AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘9వ తరగతి వరకు చదివా.. నాకు స్థానికత ఇవ్వండి’ NEET UG కౌన్సెలింగ్‌లో సుప్రీంకోర్టు కీలక తీర్పు

2026-27 NEET-UG కౌన్సెలింగ్‌లో ఏపీ స్థానికత వర్తింపజేయాలని కోరిన విద్యార్థిని గుండుబోగుల యజ్ఞ శ్రీశ్రావ్యకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. 9వ తరగతి వరకు ఏపీలో చదివినప్పటికీ, స్థానికతకు అవసరమైన నాలుగేళ్ల చదువు నిబంధనను ఆమె పూర్తి చేయలేదు. 2024లో ఇచ్చిన మినహాయింపును తనకూ వర్తింపజేయాలని కోరగా, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధేల ధర్మాసనం పిటిషన్‌ను డిస్మిస్ చేసింది..

'9వ తరగతి వరకు చదివా.. నాకు స్థానికత ఇవ్వండి' NEET UG కౌన్సెలింగ్‌లో సుప్రీంకోర్టు కీలక తీర్పు
No AP Local Status for NEET-UG Counselling
Srilakshmi C
|

Updated on: Oct 04, 2026 | 10:20 AM

Share

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: ఆంధ్రప్రదేశ్‌లో 9వ తరగతి వరకు చదివినందున 2026-27 విద్యా సంవత్సరానికి జరగనున్న NEET UG కౌన్సెలింగ్‌లో ఏపీ స్థానికతను వర్తింపజేయాలని కోరిన విద్యార్థినికి సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. గుండుబోగుల యజ్ఞ శ్రీశ్రావ్య దాఖలు చేసిన అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. NEET UG కౌన్సెలింగ్‌లో రాష్ట్ర స్థానికతకు సంబంధించిన నిబంధనల ప్రకారం.. నీట్ పరీక్షకు ముందు వరుసగా నాలుగేళ్లు సంబంధిత రాష్ట్రంలో చదివి ఉండాల్సి ఉంటుంది. అయితే 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఏడాది పాటు విద్యార్థులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చిందని, అదే వెసులుబాటును తనకు కూడా కల్పించాలని శ్రావ్య తరఫు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు.

ఏపీలో 9వ తరగతి వరకు చదువు

శ్రావ్య 9వ తరగతి వరకు ఆంధ్రప్రదేశ్‌లోనే చదివినప్పటికీ.. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఆమెను ఏపీ స్థానికురాలిగా గుర్తించే పరిస్థితి లేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమెకు ఏపీతో పాటు తెలంగాణలోనూ స్థానికత సమస్య ఏర్పడుతోందని విద్యార్థిని తరఫు న్యాయవాది వివరించారు. ఈ ఒక్కసారికి మానవతా దృక్పథంతో ఆమెకు ఆంధ్రప్రదేశ్‌లో NEET UG కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

సెప్టెంబరు 30న జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధేలతో కూడిన ధర్మాసనం ముందు ఈ అంశం విచారణకు వచ్చింది. విద్యార్థిని తరఫు వాదనలు విన్న ధర్మాసనం.. ఈ ఒక్క కేసుకు నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వడానికి అంగీకరించలేదు. జస్టిస్ పీఎస్ నరసింహ అభ్యర్థనను తిరస్కరిస్తూ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో 2026-27 NEET-UG కౌన్సెలింగ్‌లో ఏపీ స్థానికతను వర్తింపజేయాలని కోరిన విద్యార్థినికి సుప్రీంకోర్టులో ఉపశమనం లభించలేదు.

Follow Us
'9వ తరగతి వరకు చదివా.. నాకు స్థానికత ఇవ్వండి' సుప్రీం కీలక తీర్పు
'9వ తరగతి వరకు చదివా.. నాకు స్థానికత ఇవ్వండి' సుప్రీం కీలక తీర్పు
చుట్టమల్లె సాంగ్ ఫేక్ వీడియో పై విజయ్ దేవరకొండ రియాక్షన్..
చుట్టమల్లె సాంగ్ ఫేక్ వీడియో పై విజయ్ దేవరకొండ రియాక్షన్..
పాతబస్తీలో అర్ధరాత్రి హైడ్రామా.. భారీగా భద్రతా బలగాల ఎంట్రీ!
పాతబస్తీలో అర్ధరాత్రి హైడ్రామా.. భారీగా భద్రతా బలగాల ఎంట్రీ!
42 ఏళ్ల వయసులో కళ్లు చెదిరే క్యాచ్‌.. వీడియో చూస్తే ఫిదానే..!
42 ఏళ్ల వయసులో కళ్లు చెదిరే క్యాచ్‌.. వీడియో చూస్తే ఫిదానే..!
పెన్షన్‌ డబ్బుల పంపిణీలో భారీ మార్పు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్!
పెన్షన్‌ డబ్బుల పంపిణీలో భారీ మార్పు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్!
భారత్‌ లో ఆకట్టుకున్న11 అంశాలు ఇవే! యోగా ట్రైనర్ పోస్టు వైరల్!
భారత్‌ లో ఆకట్టుకున్న11 అంశాలు ఇవే! యోగా ట్రైనర్ పోస్టు వైరల్!
కిడ్నీ రోగాలకు అడ్డుకట్టవేసి ఉద్దానానికి ఊపిరిపోయాలనుకుంది.. కానీ
కిడ్నీ రోగాలకు అడ్డుకట్టవేసి ఉద్దానానికి ఊపిరిపోయాలనుకుంది.. కానీ
వారంలో 3 సార్లు తినండి చాలు.. వెయ్యి ఏనుగుల శక్తి వస్తుంది..
వారంలో 3 సార్లు తినండి చాలు.. వెయ్యి ఏనుగుల శక్తి వస్తుంది..
పైలట్‌ స్మిత్ మచ్ఛర్‌కు నెతన్యాహు అరుదైన గౌరవం.. ఇజ్రాయెల్‌కు రావ
పైలట్‌ స్మిత్ మచ్ఛర్‌కు నెతన్యాహు అరుదైన గౌరవం.. ఇజ్రాయెల్‌కు రావ
విండీస్ సిరీస్ తర్వాత రో-కో మరలా ఎప్పుడు బరిలోకి దిగేది..?
విండీస్ సిరీస్ తర్వాత రో-కో మరలా ఎప్పుడు బరిలోకి దిగేది..?