నాణ్యమైన విద్యుత్ పొందడం రైతు హక్కు: డొక్కా

వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ని పొందడం రైతుల హక్కు అని మాజీ మంత్రి, శాసనమండలి సభ్యులు డొక్కా మాణిక్య వర ప్రసాద్ స్పష్టం చేశారు

నాణ్యమైన విద్యుత్ పొందడం రైతు హక్కు: డొక్కా

Dokka Manikya Varaprasad: వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ని పొందడం రైతుల హక్కు అని మాజీ మంత్రి, శాసనమండలి సభ్యులు డొక్కా మాణిక్య వర ప్రసాద్ స్పష్టం చేశారు. దివంగత నేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకాన్ని మరింత మెరుగైన రీతిలో ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని అన్నారు. రానున్న 35ఏళ్ల వరకు రైతులకు ఉచిత విద్యుత్‌కి ఎలాంటి ఢోకా ఉండదని స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్‌ని నగదు బదిలీ పథకానికి చేయడం వలన ప్రభుత్వానికి బాధ్యత, రైతుకు జవాబు దారీతనం వస్తుందని తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో పగటి పూట 9 గంటల పాటు కరెంటు ఇచ్చే పరిస్థితులు లేవని డొక్కా అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు దాదాపు 40 శాతం ఫీడర్లలో పగటి పూట 9 గంటలు కరెంటు ఇవ్వడానికి మౌలిక సదుపాయాలే లేవని.. ఈ పరిస్థితులను మార్చేందుకు ఫీడర్ల ఏర్పాటు, అప్‌గ్రేడేషన్‌ పనుల కోసం జగన్‌ ప్రభుత్వం రూ.1,700 కోట్లు కేటాయించిందని చెప్పుకొచ్చారు. దీనివలన ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో 89 శాతం ఫీడర్లలో పగటిపూటే 9 గంటలపాటు ఉచితంగా విద్యుత్‌ ఇస్తున్నారని డొక్కా చెప్పుకొచ్చారు. ఇక మిగిలిన చోట్ల కూడా వేగంగా పనులు పూర్తి చేసి, రబీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థాయిలో 9 గంటలపాటు పగటి పూట కరెంటు ఇస్తారని వివరించారు.

Read More:

తమిళ్‌లో రీమేక్ అవ్వనున్న ‘దియా’!

కరోనా అప్‌డేట్స్‌: రష్యాకు చేరువలో మహారాష్ట్ర