డ్: ది ఫ్యూచర్ ఈజ్ వర్చువల్” పేరుతో వచ్చిన స్ట్రాటజిక్ రివ్యూ 2021లో పేర్కొంది. డిజిటల్ పద్ధతులకు కంపెనీలు వెచ్చించిన ఖర్చు ద్వారా ఐటీ రంగం వృద్ది సాధించడానికి దోహదపడింది. దాదాపు 28 నుంచి 30 శాతం డిజిటల్ ఖర్చుల ద్వారానే ఐటీ రంగానికి రెవెన్యూ వచ్చింది.

కరోనా ఉన్నప్పటికీ ఐటీ రంగం 8 శాతం సాపేక్ష వాటాను జాతీయ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్‌కు అందించింది. అలాగే 52% సాపేక్ష వాటాను సేవా ఎగుమతుల్లో, అటు 50 శాతం విదేశీ పెట్టుబడుల్లో 2020 ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు పెట్టింది. ఐటిలో ఆదాయ వృద్ధి ప్రధానంగా ఈ-కామర్స్ నుండి వచ్చింది, దాదాపు 4.8 శాతం పెరిగి 57 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆ తర్వాత హార్డ్‌వేర్ విభాగంలో 4.1 శాతం వృద్ధి లభించింది. ఇక అది సంవత్సరానికి 16 బిలియన్ డాలర్ల ఆదాయానికి చేరుకుంది.

కాగా, ఇతర కంపెనీలు అనేక మంది ఉద్యోగులను స్కోర్ల ద్వారా తొలిగించినప్పటికీ.. ఐటీ కంపెనీలు కొత్త రిక్రూటర్లను తీసుకున్నాయి. అలాగే 2021 ఆర్ధిక సంవత్సరంలో సుమారు 1,38,000 నియామకాలు జరిగాయి. ఇక 2021 చివరి నాటికి దాదాపు 4.47 మిలియన్ మందికి ఉపాధి దొరకనుందని అంచనా.

మరిన్ని చదవండి:

‘అత్మనిర్భర్ భారత్’కు కేంద్రం మరో ముందడుగు.. మ్యాపింగ్ విధానంలో కీలక మార్పులు..

ముచ్చటపడి రూ. 100 కోట్ల విల్లా కొన్నాడు.. మనీ లాండరింగ్ కేసులో అడ్డంగా బుక్కైయ్యాడు…

భర్తతో కలిసి ఫేవరెట్ ప్లేస్‌లో కాజల్ డిన్నర్ డేట్.. అదేంటో మనం కూడా చూసేద్దాం..!