టీఎస్ఆర్టీసీ పెట్రోల్‌ పంప్‌ ఔట్‌లెట్లు ప్రారంభం

ఆదాయ పెంపులో భాగంగా టీఎస్‌ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్‌పీసీఎల్‌, ఐఓసీఎల్‌ సంయుక్త ఆధ్వర్యంలో పెట్రోల్‌ పంప్‌ ఔట్‌లెట్‌లను నిర్వహించాలని నిర్ణయించింది.

టీఎస్ఆర్టీసీ పెట్రోల్‌ పంప్‌ ఔట్‌లెట్లు ప్రారంభం
Follow us

| Edited By:

Updated on: Aug 06, 2020 | 7:36 PM

TSRTC Petrol Pump Outlets: ఆదాయ పెంపులో భాగంగా టీఎస్‌ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్‌పీసీఎల్‌, ఐఓసీఎల్‌ సంయుక్త ఆధ్వర్యంలో పెట్రోల్‌ పంప్‌ ఔట్‌లెట్‌లను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని ఖైరతాబాద్‌ రవాణాశాఖ కార్యాలయంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఇవాళ ప్రారంభించారు. ఆన్‌లైన్‌ ద్వారా తొలి ఔట్‌లెట్‌ను పువ్వాడ జనగామలో ప్రారంభించారు. మొత్తం ఐదు ఔట్‌లెట్లను ఆగష్టు చివరి నాటికి అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. హన్మకొండ, మహబూబాబాద్‌, బిచ్కుంద, బీర్కూర్‌, ఆసిఫాబాద్‌లో ఔట్‌లెట్లను ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక ఈ నిర్ణయంతో ఆర్టీసీకి 20.65 లక్షల అదనపు ఆదాయం వస్తోందని అంచనా వేస్తున్నారు.

Read This Story Also: అమెరికా పరిశోధకుల ముందడుగు.. కరోనా వైరస్‌కి చికిత్సా పద్ధతి

Latest Articles