పెరుగుతున్న కరోనా కేసులు.. షార్‌లో మళ్లీ లాక్‌డౌన్
కరోనా నేపథ్యంలో నెల్లూరులోని శ్రీహరి కోట అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో(షార్) మరోసారి అధికారులు లాక్‌డౌన్ విధించారు.
SHAR Lockdown news: కరోనా నేపథ్యంలో నెల్లూరులోని శ్రీహరి కోట అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో(షార్) మరోసారి అధికారులు లాక్‌డౌన్ విధించారు. కరోనా కేసులు పెరగడంతో ఇస్రో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 50 శాతం సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా.. తాజాగా ఉద్యోగుల్లో 20 మందికి పైగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇక మరోవైపు కరోనా నేపథ్యంలో అంతరిక్ష ప్రయోగాలు కూడా స్తంభించాయి. ఇప్పటివరకు ఇస్రో ఒక్క ప్రయోగం మాత్రమే చేపట్టింది. ఈ ఏడాది 12 ప్రయోగాలు చేపట్టాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. కరోనా నేపథ్యంలో ఇస్రో టార్గెట్లు తారుమారు అయ్యాయి.
Read More:
ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. సిలబస్ తగ్గింపు