ఏపీలో మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్..!
ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ మహమ్మారి బారిన పడుతున్న రాజకీయ నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
Anaparthi MLA Tests Corona Positive: ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ మహమ్మారి బారిన పడుతున్న రాజకీయ నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం అంజద్ బాషాతో పాటు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సహా పలువురు వైసీపీ ఎమ్మెల్యేలకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఇందులో కొంతమంది కోలుకోగా, మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇక తాజాగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన టెస్టులు చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్న ఆయన.. డాక్టర్ల పర్యవేక్షణలో ఇంటి దగ్గర నుంచే చికిత్స తీసుకుంటున్నారు. కాగా, ఎమ్మెల్యేకు కాంటాక్టులో ఉన్నవారిని అధికారులు వెతికే పనిలోపడ్డారు.
Also Read:
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పల్లెల్లోనూ మాస్క్ తప్పనిసరి.. లేదంటే జరిమానా!