AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారంలో 3 సార్లు తినండి చాలు.. వెయ్యి ఏనుగుల శక్తి వస్తుంది.. దీన్ని మించిన ఫుడ్ ఏదీ లేదు..

ఆధునిక జీవనశైలిలో ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్నారా? మన పూర్వీకుల బలానికి రహస్యమైన జొన్న అన్నం లేదా జొన్న గటకతో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి. ఇది షుగర్ నియంత్రణకు, బరువు తగ్గడానికి, దృఢమైన ఎముకలకు అద్భుతమైన ఆహారం. సంప్రదాయ వంటకాన్ని మీ దైనందిన ఆహారంలో చేర్చుకుని దాని అద్భుత ప్రయోజనాలను పొందండి.

వారంలో 3 సార్లు తినండి చాలు.. వెయ్యి ఏనుగుల శక్తి వస్తుంది.. దీన్ని మించిన ఫుడ్ ఏదీ లేదు..
Jonna Gataka
Shaik Madar Saheb
|

Updated on: Oct 04, 2026 | 9:21 AM

Share

ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో.. 30 ఏళ్లు దాటిన చాలామంది ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. కానీ మన అమ్మమ్మలు, తాతమ్మలు తరతరాలుగా శారీరక శ్రమ చేస్తూ, ఇప్పటికీ ఎంతో దృఢంగా ఉండడం మనం గమనించవచ్చు. వారి పిల్లలకు, మనకు, మన పిల్లలకు కూడా సేవ చేసేంత శక్తిని కలిగి ఉన్నారు. దీనికి ప్రధాన కారణం వారి ఆహారపు అలవాట్లు. పూర్వీకులు ఎక్కువగా జొన్న అన్నం, సద్దన్నం వంటి సంప్రదాయ, పౌష్టికాహారాన్ని తీసుకునేవారు. తెల్ల అన్నం కేవలం పండుగలకో, చుట్టాలు వచ్చినప్పుడో మాత్రమే వండుకునే అరుదైన వంటకంగా ఉండేది. ఈ రోజుల్లో మనం మర్చిపోతున్న ఆ జొన్న గటక వంటకాన్ని, దాని ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం..

జొన్న గటక ఆరోగ్య ప్రయోజనాలు:

జొన్న గటక వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా, ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది:

  • షుగర్ నియంత్రణ: డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా మంచి ఆహారం, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
  • బరువు తగ్గడం: జొన్నల్లో అధిక పీచుపదార్థం ఉండటం వల్ల తొందరగా కడుపు నిండిన భావన కలిగి, బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.
  • ఎముకల బలం: జొన్నల్లోని కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎముకలను దృఢంగా ఉంచడానికి, ఎముకల సాంద్రతను పెంచడానికి సహాయపడతాయి.
  • జీర్ణక్రియ మెరుగుదల: అధిక పీచుపదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.
  • శక్తిని అందిస్తుంది: ఇది నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తుంది.. దీనివల్ల ఎక్కువసేపు శక్తివంతంగా ఉండవచ్చు.

జొన్న గటక తయారీ విధానం:

జొన్న గటక తయారుచేయడం చాలా సులభం. దీనికోసం తెల్ల జొన్నలైనా, పచ్చ జొన్నలైనా తీసుకోవచ్చు.

నానబెట్టడం: ముందుగా జొన్నలను రాత్రంతా నానబెట్టాలి.

రుబ్బడం: నానబెట్టిన జొన్నలను మిక్సీ జార్‌లో వేసి, కొద్దిగా బరకగా (కోర్స్‌గా) రుబ్బుకోవాలి. పూర్వకాలంలో రోట్లో దంచేవారు, కానీ ఇప్పుడు మిక్సీలో సులభంగా చేసుకోవచ్చు.

వండటం: ఒక కప్పు జొన్న రవ్వకు నాలుగు కప్పుల నీటిని తీసుకొని బాగా మరగనివ్వాలి.

పదార్థాలు చేర్చడం: నీరు మరిగిన తర్వాత తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ నెయ్యిని అందులో కలపాలి.

జొన్న రవ్వ కలపడం: జొన్న రవ్వను కొద్దికొద్దిగా వేస్తూ, ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. ఒకేసారి వేస్తే ఉండలు కట్టి, లోపల సరిగా ఉడకవు.

ఉడికించడం: మంటను తక్కువ నుండి మధ్యస్థ మంటలో ఉంచి, జొన్న రవ్వ పూర్తిగా ఉడికేంత వరకు 20 నుండి 25 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లేదంటే అడుగు అంటుకునే అవకాశం ఉంది.

జొన్న అన్నాన్ని ఏ కూరతోనైనా తినవచ్చు, లేదా పెరుగుతో తిన్నా చాలా బాగుంటుంది. పప్పుతో కలిపి తింటే అద్భుతమైన రుచి ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది ఈ ఆహారపు అలవాట్లను అలవర్చుకుంటున్నారు. వారంలో కనీసం మూడు నుండి నాలుగు సార్లు అల్పాహారంలో దీనిని తీసుకోవడం ద్వారా మీరు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఆరోగ్యకరమైన జీవితం కోసం ఈ సంప్రదాయ, పౌష్టికాహారాన్ని మీ దైనందిన ఆహారంలో చేర్చుకుని ఆరోగ్య ప్రయోజనాలను పొందాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us