ఆగష్టు 15 వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

ఆగష్టు 15 వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

ఆగష్టు 15 వేడుకలకు సంబంధించి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు.

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 14, 2020 | 12:53 PM

August 15 celebrations AP: ఆగష్టు 15 వేడుకలకు సంబంధించి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్రదినోత్సవ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన ఆయన అనంతరం మాట్లాడారు. కరోనా నేపథ్యంలో నిబంధనలు పాటించి జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. శనివారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వేడుకల్లో పాల్గొని గౌరవ జెండా వందనం చేయనున్నారని తెలిపారు. ఇక పెరేడ్‌కు సంబంధించిన ఫైనల్‌ రిహార్సల్స్‌ని వీక్షించిన గౌతమ్ సవాంగ్‌..‌ వారికి పలు సూచనలు చేశారు. కాగా పెరేడ్‌లో ఆరు బెటాలియన్లకు చెందిన ఆరు కంటింజెంట్లు పాల్గొంటుండగా.. వివిధ శాఖలకు చెందిన పది శకటాలు ప్రదర్శన ఇవ్వనున్నాయి.

Read More:

దిశ ఆత్మహత్య కేసులో ట్విస్ట్‌

గుడ్‌న్యూస్‌.. ‘కొవాగ్జిన్’‌ తొలి దశ ప్రయోగం విజయవంతం

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu