AP News: ఏఓబిలో 5 ఏళ్ల తర్వాత చిక్కిన అరుదైన చేప..! పులసలా టేస్ట్.. ఎన్నో పోషకాలు
ఈచేపలకు నీటి ప్రవాహానికి ఎదురీదే అరుదైన లక్షణం వీటికి ఉంది. అత్యంత అరుదైన చేప.. కనిపించడం చాలా తక్కువ. శీతల ప్రాంతాలు.. చల్లటి నీరు వాటి ఆవాసం. కొండల మధ్యలో ఉన్న కొలనులో.. 15 డిగ్రీల కంటే తక్కువ ఉండే ఇవి నీళ్లలో నివసిస్తూ ఉంటాయని అంటున్నారు ఏయూ జువాలజీ ప్రొఫెసర్ డిఈ బాబు. గతంలోనూ ఒకసారి పరిశోధనలకు వెళ్ళినప్పుడు ఈ చేప వారి కంటబడింది. 2018లో డొంకరాయి పరిసర ప్రాంతాల్లోనే కొండల మధ్య కొలనులో.. ఈ చేప కనిపించిందట.

సీలేరు, సెప్టెంబర్ 15: ఎక్కడో హిమాలయాల సమీపంలోని కొలనుల్లో లభించే అరుదైన చేప ఆంధ్ర ఒడిస్సా సరిహద్దులో కనిపించింది. జాలర్ల వలకు చిక్కింది. 24 కిలోల బరువు ఉండే ఈ చేప.. కనిపించడం అత్యంత అరుదు. మిలట్రీ మౌస్, గెలస్కోపి అనే పేర్లతో పిలవబడే ఈ చేపకు శాస్త్రీయ నామం టార్ ఫిష్. పులసకు పెద్దన్నలా ఉండే ఈ చేప తూర్పు కనుమల్లో దర్శనం ఇవ్వడంతో ఇప్పుడు ఆసక్తి నెలకొంది. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలం సీలేరు రిజర్వాయర్ లో జాలర్లు యథావిధిగా చేపలు వేటకు వెళ్లారు. ఓ జాలరికి 24 కిలోల అతి అరుదైన గెలస్కోపి, మిలట్రీ మౌస్ చేప వలకు చిక్కింది. ఈచేప 5 కిలోలనుంచి 40 – 50 కిలోల వరకు బరువు పెరుగుతుంది. ఈచేపలు ఉత్తర భారత హిమాలయాల ప్రాంతంలో మాత్రమే దర్మనమిచ్చే అరుదైన చేప. దీన్నే టార్ ఫిష్ అని కూడా అంటారు. ఐదేళ్ల క్రితం ఒకసారి సీలేరు, డొంకరాయి జలాశయాలలో ఇవి కనిపించాయి.
పోషకాలు పుష్కలం..
– ఈచేప జీవ వైవిధ్య పరంగా, పోషకాహారం పరంగా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రుచికి దీనికి ఇదే సాటి. వీటిలో 68 శాతం ప్రోటీన్లు ఉంటాయి. ఓమెగా 3ఫ్యాటీ యాసీడ్స్, ఆరోగ్య విలువలు కలిగిన కొలాజన్ వంటివి ఉంటాయి. ఆరోగ్యపరంగా విలువలు దీనికి కలిగి ఉన్నాయి. ఈచేపలు అల్లూరి ఏజెన్సీ కొండ ప్రాంతంఅడవుల్లో నిత్యం నీరు ఉండే ప్రాంతాలలో లోతైన సీలేరు, డొంకరాయి, బలిమెలా రిజర్వాయర్లలో ఆసరాగ చేసుకొని జీవనం సాగిస్తున్నట్టు తెలుస్తోంది.
పులసలా ఎదురైతే లక్షణం దీని సొంతం…
– ఈచేపలకు నీటి ప్రవాహానికి ఎదురీదే అరుదైనలక్షణం వీటికి ఉంది. అత్యంత అరుదైన చేప.. కనిపించడం చాలా తక్కువ. శీతల ప్రాంతాలు.. చల్లటి నీరు వాటి ఆవాసం. కొండల మధ్యలో ఉన్న కొలనులో.. 15 డిగ్రీల కంటే తక్కువ ఉండే ఇవి నీళ్లలో నివసిస్తూ ఉంటాయని అంటున్నారు ఏయూ జువాలజీ ప్రొఫెసర్ డిఈ బాబు. గతంలోనూ ఒకసారి పరిశోధనలకు వెళ్ళినప్పుడు ఈ చేప వారి కంటబడింది. 2018లో డొంకరాయి పరిసర ప్రాంతాల్లోనే కొండల మధ్య కొలనులో.. ఈ చేప కనిపించిందని.. దానిపై పరిశోధనలు కూడా జరిగాయని అంటున్నారు. కొండల మధ్య నీటి కొలనుల్లో జీవించే ఈ చేపలు వర్షాల ఉధృతికి కొట్టుకొని రిజర్వాయర్ లోకి వస్తుంటాయని అంటున్నారు. తూర్పు కనుమల్లో ఉండే చెరువులు చలమల్లో వీటి ఆవాసానికి అనుకూల పరిస్థితులు ఉండడంతో అక్కడే ఇవి జీవనం సాగిస్తున్నాయని అంటున్నారు ప్రొఫెసర్ డి ఈ బాబు. ఇది చాలా అరుదైన, విలువైన చేప అని చెబుతున్నారు.
– 2018 తరువాత నుంచి మళ్లీ ఆ చేప ఆచూకీ అంతు చిక్కలేదు. గత కొద్ది కాలంగా ఏవోబిలో విపరీతమైన వర్షం కురుస్తోంది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఆ కొండల మధ్య కులంలో నివసించే ఈ టార్ ఫిష్.. వరద ఉధృతికి కొట్టుకు వచ్చినట్టు చెబుతున్నారు. తూర్పు కనుమల్లో ఎన్నో జీవరాసులు ఉన్నాయి. వాటిలో ఈ అరుదైన చేప ఉన్నట్టు ఇప్పుడు అందరిని ఆలోచింపజేస్తుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..