AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చుక్కలు చూపించిన NEET 2026 రీ-ఎగ్జామినేషన్‌ పరీక్ష.. కటాఫ్‌ భారీగా తగ్గే ఛాన్స్‌!

NEET UG Re-Exam 2026 Analysis: దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్‌ యూజీ రీ-ఎగ్జామ్‌ ప్రశాంతంగా ముగిసింది. 20 లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, కఠిన భద్రతా ఏర్పాట్ల మధ్య ఎన్‌టీఏ విజయవంతంగా పరీక్షను నిర్వహించింది. అయితే క్వశ్చన్ పేపర్ మాత్రం కాస్త కఠినంగానే ఉన్నట్లు నిపుణులు అంటున్నారు..

చుక్కలు చూపించిన NEET 2026 రీ-ఎగ్జామినేషన్‌ పరీక్ష.. కటాఫ్‌ భారీగా తగ్గే ఛాన్స్‌!
NEET UG Re-Exam Analysis and Cutoff Prediction
Srilakshmi C
|

Updated on: Jun 22, 2026 | 6:19 AM

Share

హైదరాబాద్‌, జూన్‌ 22: దేశవ్యాప్తంగా ఆదివారం (జూన్‌ 21) ‘నీట్‌’ రీ-ఎగ్జామ్‌ ప్రశాంతంగా జరిగింది. దేశవ్యాప్తంగా నీట్‌ యూజీ రీ-ఎగ్జామ్‌కు 20 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. 1.38 లక్షల సీసీటీవీల ద్వారా 95 వేల పరీక్ష గదులను నిశితంగా అధికారులు పరిశీలించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు జరిగిన పరీక్షకు విద్యార్థులను ముందస్తుగా అనుమతించడంతో ఎక్కడా ఎలాంటి అవాంచిత సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగింది. దేశంలోని 551 నగరాల్లో 5,440 కేంద్రాలు, విదేశాల్లో 14 సెంటర్లలో నీట్‌ పరీక్షను నిర్వహించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఢిల్లీలోని ఎన్‌టీఏ ప్రధాన కార్యాలయం నుంచి పరీక్షలను సమీక్షించారు. అన్ని ప్రభుత్వ విభాగాల సహకారంతో పరీక్షను 37 రోజుల్లోనే తిరిగి నీట్ పరీక్షను రెండోసారి విజయవంతంగా నిర్వహించగలిగామని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) డైరెక్టర్‌ జనరల్‌ అభిషేక్‌ సింగ్‌ పేర్కొన్నారు. హిందీ, ఇంగ్లిష్‌తో కలిపి మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను నిర్వహించారు. దివ్యాంగులకు గంట అదనంగా సమయం ఇవ్వడంతో సాయంత్రం 6.20 వరకు పరీక్ష జరిగింది.

ఈ సారి నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం కఠినమే

ఈ ఏడాది మే 3న జరిగిన పరీక్షతో పోల్చుకుంటే ఆదివారం (జూన్‌ 22) జరిగిన రీ-ఎగ్జామ్‌ ప్రశ్న పత్రంలోని ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల నుంచి అడిగిన ప్రశ్నలు కఠినంగా ఉన్నట్లు, బాగా సమయం పట్టే ప్రశ్నలు ఇచ్చారని అభ్యర్ధులు వెల్లడించారు. దీంతో ఈ రెండు సబ్జెక్టు్ల్లో స్కోరింగ్‌ చేసే అవకాశం తక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. బయాలజీ మాత్రం కాస్త సులువుగా ఉండటంతో ఇందులో స్కోరింగ్‌కు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇక ఫిజిక్స్‌లో అడిగిన ప్రశ్నలు ఎక్కువ సమయం తీసుకునే విధంగా ఉన్నాయి. 4, 5 ప్రశ్నలు అర్ధం చేసుకోవడానికి వీలులేని విధంగా గందరగోళానికి గురిచేసే విధంగా ఉన్నాయి. కెమిస్ట్రీలో న్యూమరికల్, మెమరీ బేస్డ్‌ ప్రశ్నలు అధికంగా అడిగారు. మొత్తంగా బయాలజీ సబ్జెక్ట్‌ ప్రశ్నలు మాత్రమే సులువుగా ఉన్నాయని.. ఫిజిక్స్, కెమిస్ట్రీ అత్యంత కఠినంగా ఉన్నాయని నిపుణులు విశ్లేషించారు. మరికొంత మంది విద్యార్ధులు కెమిస్ట్రీ ప్రశ్నలు కూడా కాస్త సులువుగానే ఉన్నాయని తెలిపారు. అయితే ఇందులోని ప్రశ్నలు కాలిక్యులేషన్‌కు ఎక్కువ సమయం పట్టేలా ఉన్నాయని అన్నారు. భౌతికశాస్త్రం ప్రశ్నలు మాత్రం మరింత కష్టంగా వచ్చాయని అంటున్నారు. దీంతో అత్యధిక స్కోరింగ్‌ మార్కులు తగ్గే అవకాశం ఉందని అన్నారు. ఇక కటాఫ్‌ కూడా ఈ సారి భారీగా తగ్గే అవకాశం ఉందన్నారు. టాప్‌ స్కోర్‌ మార్కులు 700 నుంచి 710 మధ్య రావొచ్చని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఓపెన్‌ కేటగిరీలో గతేడాది కటాఫ్‌ మార్కులు 487 ఉండగా, ఈసారీ అంతే స్థాయిలో మార్కులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బోటనీ, జువాలజీ ప్రశ్నలన్నీ ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకం నుంచే వచ్చాయని, ఈ పుస్తకాలు చదివిని వారికి పూర్తిస్థాయిలో మార్కులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

Follow Us