దర్శకుడు కొరటాల శివ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం..పోలీస్ స్టేషన్ ఎదుటే..

అనంతపురం జిల్లా మడకశిర పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రముఖ సినీ దర్శకుడు కొరటాల శివ దగ్గర అసిస్టెంట్ రైటర్‌గా పని చేసే మహేష్ అనే యువకుడు పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

దర్శకుడు కొరటాల శివ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం..పోలీస్ స్టేషన్ ఎదుటే..
Jyothi Gadda

|

Sep 22, 2020 | 7:10 PM

అనంతపురం జిల్లా మడకశిర పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రముఖ సినీ దర్శకుడు కొరటాల శివ దగ్గర అసిస్టెంట్ రైటర్‌గా పని చేసే మహేష్ అనే యువకుడు పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల వల్ల తన జీవితం నాశనం అయిందని, పీటల మీద పెళ్లి ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ బాధితుడు ఆందోళనకు దిగాడు.

అనంతపురం జిల్లా మడకశిర మండలం చీపులేటి గ్రామానికి చెందిన మహేష్ డైరెక్టర్ కొరటాల శివ దగ్గర అసిస్టెంట్ రైటర్‌గా పనిచేస్తున్నాడు. సెప్టెంబర్ 21న తన అన్నను పోలీసులు అరెస్ట్ చేశారని, తన అన్నయ్య అక్రమంగా కర్ణాటక మద్యం అమ్ముతున్నాడని పోలీసులు తమ ఇంట్లో దాడులు జరిపారని ఆరోపించాడు. తమతో విచక్షణ రహితంగా ప్రవర్తించారని చెప్పాడు. ఈ ఘటనతో తన పెళ్లి ఆగిపోయిందని మహేష్ మనస్థాపం చెందాడు. మడకశిర పోలీస్ స్టేషన్ ఆవరణలోనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. కాగా, పోలీసులే తనకు న్యాయం చేయాలని కోరాడు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu