AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజేంద్రనగర్‌లో మరోసారి చిరుత కలకలం

మే 14న కాటేదాన్ ప్రాంతంలో చిరుత పులి నడిరోడ్డుపై కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. నడిరోడ్డుపై డివైడర్ దగ్గర హల్చల్ చేసింది. తర్వాత స్థానికుల్ని చూసి భయంతో రోడ్డుపై పరుగులు తీస్తూ వెళ్లి ఓ లారీ డ్రైవర్‌పై దాడి చేసింది. అక్కడి నుంచి మెల్లిగా జారుకుని ...

రాజేంద్రనగర్‌లో మరోసారి చిరుత కలకలం
Jyothi Gadda
| Edited By: |

Updated on: Jun 09, 2020 | 10:02 AM

Share

 రాజేంద్రనగర్‌లో మరోసారి చిరుత కలకలం రేపుతోంది. జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల్లో చిరుత క‌ద‌లిక‌లు క‌నిపించాయి. వ‌ర్సిటీ పరిసరాల్లో సంచారించిన చిరుత నారం ఫామ్‌హౌస్‌లోని ఓ ఇంటిలోకి వచ్చింది. చిరుత సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాకు చిక్కాయి. చిరుత కిటికీ ఎక్కి ఇంట్లోకి తొంగిచూస్తున్న దృశ్యాలు కెమెరాల్లో నమోదు అయ్యాయి. చిరుత సంచారంతో  ఉద్యోగులు, స్థానికుల్లో భయాందోళన నెలకొంది.

మే 14న కాటేదాన్ ప్రాంతంలో చిరుత పులి నడిరోడ్డుపై కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. నడిరోడ్డుపై డివైడర్ దగ్గర హల్చల్ చేసింది. తర్వాత స్థానికుల్ని చూసి భయంతో రోడ్డుపై పరుగులు తీస్తూ వెళ్లి ఓ లారీ డ్రైవర్‌పై దాడి చేసింది. అక్కడి నుంచి మెల్లిగా జారుకుని సమీపంలో ఉన్న ఫామ్‌హౌస్‌వైపు వెళ్లింది. వెంటనే రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు.. దానిని పట్టుకునేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో అది అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయిందని అధికారులు భావించారు.

ఆ తర్వాత రెండు వారాల క్రితం రాజేంద్రనగర్ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో మళ్లీ చిరుత పులి జాడ కనిపించింది. అక్కడి నుంచి అది గగన్‌పహాడ్‌ గుట్టల్లోని అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్టుగా అధికారులు గుర్తించారు. ఇప్పుడు మళ్లీ ఆ చుట్టుపక్కలే చిరుత పులి సంచ‌రిస్తున్న‌ట్లుగా బ‌య‌ట‌ప‌డ‌టంతో ఇటు స్థానికులు, అటు ఉద్యోగులు, అధికారులు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

Follow Us
రేవంత్‌ అండ్ కిషన్‌..! సింగిల్ ఫ్రేమ్‌... డబుల్ ఎజెండా?
రేవంత్‌ అండ్ కిషన్‌..! సింగిల్ ఫ్రేమ్‌... డబుల్ ఎజెండా?
జూలైలో శక్తివంతమైన వ్యతీపాత యోగం.. ఈ 4 రాశుల వారికి ధనలాభం, విజయం
జూలైలో శక్తివంతమైన వ్యతీపాత యోగం.. ఈ 4 రాశుల వారికి ధనలాభం, విజయం
భారత్-పాక్ సరిహద్దుల్లో అర్ధరాత్రి హైడ్రామా!
భారత్-పాక్ సరిహద్దుల్లో అర్ధరాత్రి హైడ్రామా!
ఎండిపోతున్న మనీ ప్లాంట్‌కు జీవం పోసే సూపర్ కిచెన్ చిట్కాలు..
ఎండిపోతున్న మనీ ప్లాంట్‌కు జీవం పోసే సూపర్ కిచెన్ చిట్కాలు..
ఇవాళే OTTలోకి వచ్చేసిన బాక్సాఫీస్ సెన్సేషన్.. తెలుగులోనూ చూడొచ్చు
ఇవాళే OTTలోకి వచ్చేసిన బాక్సాఫీస్ సెన్సేషన్.. తెలుగులోనూ చూడొచ్చు
ఏలినాటి శని కారణంగా జూలైలో వీరికి వాయింపే వాయింపు..
ఏలినాటి శని కారణంగా జూలైలో వీరికి వాయింపే వాయింపు..
జాతకంలో శంఖ యోగం ఉందా? అయితే గౌరవం, సంపద, విజయాలు మీ సొంతమే!
జాతకంలో శంఖ యోగం ఉందా? అయితే గౌరవం, సంపద, విజయాలు మీ సొంతమే!
మార్కెట్ వద్దు.. ఇంటి పెరట్లోనే తియ్యటి ఆర్గానిక్‌ బీట్‌రూట్..
మార్కెట్ వద్దు.. ఇంటి పెరట్లోనే తియ్యటి ఆర్గానిక్‌ బీట్‌రూట్..
స్మార్ట్‌ఫోన్ కోసం కోతి వేసిన ‘స్కెచ్’ చూస్తే మైండ్‌బ్లాక్!
స్మార్ట్‌ఫోన్ కోసం కోతి వేసిన ‘స్కెచ్’ చూస్తే మైండ్‌బ్లాక్!
ధనం, విజయం, శుభఫలితాల కోసం.. ఈ ఒక్క మంత్రం చాలంట!
ధనం, విజయం, శుభఫలితాల కోసం.. ఈ ఒక్క మంత్రం చాలంట!