తెలంగాణలోని ఆ మూడు జిల్లాల్లో అమాంతం పెరిగిన కరోనా కేసులు
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభం అయినప్పటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అధిక కేసులు వస్తున్నాయి.
Telangana Corona updates: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభం అయినప్పటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అధిక కేసులు వస్తున్నాయి. ఇక ఆ తరువాత జీహెచ్‌ఎంసీకి దగ్గరగా ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అవుతూ వచ్చాయి. దీంతో ఈ మూడు ప్రాంతాలపైనే ఆరోగ్యశాఖ అధికారులు దృష్టిని సాధించారు. అయితే కొన్ని వారాలుగా వరంగల్ అర్బన్, కరీంనగర్, సంగారెడ్డి జిల్లాల్లో అమాంతం కేసులు పెరిగాయి. జూలై నుంచి ఆగష్టు 4 మధ్య చూసుకుంటే జీహెచ్ఎంసీలో 3,398 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డిలో 1,285, మేడ్చల్-మల్కాజ్‌గిరిలో 1,019 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇక అదే పీరియడ్‌లోనే వరంగల్ అర్బన్‌లో 744, కరీంనగర్‌లో 610, సంగారెడ్డిలో 494 కేసులు నమోదయ్యాయి. ఇలా పెరగడానికి ముఖ్య కారణం టెస్ట్‌ల సంఖ్య పెరగడమేనని తెలుస్తోంది. కరోనా విస్తరణ నేపథ్యంలో చాలా మంది టెస్ట్‌లు చేసుకునేందుకు ముందుకు వస్తున్నారని, అందుకే కేసులు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. కాగా తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 73,050కు చేరుకుంది. ఇందులో 52,103 మంది డిశ్చార్జి అవ్వగా.. 589 మంది మరణించారు. ప్రస్తుతం 20,358 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read This Story Also: Sushant Case: రంగంలోకి సీబీఐ.. రియాపై ఎఫ్‌ఐఆర్