కుప్పకూలిన సర్దార్ సర్వాయి పాపన్న కోటగోడ

తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు బీభత్సం స‌ృష్టించాయి. రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు అపారమైన నష్టం వాటిల్లింది. ఈ క్రమంలోనే చారిత్రక కట్టడమైన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ కట్టిన కోట కూడా అందరూ చూస్తుండగానే ఓ వైపు గోడ కూలిపోయింది.

కుప్పకూలిన సర్దార్ సర్వాయి పాపన్న కోటగోడ
Follow us

|

Updated on: Oct 16, 2020 | 3:04 PM

తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు బీభత్సం స‌ృష్టించాయి. రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు అపారమైన నష్టం వాటిల్లింది. అనేక ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. చాలా ప్రాంతాల్లో ఇళ్లు, పురాతన కట్టడాలు కూలిపోయాయి. ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. ఈ క్రమంలోనే చారిత్రక కట్టడమైన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ కట్టిన కోట గోడ పాక్షికంగా కూలిపోయింది. వర్షాల వల్ల కోట గోడ కుప్ప కూలింది. పక్కనే ఉన్న నాలుగు ఇళ్లపై కోట గోడ కూలడంతో నాలుగు ఇళ్లు ధ్వంసమయ్యాయి.

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురం గ్రామంలోని ఏళ్ల చరిత్ర గల పురాతన కోట కుప్పకూలింది. 17వ శతాబ్దంలో సర్దార్ సర్వాయి పాపన్న కట్టించారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ కోట భార వర్షాలకు ధ్వంసం అయింది. బహుమనీ సుల్తాన్ లపై బహుజన వీరుడి పరాక్రమానికి సాక్ష్యంగా మిగిలన ఆనవాలం ఇప్పుడు నేలమట్టం అయ్యింది. శత్రు సైన్యాల దాడిని తట్టుకుని నిల్ల బడ్డ ఆ కోట.. భారీ వర్షాలకు కుప్పకూలింది. ముందే పసిగట్టిన స్థానికులు ఇళ్లలో నుంచి బయటికి పరుగులు పెట్టారు. దీంతో ప్రాణ నష్టం తప్పింది.

ఖిలాషాపురం కోటను తెలంగాణ ప్రభుత్వం ఇటీవల టూరిస్టు ప్లేస్ గా ప్రకటించింది. కోట సంరక్షణకు 4 కోట్ల, 50 లక్షల రూపాయలు మంజూరు చేసింది. త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ సమయంలోనే కోట గోడ కూలిపోయింది. కూలుతున్న దృశ్యాలను స్థానికులు సెల్ ఫోన్ లో బంధించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కోట సంరక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.