విశాఖ : దేశవ్యాప్తంగా న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోరుతూ జాతీయ న్యాయవాదుల మండలి పిలుపుమేరకు విశాఖ న్యాయవాదుల సంఘం మంగళవారం విధులు బహిష్కరించింది. ఉదయం 10.30 గంటలకు న్యాయవాదులు తమ విధులు బహిష్కరించారు. జిల్లా కోర్టు నుంచి ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి బయలుదేరారు. దారి పొడవునా నినాదాలతో హోరెత్తించారు. కలెక్టరేట్ ముందు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు బండారు రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం న్యాయవాదుల సంక్షేమం కోసం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. బార్‌కౌన్సిల్ వైస్‌ఛైర్మన్ కె.రామజోగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రం తనవైఖరి మార్చుకోకుంటే దేశవ్యాప్తంగా నిరవధికంగా విధులను బహిష్కరిస్తామన్నారు. డీఆర్‌వో చంద్రశేఖర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.