కేసీఆర్ అంటే..కొత్త నిర్వచనం చెప్పిన కేటీఆర్..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..అన్న మాటకు కొత్త నిర్వచనం చెప్పారు ఐటీ పురపాలక మంత్రి కేటీఆర్. కేసీఆర్ కుమారుడు, టీఆర్ఎస్ కార్యనిర్వాహాక అధ్యక్షుడు, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇచ్చిన కొత్త అర్థం అందరిలో ఆసక్తి రేపింది.

కేసీఆర్ అంటే..కొత్త నిర్వచనం చెప్పిన కేటీఆర్..
Follow us

|

Updated on: May 29, 2020 | 1:12 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..అన్న మాటకు కొత్త నిర్వచనం చెప్పారు ఐటీ పురపాలక మంత్రి కేటీఆర్. కేసీఆర్ కుమారుడు, టీఆర్ఎస్ కార్యనిర్వాహాక అధ్యక్షుడు, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇచ్చిన కొత్త అర్థం అందరిలో ఆసక్తి రేపింది. కే అంటే కాల్వలు, సీ అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లు అని మంత్రి కేటీఆర్ వివరణ ఇచ్చారు. కొండపోచమ్మ ప్రారంభోత్సవం సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరందించాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్న కేసీఆర్ అపరభగీరథుడని పేర్కొన్నారు. సముద్ర మట్టానికి 82 మీటర్ల ఎత్తున ఉన్న మేడిగడ్డ నుంచి 618 మీటర్ల ఎత్తున ఉన్న కొండపోచమ్మ వరకు గోదావరి జలాలను ఎత్తిపోసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద బహుళార్ధ సాధక ప్రాజెక్టు కాళేశ్వరాన్ని యువ తెలంగాణ రాష్ట్రం.. కేవలం మూడేళ్లలోనే పూర్తి చేసి ఘనత సాధించిందని చెప్పారు.

కొండపోచమ్మ సాగర్‌ పంపుహౌస్‌ను(మర్కూక్‌) సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. చినజీయర్‌ స్వామితో కలిసి ఆయన మోటార్‌ ఆన్‌ చేశారు. దీంతో కొండపోచమ్మసాగర్‌ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు పరవళ్లు తొక్కాయి. సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తున నిర్మించిన కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలను ఎత్తిపోయడం ద్వారా రాష్ట్రం కొత్త చరిత్రని లిఖించినట్టయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలక ఘట్టానికి ఈ రోజు తెరలేచింది.

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ