తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లోనే నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ అండమాన్, ఆగ్నేయ బంగాళా ఖాతంలో ఈ నెల 29న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని..

తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
Follow us

| Edited By:

Updated on: Apr 27, 2020 | 8:43 AM

తెలుగు రాష్ట్రాల్లోనే నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ అండమాన్, ఆగ్నేయ బంగాళా ఖాతంలో ఈ నెల 29న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 48 గంటల్లో అది మరింత బలపడి, తీవ్రంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ఆ అల్పపీడనం ఈ నెల 30 నుంచి మే 3 వరకూ ఉండనుందని అండమాన్ నికోబార్ దీవుల వైపు ప్రయాణించే అవకాశం ఉందని వివరించింది. ఎండ తీవ్రత, బంగాళాఖాతం నుంచి వచ్చే తేమగాలుల ప్రభావంతో వాతావరణ అనిశ్చితి నెలకొందని అన్నారు. ఈ ప్రభావంతో నేడు, రేపు తెలంగాణలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వానలు, కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, పిడుగులు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని.. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Read More: 

మళ్లీ లాక్‌డౌన్‌ పొడిగింపుకే మొగ్గుచూపుతోన్న సీఎం కేసీఆర్

అన్నీ తెలిసే వెళ్లాడు.. తనకి నేనేం సలహాలు ఇస్తాను? పవన్‌పై చిరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

లైవ్‌లో ‘ఐలవ్‌యూ చెప్పి ముద్దు’ అడిగిన నెటిజన్.. ఇంటికొచ్చి మరీ తంతానంటోన్న హేమ