రేణిగుంటలో అగ్నిప్రమాదం.. 10లక్షల ఆస్తి నష్టం

తిరుపతి సమీపంలోని రేణిగుంట ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్నిప్రమాదం జరిగింది. వ్యర్థాలు నిల్వ ఉంచిన గోదాములో మంగళవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. వెంటనే చుట్టుపక్కల వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో.. సంఘటనా స్థలానికి చేరుకున్న వారు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే పక్కనే ఉన్న ప్లాస్టిక్ పైపుల పరిశ్రమలోకి ఈ మంటలు వ్యాపించాయి. దీంతో అక్కడ ఉన్న పైపులు కూడా కాలి బూడిదయ్యాయి. ఆ తరువాత మరో ఫైరింజన్ సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను […]

రేణిగుంటలో అగ్నిప్రమాదం.. 10లక్షల ఆస్తి నష్టం
Follow us

| Edited By:

Updated on: Apr 30, 2019 | 12:07 PM

తిరుపతి సమీపంలోని రేణిగుంట ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్నిప్రమాదం జరిగింది. వ్యర్థాలు నిల్వ ఉంచిన గోదాములో మంగళవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. వెంటనే చుట్టుపక్కల వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో.. సంఘటనా స్థలానికి చేరుకున్న వారు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే పక్కనే ఉన్న ప్లాస్టిక్ పైపుల పరిశ్రమలోకి ఈ మంటలు వ్యాపించాయి. దీంతో అక్కడ ఉన్న పైపులు కూడా కాలి బూడిదయ్యాయి. ఆ తరువాత మరో ఫైరింజన్ సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చింది. ఈ ప్రమాదంలో దాదాపు రూ.10లక్షల ఆస్తి నష్టం వాటిల్లి ఉండొచ్చని అగ్నిమాపక అధికారులు తెలిపారు.