తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు
వాయవ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని వలన రాష్ట్రంలో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం
AP Rains update: వాయవ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని వలన రాష్ట్రంలో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అమరావతి కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు వెల్లడించారు. అలాగే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.ఇక మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని ఈ సందర్భంగా సూచించారు. మరోవైపు ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలోని నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. అటు తెలంగాణలోనూ పలుచోట్ల రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Read This Story Also: కరోనా బారిన పడ్డ ‘ఆర్‌ఎక్స్ 100’ దర్శకుడు