AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC గ్రూప్‌ 1లో 163 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. అక్టోబర్ 6 నుంచి దరఖాస్తులు ప్రారంభం

APPSC గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 163 ఖాళీలను భర్తీ చేయనుండగా.. అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ అక్టోబర్‌ 6 నుంచి ప్రారంభం కానుంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌ 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్‌-1 ద్వారా డిప్యూటీ కలెక్టర్‌, డీఎస్పీ, డీఈఓ, డివిజనల్‌ డెవలప్‌మెంట్‌..

APPSC గ్రూప్‌ 1లో 163 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. అక్టోబర్ 6 నుంచి దరఖాస్తులు ప్రారంభం
APPSC Group 1 Recruitment Application
Srilakshmi C
|

Updated on: Oct 03, 2026 | 1:59 PM

Share

అమరావతి, అక్టోబర్ 3: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 163 ఖాళీలను భర్తీ చేయనుండగా.. అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ అక్టోబర్‌ 6 నుంచి ప్రారంభం కానుంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌ 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్‌-1 ద్వారా డిప్యూటీ కలెక్టర్‌, డీఎస్పీ, డీఈఓ, డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ తదితర 13 రకాల కీలక సర్వీసుల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసుకోవడం మంచిది. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అభ్యర్థులు ముందుగానే వన్‌టైమ్‌ ప్రొఫైల్‌ రిజిస్ట్రేషన్‌ (OTPR) పూర్తి చేసుకోవాలని సూచించారు.

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏయే విద్యార్హతలు ఉండాలి?

చాలా గ్రూప్‌-1 పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా బ్యాచిలర్స్‌ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే పోస్టును బట్టి ప్రత్యేక విద్యార్హతలు ఉండే అవకాశం ఉంది. డీఎస్పీ (కమ్యూనికేషన్స్‌) పోస్టులకు మాత్రం ఈసీఈ (ECE), ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ లేదా రేడియో ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్‌ చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. గ్రూప్ 1 ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలోని పలు కీలక విభాగాల్లో ఉన్నత స్థాయి పోస్టులను భర్తీ చేయనున్నారు. డిప్యూటీ కలెక్టర్‌, డీఎస్పీ, డీఈఓ, డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ వంటి పోస్టులు ఇందులో ఉన్నాయి. పోస్టుల వారీగా విద్యార్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు, పరీక్ష విధానం తదితర వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి. గ్రూప్‌ 1 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభానికి ముందే అభ్యర్థులు తమ OTPR వివరాలు, విద్యార్హత ధ్రువపత్రాలు, ఫొటో, సంతకం, ఇతర అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. దరఖాస్తు చేసుకునే ముందు పోస్టుల వారీగా నిర్దేశించిన అర్హతలను తప్పనిసరిగా పరిశీలించాలి.

ఇవి కూడా చదవండి

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: అక్టోబర్ 6, 2026.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 27, 2026.

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us