ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. సిలబస్ తగ్గింపు

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు ఇంటర్మీడియెట్‌ బోర్డు శుభవార్తను తెలిపింది. సిలబస్‌ను 30శాతం మేర కుదించింది. ఈ మేరకు ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి

ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. సిలబస్ తగ్గింపు
Follow us

| Edited By:

Updated on: Aug 17, 2020 | 8:13 AM

AP Intermediate Syllabus: ఏపీలో ఇంటర్ విద్యార్థులకు ఇంటర్మీడియెట్‌ బోర్డు శుభవార్తను తెలిపింది. సిలబస్‌ను 30శాతం మేర కుదించింది. ఈ మేరకు ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి కుదించిన సిలబస్ సమాచారాన్ని బోర్డు తన అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టింది. సైన్స్‌, ఆర్ట్స్ సబ్జెక్ట్‌లకు సంబంధించిన బోధనాంశాలు ఏవి..? కుదించిన అంశాలు ఏవి..? అన్న వివరాలను వెబ్‌సైట్‌లో పొందపరిచారు. ఇక లాంగ్వేజ్‌లకు సంబంధించి కూడా ఒకటి, రెండు రోజుల్లో వివరాలను అప్‌లోడ్‌ చేయనున్నారు.

కాగా ఇప్పటికే కరోనా నేపథ్యంలో 2020-21 విద్యా సంవత్సరానికి గానూ సెంట్రల్‌ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) 30శాతం సిలబస్‌ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అదే బాటలోనే ఏపీ ఇంటర్మీడియెట్‌ బోర్డు కూడా నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం కాలేజీల్లో బోధన సాగించే పరిస్థితి లేకపోవడం, తరగతుల నిర్వహణ ఆలస్యం కానుండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇంటర్మీడియెట్‌ 2019–20 విద్యాసంవత్సరానికి గానూ రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తైన నేపథ్యంలో ఆయా విద్యార్థుల‌ మార్కుల మెమోలను కూడా బోర్డు వెబ్‌సైట్‌లో ఉంచింది.

Read More:

కరోనా సోకిందన్న భయంతో టెకీ ఆత్మహత్య

సచివాలయ సేవలకు ఐరాస సహకారం