మంత్రి హరీష్ రావుకు కరోనా నెగటివ్..

తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్ రావు కరోనా వైరస్ మహమ్మారిని జయించారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయనకు తాజాగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగటివ్ వచ్చింది.

మంత్రి హరీష్ రావుకు కరోనా నెగటివ్..
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 12, 2020 | 3:52 PM

Harish Rao Corona Negative: తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్ రావు కరోనా వైరస్ మహమ్మారిని జయించారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయనకు తాజాగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగటివ్ వచ్చింది. హైదరాబాద్‌లోని కోఠి ఆసుపత్రిలో నిర్వహించిన కరోనా పరీక్షల్లో.. హరీష్ రావుకు కోవిడ్ నెగటివ్‌గా నిర్ధారణ అయిందని డాక్టర్లు ప్రకటించారు. దీనితో ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు.

కాగా, ఈ నెల 5వ తేదీన మంత్రి హరీష్ రావుకి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ కావ‌డంతో.. ఆయన హోం ఐసోలేష‌న్ ఉన్న విష‌యం తెలిసిందే. అప్ప‌ట్నుంచి వైద్యుల స‌ల‌హాలు, సూచ‌న‌లు పాటిస్తూ హ‌రీష్‌రావు క‌రోనాను జ‌యించారు. దీంతో ఆయ‌న సోమ‌వారం నుంచి అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: 

ఏపీ విద్యార్ధులకు గమనిక.. ఎంసెట్ హాల్‌ టికెట్స్‌ వచ్చేశాయి..

”ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ సప్లై.. 8 వేల జంబో జెట్‌లు అవసరం”

ఏపీ: నీట్ అభ్యర్థుల కోసం రెండు ప్రత్యేక రైళ్లు… వివరాలివే