లారీలు ఢీ.. భారీగా స్తంభించిన ట్రాఫిక్
విజయవాడలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తడంతో దాన్ని తిలకించేందుకు సందర్శకులు భారీగా తరలివచ్చారు. అదే సమయంలో కృష్ణలంక వారధిపై రెండు లారీలు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంతో భారీగా వాహన రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు నాలుగున్నర గంటలపాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విజయవాడ బస్టాండ్ నుంచి బ్రిడ్జ్ వైపు, గుంటూరు-విజయవాడ ప్రధాన రహదారి, గొల్లపూడి వెళ్లే మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కోల్‌కతా-చెన్నై […]
విజయవాడలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తడంతో దాన్ని తిలకించేందుకు సందర్శకులు భారీగా తరలివచ్చారు. అదే సమయంలో కృష్ణలంక వారధిపై రెండు లారీలు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంతో భారీగా వాహన రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు నాలుగున్నర గంటలపాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విజయవాడ బస్టాండ్ నుంచి బ్రిడ్జ్ వైపు, గుంటూరు-విజయవాడ ప్రధాన రహదారి, గొల్లపూడి వెళ్లే మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిపై కిలోమీటరు మేర రాకపోకలు ఆగిపోయాయి. నాలుగు గంటలకు పైగా రాకపోకలు నిలిచిపోవడం.. అదే సమయంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను చూపకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంబులెన్సులు సైతం ట్రాఫిక్‌లో ఇరుక్కుని ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. సాయంత్రం నాలుగున్నర నుంచి ట్రాఫిక్‌లో చిక్కుకున్నామని వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.