మరి కొన్ని గంటల్లో పెళ్లనగా.. వధువుకు కరోనా నిర్ధారణ

అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి, తెల్లారితే ఆ ఇంట్లో పెళ్లి బాజాలు మ్రోగేవి. కానీ ఈ లోపే పెళ్లి కుమార్తెకు కరోనా సోకినట్లు రిపోర్ట్‌లు వచ్చాయి.

మరి కొన్ని గంటల్లో పెళ్లనగా.. వధువుకు కరోనా నిర్ధారణ
Follow us

| Edited By:

Updated on: Jul 26, 2020 | 12:20 PM

అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి, తెల్లారితే ఆ ఇంట్లో పెళ్లి బాజాలు మ్రోగేవి. కానీ ఈ లోపే పెళ్లి కుమార్తెకు కరోనా సోకినట్లు రిపోర్ట్‌లు వచ్చాయి. చేసేదేం లేక పెళ్లిని వాయిదా వేశారు. ఈ ఘటన కర్నూల్ జిల్లా నంది కొట్కూరులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నందికొట్కూరు పట్టణానికి చెందిన ఓ యువతకి ఇటీవల వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో 25న ముహూర్తం, 26న తలంబ్రాలు పెట్టుకున్నారు. అయితే కరోనా నిబంధనల ప్రకారం పెళ్లికి మూడు రోజుల ముందు పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తె కరోనా పరీక్షలు చేయించుకున్నారు.

ఈ క్రమంలో శనివారం ఉదయం వధువుకు పాజిటివ్‌ అని నిర్ధారణ కావడంతో అధికారులు హుటాహుటిన యువతి ఇంటికి వెళ్లి విషయం చెప్పారు. అధికారుల సూచన మేరకు ఇరు కుటుంబాలు మాట్లాడుకుని వివాహాన్ని వాయిదా వేశారు. కాగా ఇలాంటి ఘటనే ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. కొత్తపేటకు చెందిన పెళ్లి కుమారుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వడంతో పెళ్లి వాయిదా పడిన విషయం తెలిసిందే.

Read This Story Also: దారుణం.. 6కి.మీలకు రూ.9,200 డిమాండ్ చేసిన అంబులెన్స్ డ్రైవర్‌