AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Arnab Live: అర్నబ్ తుఫాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు.. నష్టపోయిన పంటలకు సర్కార్ పరిహారం

Cyclone Arnab Rains Live Updates: అర్నబ్ తుఫాన్‌ తీరం దాటింది.. దాదాపు 5 గంటలపాటు తీరాన్ని దాటే ప్రక్రియ కొనసాగింది. అర్నబ్ బలహీనపడి తీవ్ర తుఫాన్‌గా మారింది. యానాంకు నైరుతిదిశగా తుఫాన్‌ తీరం దాటింది. తీరం వెంబడి గంటకు 125–135 కి.మీల వేగంతో భీకర గాలులు వీస్తున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.

Cyclone Arnab Live: అర్నబ్ తుఫాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు.. నష్టపోయిన పంటలకు సర్కార్ పరిహారం
Cyclone Arnab Latest Updates
Ram Naramaneni
| Edited By: |

Updated on: Oct 28, 2026 | 8:51 PM

Share

LIVE NEWS & UPDATES

  • 28 Oct 2026 08:50 PM (IST)

    అరకు ఘాట్ రోడ్డులో కూలిన రిటైనింగ్ వాల్

    • అర్నబ్‌ తుఫాన్ ప్రభావంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు
    • ఉధృతంగా ప్రవహిస్తున్న చాపరాయి జలపాతం
    • వర్షం ధాటికి జలవిహార్‌ వద్ద కూలిన రక్షణ గోడ
    • అరకు – విశాఖ ఘాట్‌ రోడ్డులో బీసుపురం వద్ద కూలిన రిటైనింగ్‌ వాల్‌
  • 28 Oct 2026 08:00 PM (IST)

    హోంమంత్రి అనిత పర్యటన

    • తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో హోంమంత్రి అనిత పర్యటన
    • పాయకరావుపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో విస్తృత పర్యటన
    • లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపుపై అధికారులతో చర్చ
    • పునరావాస కేంద్రాల్లో అందుతున్న సహాయక చర్యలపై ఆరా
  • 28 Oct 2026 06:50 PM (IST)

    ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

    • ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన
    • తుపాను ప్రభావంతో గురువారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు
    • శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు
    • మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
    • గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం
  • 28 Oct 2026 06:00 PM (IST)

    నష్టపోయిన పంటలకు పరిహారం

    • నష్టపోయిన పంటలకు పరిహారం ప్రకటించిన ఏపీ సర్కార్‌
    • పత్తి, గోధుమ పంటలకు ఎకరాకు రూ.25 వేల పరిహారం
    • వరి పంటకు ఎకరాకు రూ.20 వేల సాయం
    • చెరుకు పంటకు ఎకరాకు రూ.25 వేల పరిహారం
    • సజ్జ, మినుము, పెసర, మొక్కజొన్న, రాగి, శెనగ..
    • సోయాబీన్, పొద్దుతిరుగుడుకు రూ.15 వేల సాయం
    • అరటి, పసుపు, మామిడి, జీడిమామిడితో పాటు..
    • కాఫీ, డ్రాగన్ ఫ్రూట్‌కు ఎకరాకు రూ.35 వేల పరిహారం
    • కూరగాయలు, బొప్పాయి, టమాట, పైనాపిల్‌కు రూ.25 వేలు
    • తమలపాకు తోటలకు ఎకరాకు రూ.75 వేల పరిహారం
    • కొబ్బరి, ఆయిల్ పామ్‌ ఒక్కో చెట్టుకు రూ.15 వేలు
  • 28 Oct 2026 05:40 PM (IST)

    క్షేత్రస్థాయి పర్యటనకు చంద్రబాబు

    • రేపటి నుంచి క్షేత్రస్థాయి పర్యటనకు చంద్రబాబు
    • తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన
    • 2 రోజుల పాటు పర్యటించనున్న సీఎం చంద్రబాబు
  • 28 Oct 2026 05:21 PM (IST)

    తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

    • తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
    • ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం
    • భద్రాద్రి కొత్తగూడెం,భూపాలపల్లి జిల్లాలకు వర్షసూచన
    • ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు
    • ములుగు, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం
    • వరంగల్ జిల్లాలో ఉరుములతో కూడిన జల్లులు
    • గంటకు 40 కి.మీ.లోపు వేగంతో ఈదురుగాలులు వీచే సూచన
  • 28 Oct 2026 04:31 PM (IST)

    ప్రజలు ఇండ్లలోనే ఉండాలని సూచన

    • తూ.గో, ప.గో, గుంటూరు జిల్లాలో మోస్తరు వర్షం
    • గంటకు 50-60 కి.మీ. వేగంతో గాలులు..
    • ప్రజలు ఇండ్లలోనే ఉండాలని అధికారుల సూచన
  • 28 Oct 2026 04:04 PM (IST)

    ఏపీలో భారీ వర్షాలు

    • అర్నబ్ తుఫా‌న్‌తో ఏపీలో భారీ వర్షాలు
    • గరివిడిలో అత్యధికంగా 26 సెం.మీ. వర్షం
    • అనకాపల్లి ఎస్.కోటలో 25 సెం.మీ వర్షపాతం
    • మెంటాడ, యలమంచలిలో 24 సెం.మీ. వర్షపాతం
    • గంట్యాడ, రణస్థలంలో 23 సెం.మీ. వర్షపాతం
  • 28 Oct 2026 03:41 PM (IST)

    తుఫాన్ ఎఫెక్ట్‌తో ఏడుగురు మృతి

    • అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్‌తో ఏపీలో ఏడుగురు మృతి
    • అనకాపల్లి జిల్లాలో తుఫాన్ ప్రభావంతో ఒకరు మృతి
    • విశాఖ జిల్లాలో ఇద్దరు మృతి
    • పగో జిల్లాల్లో ఇద్దరు, కోనసీమ జిల్లాలో ఇద్దరు మృతి
  • 28 Oct 2026 03:23 PM (IST)

    కోనసీమ, కాకినాడ జిల్లాల్లో తుఫాన్ బీభత్సం

    • కోనసీమ, కాకినాడ జిల్లాల్లో తుఫాన్ బీభత్సం
    • ఎక్కడికక్క నిలిచిపోయిన కమ్యూనికేషన్
    • ఈ ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్దరణ వేగవంతం
    • అటు విజయనగరం జిల్లాలోని భోగాపురంలో విరిగిపడిన చెట్లు
  • 28 Oct 2026 03:03 PM (IST)

    ఏపీలో దెబ్బతిన్న రోడ్లు

    • అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో ఏపీలో దెబ్బతిన్న రోడ్లు
    • రాష్ట్రవ్యాప్తంగా 126.165 కి.మీ. రహదారులకు నష్టం – మంత్రి జనార్ధన్ రెడ్డి
    • దెబ్బతిన్న 9 కల్వర్టు పనుల్లో 6 పునరుద్ధరణ
    • రహదారులపై 1,058 చెట్లు నేలకొరగగా.. 859 చెట్ల తొలగింపు
    • 57 చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం.. 20 చోట్ల రాకపోకల పునరుద్ధరణ
    • శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 111.665 కి.మీ. రహదారులకు నష్టం – మంత్రి
  • 28 Oct 2026 02:40 PM (IST)

    తీవ్ర ప్రభావం చూపిస్తున్న అర్నబ్ తుఫాన్

    • తీవ్ర ప్రభావం చూపిస్తున్న అర్నబ్ తుఫాన్
    • 36 ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదు
    • 143 చోట్ల అతిభారీ వర్షాలు నమోదు
    • 205 చోట్ల భారీ వర్షాలు నమోదు
  • 28 Oct 2026 02:14 PM (IST)

    కోస్తాంధ్రకు ఫ్లాష్‌ఫ్లడ్ అలెర్ట్

    • కోస్తాంధ్రకు ఫ్లాష్‌ఫ్లడ్ అలెర్ట్
    • కోస్తాంధ్ర జిల్లాల్లో ఆకస్మిక వరదముప్పు
    • 24 గంటలపాటు హైఅలెర్ట్ ప్రకటించిన వాతవరణశాఖ
  • 28 Oct 2026 01:39 PM (IST)

    ఏలూరు జిల్లాలో అర్నబ్ సైక్లోన్‌ విధ్వంసం

    ఏలూరు జిల్లాలో అర్నబ్ సైక్లోన్‌ విధ్వంసం సృష్టించింది. గంటకు 100 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు, భారీ విధ్వంసం పెను నష్టాన్ని మిగిల్చాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో ప్రధాన రహదారులపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

  • 28 Oct 2026 01:17 PM (IST)

    ప్రజా రవాణాపై తుఫాన్ ఎఫెక్ట్..

    ప్రజా రవాణాపై తుఫాన్ ఎఫెక్ట్..

    సుమారు 100 బస్సులు, 100 రైళ్లు రద్దు..

    కాకినాడ, విశాఖపట్నం, మచిలీపట్నం, నర్సీపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులను రద్దు చేసిన అధికారులు..

    తుఫాన్ తీవ్రత తగ్గేవరకు బస్సులు రద్దు చేస్తామంటున్న ఆర్టీసీ అధికారులు..

    తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు..

    స్వస్థలాలకు వెళ్లేందుకు బస్సులు, రైళ్ల కోసం ప్రయాణికుల ఎదురుచూపులు..

  • 28 Oct 2026 01:17 PM (IST)

    నీట మునిగిన ఆర్టీసీ బస్టాండ్

    అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్‌తో నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్ నీట మునిగింది. మోకాళ్లలోతు నీళ్లలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. టికెట్ సెంటర్, అడ్మిస్ట్రేషన్ ఆఫీసులోకి కూడా నీళ్లు చేరి స్టేషనరీ మొత్తం తడిసింది. రెస్క్యూ సిబ్బంది వరద నీరు బయటకు పంపే ప్రయత్నాలు చేస్తున్నారు.

  • 28 Oct 2026 12:37 PM (IST)

    ఈదురుగాలులకు గుడిసె కూలి వృద్ధురాలి మృతి..

    కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదికర ప్రకాష్‌పురంలో వృద్ధురాలు మృతి చెందారు. ఈదురుగాలుల వర్షానికి గుడిసె కూలి కొల్లు వెంకాయమ్మ అనే వృద్ధురాలు మృతి చెందారు.

  • 28 Oct 2026 12:07 PM (IST)

    కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ

    ఏపీపై అర్నబ్ తుఫాను ప్రభావంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాసిన సీఎం చంద్రబాబు

    తఫాను తీవ్రత కారణంగా రాష్ట్రంలో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నట్టు లేఖలో పేర్కొన్న సీఎం

    త్వరితగతిన తుఫాను నష్టం పై అంచనాకు కేంద్ర బృందాలను పంపాలని కోరిన ముఖ్యమంత్రి

    తుఫాను నష్టంపై సమగ్ర అంచనా అనంతరం కేంద్రానికి నివేదిక సమర్పిస్తామని సీఎం వెల్లడి

    తుపాను సహాయక చర్యలకు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఇతర కేంద్ర సంస్థల సహకారం కొనసాగించాలని కేంద్రానికి విజ్ఞప్తి

  • 28 Oct 2026 11:51 AM (IST)

    తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

    తెలంగాణా వెదర్ అప్డేట్…

    తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

    తెలంగాణలో మరో 2–3 గంటల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం

    పలు జిల్లాలకు ఎల్లో వార్నింగ్ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం

    భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్ష సూచన

    మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం

    జనగామ, భూపాలపల్లి జిల్లాల్లోనూ వర్ష సూచన

    నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో తేలికపాటి వర్షాలు

    వరంగల్, హనుమకొండ జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం

    యాదాద్రి భువనగిరి జిల్లాలో తేలికపాటి వర్ష సూచన

  • 28 Oct 2026 11:38 AM (IST)

    రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిన తుఫాన్

    కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో తుఫాను ప్రభావం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈదురుగాలులు, వర్షాల వల్ల ఎంతో కష్టపడి సాగు చేసిన అరటి తోటలు, వరి చేలు నేలకొరిగాయి. తుపాను దెబ్బకు రామచంద్రపురం నియోజకవర్గంలో సుమారు 51 వేల ఎకరాల వరి పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది.

    సాగు చేసిన విస్తీర్ణంలో సుమారు 90 శాతం వరి పంట నేలమట్టం కావడంతో, ఆరుగాలం శ్రమ కళ్ల ముందే కరిగిపోయిందని రైతన్నలు కన్నీరుమున్నీరవుతున్నారు.

  • 28 Oct 2026 11:24 AM (IST)

    దెబ్బతిన్న రైల్వే ట్రాక్..

    అల్లూరి జిల్లాలో కురిసిన భారీవర్షాలకు కేకే లైన్‌లో రైల్వే ట్రాక్ దెబ్బతింది

    బొర్రగుహలు-కరకవలస మధ్య మట్టి కొట్టుకుపోవడంతో ట్రాక్ ధ్వంసమయింది

    దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి

    ట్రాక్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు రైల్వే సిబ్బంది

  • 28 Oct 2026 11:22 AM (IST)

    సూర్యాపేట జిల్లాలో మోస్తరు వర్షాలు

    అర్నబ్ తుఫాన్‌తో సూర్యాపేట జిల్లాలో మోస్తరు వర్షాలు

    సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో తడిసిన ధాన్యం

    అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఇవాళ మార్కెట్ కు సెలవు

    వర్షానికి తడిసిపోయిన ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న ధాన్యం

    ఆలస్యంగా మార్కెట్‌కు సెలవు ప్రకటించారని రైతుల ఆగ్రహం

  • 28 Oct 2026 11:04 AM (IST)

    అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంపై CM చంద్రబాబు మరోసారి సమీక్ష

    అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంపై CM చంద్రబాబు మరోసారి సమీక్ష నిర్వహించారు. తుఫాన్‌ ధాటికి నేలకొరిగిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. తుఫాన్‌ తీవ్రత తగ్గిన వెంటనే విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించాలని సూచించారు. చెరువులు, కాలువలు పొంగిపొర్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

  • 28 Oct 2026 11:03 AM (IST)

    విజయవాడలో భారీ వర్షం

    అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావం ఏపీలో కొనసాగుతోంది. విజయవాడలో భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షం..ఈదురుగాలులతో జనజీవనం అస్తవ్యస్తమైంది. గాలుల తాకిడికి రహదారులపై భారీ వృక్షాలు నేలకొరుగుతున్నాయి. విద్యుత్ వైర్లు తెగిపడుతున్నాయి.

  • 28 Oct 2026 10:49 AM (IST)

    తుఫాన్ ఎఫెక్ట్‌తో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ

    తుఫాన్ ఎఫెక్ట్‌తో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖజిల్లాలతోపాటు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది చెప్పారు మంత్రి గొట్టిపాటి రవికుమార్

    పరిస్థితిని అర్థం చేసుకుని ప్రజలు సహకరించాలని కోరారు

    883 ఫీడర్లకు 391 ఫీడర్లు దెబ్బతిన్నాయని,

    కొన్నిచోట్ల ప్రమాదాల నివారణకు ముందస్తుగా విద్యుత్ సరఫరా నిలిపివేశామని వివరించారు

    వర్షాలు పడేచోట విద్యుత్ పునరుద్దరణ పనులకు ఆటంకం ఉందని,

    పరిస్థితి అనుకూలించగానే విద్యుత్ పునరుద్ధరణకు సిబ్బంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు

  • 28 Oct 2026 10:48 AM (IST)

    కుంభాభిషేకం హార్బర్‌లో కొట్టుకువచ్చిన బోట్లు

    కాకినాడలో అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్

    కుంభాభిషేకం హార్బర్‌లో కొట్టుకువచ్చిన బోట్లు

    తీరానికి కొట్టుకొచ్చిన లక్షల విలువైన బోట్లు, వలలు

    బోట్లు, వలలు దెబ్బతినడంతో మత్స్యకారుల ఆవేదన

    జగన్నాథపురం దగ్గర కొట్టుకుపోయిన బార్జీలు

    బియ్యం లోడ్‌తో సముద్రంలో నిలిచిపోయిన బార్జీలు

    పరిశీలించిన ఎమ్మెల్యే వనమాడి కొండబాబు

  • 28 Oct 2026 10:22 AM (IST)

    యానాం-నరసాపురం మధ్య తీరం దాటిన తుఫాన్‌

    తీరం దాటిన అర్నబ్‌ తుఫాన్‌

    బలహీనపడి తీవ్ర తుఫాన్‌గా మారిన అర్నబ్

    యానాం-నరసాపురం మధ్య తీరం దాటిన తుఫాన్‌

    తీరం దాటిన సమయంలో 125-135 కి.మీ. వేగంతో గాలులు

    గరిష్ఠంగా గంటకు 150 కి.మీ. వేగంతో ఈదురుగాలులు

  • 28 Oct 2026 10:20 AM (IST)

    తీరం దాటిన అర్నబ్ తుఫాన్

    అర్నబ్ తుఫాన్‌ తీరం దాటింది.. దాదాపు 5 గంటలపాటు తీరాన్ని దాటే ప్రక్రియ కొనసాగింది. అర్నబ్ బలహీనపడి తీవ్ర తుఫాన్‌గా మారింది. యానాంకు నైరుతిదిశగా తుఫాన్‌ తీరం దాటింది. తీరం వెంబడి గంటకు 125–135 కి.మీల వేగంతో భీకర గాలులు వీస్తున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.

  • 28 Oct 2026 09:57 AM (IST)

    రైతులను నట్టేట ముంచేసిన ఆర్నబ్ తుఫాన్

    రైతులను నట్టేట ముంచేసిన ఆర్నబ్ తుఫాన్….

    రామచంద్రపురం మండలం, కే గంగవరం మండలం కాజులూరు మండలాల్లో గల గ్రామాల్లో నెలకొరిగిన వేలాది వరి పంట పొలాలు..

    రామచంద్రపురం నియోజవర్గంలో సుమారు 51 వేల ఎకరాల పంట పొలాలకు నష్టం..

    రామచంద్రపురం మండలంలో 19,275 ఎకరాలు, కే గంగవరం మండలం 19 వేల ఎకరాలు, కాజులూరు మండలంలో సుమారు 16 వేల ఎకరాలు వరి పంట సాగు చేస్తున్నారు..

    వీటిలో 90 శాతం వరి పంట పొలాలు నేల కొరిగి నష్టానికి గురైనట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేసి ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం..

    ప్రస్తుతం వరి పంట పొలాలు ఈనిక దశ దాటి పాలు తోడుకునే దశలో ఉండగా నేలకొరకడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..

    ఆర్నబ్ తుఫాన్ రైతులను తీవ్ర నష్టాల్లోకి నెట్టేసింది..

    ఆరుగాలం పండించిన పంట చేతికి అందే దశలో ఉండగా పొలాలన్నీ నేలపడటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

  • 28 Oct 2026 09:45 AM (IST)

    మూడు గంటలుగా సముద్రంలోనే తిష్ఠవేసిన అర్నబ్‌

    కొనసాగుతున్న తుఫాన్ తీరం దాటే ప్రక్రియ

    ఈ ఉదయం 5.30సమయంలో కాకినాడ, యానాంని టచ్ చేసిన అవుటర్‌ కోర్

    ప్రస్తుతం సముద్రంలోనే నిలకడగా కదలాడుతున్న అర్నబ్ తుఫాన్ కేంద్రం

    స్వల్పంగా దిశ మార్చుకున్నట్లుగా కనిపిస్తున్న అర్నబ్

    ఉదయం 7.30గంటల సమయంలో యానాం మీదుగా U కొత్తపల్లి వైపు దిశ

    ఇప్పుడు మామిడి కుదురు- అల్లవరం తీరానికి దగ్గర్లో కనిపిస్తున్న తుఫాన్ కేంద్రం

    మూడు గంటలుగా సముద్రంలోనే తిష్ఠవేసిన అర్నబ్‌

    అక్కడక్కడే ముందుకూ వెనక్కి కదలిక తప్ప తీరంవైపు రాని అర్నబ్‌

    మధ్యాహ్నానికి తీరం వైపు తుఫాన్ కేంద్రం రావచ్చని అంచనా

    మధ్యాహ్నానికి తీరం దాటగలిగితే ఆ తీవ్రతతో రాత్రి 7వరకూ కొనసాగనున్న భారీ వర్షపాతం

  • 28 Oct 2026 09:19 AM (IST)

    మరో గంటలో పూర్తిగా తీరం దాటే అవకాశం

    నిలకడగా ఉన్న తీరం దాటే ప్రక్రియ

    నరసాపురానికి 20 కిమీ దూరంలోనే కేంద్రీకృతం

    తుపాను కేంద్రం యానాం తీరంపై ఉంది

    మరో గంటలో పూర్తిగా తీరం దాటే అవకాశం

    తీరం వెంబడి కొనసాగనున్న బలమైన ఈదురుగాలులు

    కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం

    తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ప్రఖర్ జైన్ , ఎండీ, విపత్తుల సంస్థ.

  • 28 Oct 2026 08:57 AM (IST)

    వందకు పైగా రైళ్ల రద్దు

    – తుఫాన్‌ కారణంగా అప్రమత్తమైన సౌత్ కోస్ట్ రైల్వే

    – హెల్ప్‌లైన్‌ నెంబర్లతో పాటు వార్‌రూమ్‌లు సిద్ధం

    – రైల్వే ట్రాక్‌ల పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు

    – విజయవాడలో వందకు పైగా రైళ్ల రద్దు

    – 50కిపైగా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, 40కిపైగా ప్యాసింజర్‌ రైళ్లు రద్దు

    – రాష్ట్రవ్యాప్తంగా 26 స్టేషన్లలో హెల్ప్ లైన్లు ఏర్పాటు

  • 28 Oct 2026 08:56 AM (IST)

    అర్నబ్‌ తుఫాన్‌ బీభత్సం.. తీరప్రాంతాలకు హెచ్చరిక.

    అర్నబ్‌ తుఫాన్‌ బీభత్సం.. తీరప్రాంతాలకు హెచ్చరిక.

    అతి తీవ్ర తుఫాన్‌గా కొనసాగుతున్న అర్నబ్‌ తీరం దాటే ప్రక్రియ కొనసాగుతోంది.

    గంటకు 3 కి.మీ. వేగంతో కదులుతున్న తుఫాన్‌ యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది.

    రాబోయే 3 గంటల్లో 150 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి.

    కాకినాడ, యానాం ప్రాంతాల్లో ఉప్పెన ముప్పు ఉండగా, సాధారణం కంటే 2.5 మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడే అవకాశం ఉంది.

  • 28 Oct 2026 08:21 AM (IST)

    కోస్తా జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు

    బాపట్ల, గుంటూరు, కృష్ణ, ఎన్టీఆర్, ఏలూరు, వెస్ట్ గోదావరి, కోనసీమ, ఈస్ట్ గోదావరి, కాకినాడ, అల్లూరి జిల్లా, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతిపురం మన్యం జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్

    ఈరోజు రాత్రి 11:30 లోగా ఏ సమయంలోనైనా ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం

  • 28 Oct 2026 08:16 AM (IST)

    ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..

    ఈరోజు రెడ్ అలర్ట్ జిల్లాలు :

    విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లా, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణ, బాపట్ల, ఎన్టీఆర్

    రెడ్ అలెర్ట్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం కురిసే అవకాశం

    ఆరెంజ్ అలర్ట్ జిల్లాలు : శ్రీకాకుళం, పార్వతిపురం మన్యం, విజయనగరం, గుంటూరు, పల్నాడు

    ఆరెంజ్ ఎలక్ట్రిక్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. 12 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం

    ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు

  • 28 Oct 2026 07:56 AM (IST)

    అర్నబ్ తుపాను లైవ్ వీడియో..

    అర్నబ్ తుపాన్ లైవ్ వీడియో చూడండి..

  • 28 Oct 2026 07:44 AM (IST)

    నరసాపురానికి 30 కిమీ దూరంలోనే కేంద్రీకృతం

    రెండు గంటలుగా నిలకడగా ఉన్న తీరం దాటే ప్రక్రియ

    నరసాపురానికి 30 కిమీ దూరంలోనే కేంద్రీకృతం

    మధ్యాహ్ననికి పూర్తిగా తీరం దాటే అవకాశం

    తీరం వెంబడి కొనసాగనున్న బలమైన ఈదురుగాలులు, వర్షాలు

    ఇవాళ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ప్రఖర్ జైన్ , ఎండీ, విపత్తుల సంస్థ.

  • 28 Oct 2026 07:25 AM (IST)

    తెలంగాణపై అర్నబ్ తుఫాన్‌ ప్రభావం

    తెలంగాణపై అర్నబ్ తుఫాన్‌ ప్రభావం

    ఉమ్మడి ఖమ్మం జిల్లా, ములుగులో అత్యంత భారీవర్షాలు

    వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, మంచిర్యాల..

    ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో భారీవర్షాలు

    సూర్యాపేట జిల్లాకు భారీ వర్ష సూచన

  • 28 Oct 2026 07:14 AM (IST)

    విశాఖను ముంచెత్తిన భారీ వర్షం

    విశాఖను ముంచెత్తిన భారీ వర్షం

    తెల్లవారుజామున 3:30 గంటల వరకు భారీ వర్షాల నమోదు

    21.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు

    గోపాలపట్నంలో 20 సెంటీమీటర్ల వర్షపాతం

    విశాఖపట్నం రూరల్‌లో 16 సెంటీమీటర్లు, పెందుర్తిలో 15, పద్మనాభంలో 15, సీతమ్మధార, ఆనందపురములలో 14 సెంటీమీటర్లు, మహారాణిపేట, గాజువాక, ములగాడలో 12 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది

  • 28 Oct 2026 07:08 AM (IST)

    ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు

    ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు

    11 జిల్లాలకు రెడ్ అలర్ట్, 5 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్ జారీ అయ్యింది

    రెడ్ అలెర్ట్ జారీ అయిన జిల్లాలు- బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, అల్లూరి, అనకాపల్లి, విశాఖ

    ఆరెంజ్ అలర్ట్ జిల్లాలు- పల్నాడు, గుంటూరు, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం

  • 28 Oct 2026 07:07 AM (IST)

    కోనసీమలో తుఫాన్ ఎఫెక్ట్‌తో ఎక్కడికక్కడ పడిపోయిన చెట్లు

    కోనసీమలో తుఫాన్ ఎఫెక్ట్‌తో ఎక్కడికక్కడ పడిపోయిన చెట్లు

    అంబాజీపేటలో నేలకొరిగిన కొబ్బరి చెట్లు, అరటి తోటలు

    ఇంటి ముందు చెట్టు పడి కారు, బైక్ పూర్తిగా ధ్వంసం

    కోనసీమలో ఇప్పటికీ కొనసాగుతున్న ఈదురుగాలులు

    మచిలీపట్నంలోనూ భారీగా తుఫాన్ ఎఫెక్ట్

    జలమయం అయిన లోతట్టు ప్రాంతాలు

    కృష్ణా జిల్లా కైకలూరులోనూ భారీగా ఈదురుగాలులు

  • 28 Oct 2026 06:56 AM (IST)

    రాత్రి నుంచి కురుస్తున్న వర్షం

    విజయవాడ నగరవ్యాప్తంగా రాత్రి నుంచి కురుస్తున్న వర్షం

    అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని జనానికి అధికారుల హెచ్చరిక

    లోతట్టు ప్రాంతాలు, కొండపై నివసిస్తున్న ప్రజలు మరింత అప్రమతంగా ఉండాలని సూచన

    అవసరమైన వారు పునరావస కేంద్రాలను వినియోగించుకోవాలంటున్నారు అధికారులు

    నదీతీరాలకు వెళ్లకండి.. నదులు, కాలువలు, వాగులు దాటే ప్రయత్నం చేయకండి అంటూ సూచిస్తున్నారు

    వదంతులు నమ్మవద్దు అంటున్నారు అధికారులు

  • 28 Oct 2026 06:50 AM (IST)

    అర్నబ్ తుఫాను ఎఫెక్ట్.. అప్రమత్తమైన అధికార యంత్రాంగం

    అర్నబ్ తుఫాను ఎఫెక్ట్

    ఉమ్మడి విశాఖ జిల్లాలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం

    విశాఖ అనకాపల్లి అల్లూరి జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు

    విశాఖ, అల్లూరి జిల్లాలో పర్యాటక కేంద్రాల మూసివేత

    పాడేరు ఏజెన్సీలో ఘాట్ రోడ్ల మూసివేత

    కంట్రోల్ రూమ్ ల నుంచి అధికారుల పర్యవేక్షణ

    తదుపరి సూచనలు జారీ చేసే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు

  • 28 Oct 2026 06:40 AM (IST)

    అర్నబ్ తుఫాన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు వరుస సమీక్షలు

    అర్నబ్ తుఫాన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు వరుస సమీక్షలు

    అధికారులతో అర్ధరాత్రి వరకు సాగిన రివ్యూ

    టెలికాన్ఫరెన్సు ద్వారా జిల్లా కలెక్టర్లు, క్షేత్రస్థాయి అధికారులు, RTGS అధికారులతో సమీక్ష

    ఎక్కడా ఆస్తి, ప్రాణనష్టం లేకుండా చూడాలని సీఎం దిశానిర్దేశం

    తుఫాను ప్రభావ తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడకుండా పూర్తి అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచన

  • 28 Oct 2026 06:34 AM (IST)

    బాపట్లకు ఎంత దూరంలో ఉందంటే..

    కాకినాడకు దక్షిణ-నైరుతి దిశగా 70 కి.మీ దూరంలో..

    మచిలీపట్నానికి తూర్పు-ఈశాన్య దిశగా 90 కి.మీ దూరంలో..

    బాపట్లకు తూర్పు-ఈశాన్య దిశగా 170 కి.మీ దూరంలో అర్నబ్ తుఫాను కేంద్రీకృతమైంది..

  • 28 Oct 2026 06:31 AM (IST)

    తీరానికి అత్యంత సమీపంలో భీకర తుఫాను అర్నబ్

    తీరానికి అత్యంత సమీపంలో భీకర తుఫాను అర్నబ్

    నర్సాపూర్‌కు తూర్పున కేవలం 30 కి.మీ, యానానికి 45 కి.మీ దూరంలో కేంద్రీకృతమైన తుఫాను కేంద్రం..

    ప్రస్తుతం కొనసాగుతున్న ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ.. రాబోయే 3 గంటల పాటు తీరం దాటనున్న అర్ణబ్..

    తీరం వెంబడి గంటకు 125–135 కి.మీల వేగంతో భీకర గాలులు.. 150 కి.మీల వేగంతో వీచనున్న ఈదురు గాలులు..

    ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాలకు రెడ్ మెసేజ్ హెచ్చరికలు జారీ..

  • 28 Oct 2026 05:59 AM (IST)

    కోస్తాంధ్రలోని వర్షం

    కోస్తాంధ్రలోని అన్ని ప్రాంతాల్లో బుధవారం 7- 20 సెం.మీ. వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్‌ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురవొచ్చు.

  • 28 Oct 2026 04:10 AM (IST)

    పోలవరం, కాకినాడ, కోనసీమ, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు

    పోలవరం, కాకినాడ, కోనసీమ, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సముద్ర తీర గ్రామాలు, లోతట్టు ప్రాంత వాసులను శిబిరాలకు వెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారు. అధికారులతో సీఎం నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

  • 28 Oct 2026 03:10 AM (IST)

    కొనసాగుతున్న ల్యాండ్‌ ఫాల్‌ ప్రక్రియ

    తుఫాను తీరం దాటడంతో ల్యాండ్ ఫాల్ ప్రక్రియ కొనసాగుతోంది. నర్సాపూర్ కు 30కిమీ, యానాంకు 55 కిమీ, కాకినాడకు 70కిమీ, మచిలీపట్నంకు 90కిమీ దూరంలో కేంద్రీకృమైందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాగల మూడు గంటలు కాకినాడ, కోనసీమ, పగో జిల్లాల్లో గంటకు 125-135కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. పోలవరం, కాకినాడ, కోనసీమ ,తూగో జిల్లాల్లో భారీ వర్షాలు కురియనున్నాయి. పగో, ఏలూరు, ఎన్టీఆర్ , కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

  • 28 Oct 2026 02:45 AM (IST)

    తీరం దాటే సమయంలో 135 కి.మీ వేగంతో గాలులు

    అర్నబ్‌ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. సముద్రంలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. తీరం దాటే సమయంలో 125-135 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇక కాకినాడలో భారీ వర్షంతో రహదారులపై భారీ వృక్షాలు కూలిపోయాయి. ఇంద్రపాలెం దగ్గర కారాఉపై చెట్టు కూలిపోయింది.

  • 28 Oct 2026 02:06 AM (IST)

    ఉప్పాడ తీరంలో సముద్రం ఉగ్రరూపం

    అర్నబ్‌ తుఫాను కారణంగా కాకినాడలో భారీ వర్షం కురుస్తోంది. ఉప్పాడ తీరంలో సముద్రం ఉగ్రరూపందాల్చింది. ఉప్పాడ తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. బీచ్‌రోడ్డు కోతకు గురై బండరాళ్లు కొట్టుకుపోయాయి. వరద ముంపులో పల్లిపేట, రంగంపేట గ్రామాలు ఉన్నాయి.

  • 28 Oct 2026 02:02 AM (IST)

    తీరానికి సమీపంలో తుఫాను

    అర్నబ్‌ తుఫానుపై ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌అందిస్తోంది. తుఫాను తీరానికి సమీపంలో ఉందని తెలిపింది. తుఫాను తీరందాటే ప్రక్రియ ప్రారంభమైందని, పూర్తిగా తీరం దాటేందుకు రావడానికి 2-3గంటల సమయం పట్టనుంది. యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నర్సాపూర్ కు 30కిమీ, యానాంకు 60 కిమీ, కాకినాడకు 80కిమీ, మచిలీపట్నంకు 80కిమీ దూరంలో కేంద్రీకృం అయ్యిందని, గడిచిన 6 గంటల్లో గంటకు 10కిమీ వేగంతో కదులుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌ తెలిపారు. దీని ప్రభావంతో బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అత్యవసరమైతే కంట్రోల్ రూమ్ నంబర్స్ సంప్రదిచాలని కోరారు.

  • 28 Oct 2026 01:59 AM (IST)

    కలెక్టర్లతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్

    తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని వివిధ జిల్లా కలెక్టర్లతో  సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్సు ఏర్పాటు చేసి మాట్లాడారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

  • 28 Oct 2026 01:51 AM (IST)

    తుఫాన్‌పై అధికారులకు సీఎం దిశానిర్దేశం

    ఆర్నబ్ తుఫాన్‌ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటోంది. తుఫాన్ ప్రభావంపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. సీఎం చంద్రబాబు తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. అదే సమయంలో ప్రజలకు సైతం కీలక సూచనలు చేశారు.

  • 28 Oct 2026 01:48 AM (IST)

    కోనసీమలో భారీ వర్షం

    అర్నబ్‌ తుఫాను కారణంగా సముద్రంలో అల్లకల్లోలం అవుతోంది. ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక కోనసీమ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. జగన్నాథపురంలో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరుతున్నాయి. ఇళ్లల్లోకి వరద నీరు రాడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.

  • 28 Oct 2026 01:23 AM (IST)

    సముద్రం అల్లకల్లోలం

    అర్నబ్‌ తుపాను ఎఫెక్ట్‌తో ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రంలోని అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. బీచ్‌ రోడ్డు కోతకు గురైంది. ఈదురుగాలుల తీవ్రతకు బండరాళ్లు సైతం కొట్టుకుపోయాయి. జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.

  • 28 Oct 2026 12:18 AM (IST)

    కాకినాడ జిల్లా యంత్రాంగం అప్రమత్తం

    అర్నబ్‌ తుఫాను ఏపీలో బీభత్సం సృష్టిస్తోంది. ఈ అతి తీవ్ర తుఫాను తీరాన్ని తాకింది. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఉప్పాడ సముద్ర తీరప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రజల తరలింపునకు జిల్లా వ్యాప్తంగా 101 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. బాధితులను బస్సుల్లో పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని కాకినాడ జిల్లా కలెక్టర్‌ సూచించారు. తుఫాను కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

  • 28 Oct 2026 12:18 AM (IST)

    ప్రజలు భయటకు రావద్దు

    అర్నబ్‌ తుఫాను తీరాన్ని తాకింది. దీంతో తుఫాను తీరం దాటే సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఈ సమయంలో ప్రజలు భయటకు రావద్దని సూచించారు. తుఫాను కారణంగా ఉప్పాడ తీరంలో సముద్రం బీభత్సం సృష్టిస్తోంది. సముద్రంలోని అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. బీచ్‌ రోడ్డు కోతకు గురైంది. ప్రస్తుతం గంటకు 145-155 కిలోమీటర్ల వేగంగా ఈదురుగాలులు వీస్తున్నాయి.

  • 28 Oct 2026 12:11 AM (IST)

    తీరాన్ని తాకిన తుఫాన్‌

    అర్నబ్‌ తుఫాను తీరాన్ని తాకింది. యానం దగ్గర అర్నబ్‌ తుఫాను ల్యాండ్‌ఫాల్‌ ప్రక్రియ ప్రారంభమైంది. తుఫాను తీరాన్ని తాకిందని సీఎంకు అధికారులు వివరణ ఇచ్చారు. అయితే తీవ్ర తుఫాను గమనంపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు వివరాలు తెలుసకుంటున్నారు. ఉదయం 4 గంటల వరకు ల్యాండ్‌ఫాల్‌ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ల్యాండ్‌ ఫాల్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా వర్షాలు, ఈదురుగాలులు కొనసాగుతాయని వెల్లడించారు.

  • 27 Oct 2026 11:58 PM (IST)

    బంగాళాఖాతంలో అర్నబ్ తుపాన్

    గడిచిన 6 గంటల్లో గంటకు 17కిమీ వేగంతో తుఫాను కదులుతోంది. కాకినాడకు 70కిమీ, నర్సాపూర్ కు 50కిమీ, మచిలీపట్నంకు 110కిమీ, విశాఖకు 200కిమీ దూరంలో కేంద్రీకృతం అయినట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాత్రికి తుపాన్ ప్రభావంతో భారీ నుండి అతిభారీ వర్షాలు కురియనున్నాయని, బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అత్యవసరమైతే కంట్రోల్ రూమ్ నంబర్స్ సంప్రదించాలని ప్రఖర్ జైన్, ఎండీ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపారు.

    Arnab

    Arnab

  • 27 Oct 2026 10:45 PM (IST)

    పలు విమాన సర్వీసులు రద్దు

    అర్నబ్‌ అతి తీవ్ర తుపాను కారణంగా భోగాపురం విమానాశ్రయం నుంచి పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. భోగాపురం నుంచి దిల్లీ, హైదరాబాద్‌, కర్నూలు తిరుపతి, బెంగళూరు, కోల్‌కతా, చెన్నైకి వెళ్లాల్సిన 16 విమానాలను రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

  • 27 Oct 2026 10:42 PM (IST)

    యానాం సమీపంలో తీరం దాటే అవకాశం

    తుఫాను ప్రభావంతో తూగో, పగో, కాకినాడ, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో రాత్రికి భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. గంటకు 145- 155 కిమీ గరిష్టంగా 170కిమీ వేగంతో తీవ్రమైన ఈదురుగాలులు వీస్తాయని, తెల్లవారుజామున 2-4 గంటల మధ్య యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. సురక్షితంగా ఇంట్లోనే ఉండాలని ప్రఖర్ జైన్, ఎండీ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించారు.

    Cyclone Arnab

    Cyclone Arnab

  • 27 Oct 2026 10:39 PM (IST)

    పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అర్నబ్ తుఫాన్

    గడిచిన 6 గంటల్లో గంటకు 17కిమీ వేగంతో తుఫాను కదులుతోంది. కాకినాడకు 70కిమీ, నర్సాపూర్ కు 60కిమీ, తునికు 120కిమీ, మచిలీపట్నంకు 120కిమీ, విశాఖకు 190కిమీ దూరంలో కేంద్రీకృతం అయినట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

  • 27 Oct 2026 10:37 PM (IST)

    ఏపీలో ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

    తుఫాను కారణంగా ఏపీలో పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. బాపట్ల, కృష్ణ, ఎన్టీఆర్‌, ఏలూరు, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, అల్లూరి, అనకాపల్లి, విశాఖ, పల్నాడు, గుంటూరు, విజయనగరం జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. అలాగే శ్రీకాకుళం, మన్యం జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు అధికారులు.

  • 27 Oct 2026 10:32 PM (IST)

    విశాఖలో భారీ వర్షం

    ఏపీలో అర్నబ్‌ తుఫాను కారణంగా విశాఖలో భారీ వర్షం కురుస్తోంది. గోపాలపట్నంలో 20 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. విశాఖ రూరల్‌లో 16, పెందుర్తిలో 15 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. పద్మనాభంలో 15, సీతమ్మధార, ఆనందపురంలో 14 సెం.మీ, మహరాణిపేట , గాజువాకలో 12 సెం.మీ వర్షం.

  • 27 Oct 2026 10:26 PM (IST)

    10 ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధంగా ఉన్నాయి- చంద్రబాబు

    అర్నబ్‌ తుఫాను కారణంగా రాష్ట్రంలో 10 ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు. సహాయక చర్యల్లో నేవీ, కోస్ట్‌గార్డ్‌ బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. తుఫాన్‌ ప్రభావిత జిల్లాలకు 1354 మంది పోలీసులు, 105 అగ్నిమాపక బృందాలతో సహాయక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

  • 27 Oct 2026 10:22 PM (IST)

    రేపు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

    అర్నబ్‌ తుఫాను కారణంగా ఏపీలో పలు జిల్లాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

  • 27 Oct 2026 10:20 PM (IST)

    ఏపీ వైపు దూసుకొస్తున్న అర్నబ్‌ తుఫాను

    ఏపీ వైపు అర్నబ్‌ తుఫాను దూసుకొస్తుంది. భూభాగాన్ని తాకుతోంది. తెల్లవారుజామున 2-4 గంటలకు తీరం దాటే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు.

  • 27 Oct 2026 10:12 PM (IST)

    అల్లకల్లోలం

    బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నాబ్’ తుపాన్‌ కారణంగా అల్లకల్లోలం అవుతోంది. అర్నాబ్‌ బీభత్సంతో ఏపీలోని సముద్ర తీర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. భీకర గాలులు, భారీ వర్షాలతో జనజీవనం ఉక్కిరిబిక్కిరి అవుతుంది.

  • 27 Oct 2026 09:50 PM (IST)

    ఏపీలో స్కూళ్లకు సెలవులు.. ఈ జిల్లాల జాబితా ఇదే!

    ఏపీలో స్కూళ్లకు సెలవులు.. ఈ జిల్లాల జాబితా ఇదే!

    అర్నబ్ తుపాను ఎఫెక్ట్‌.. ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.

    మరి ఏయే జిల్లాల్లో ఎన్ని రోజులు సెలవులు ఇచ్చారో ఇప్పుడు చూద్దాం.

    పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, విజయనగరం, ఏలూరు జిల్లాల్లో అక్టోబర్ 27, 28 తేదీల్లో సెలవులు ప్రకటించారు.

    ఇక అనకాపల్లి జిల్లాలో అక్టోబర్ 27 నుంచి 29వ తేదీ వరకు సెలవులు ఇచ్చారు.

    మరోవైపు, అవసరమైతే పాఠశాల భవనాలను తుపాను పునరావాస కేంద్రాలుగా వినియోగించే అవకాశం ఉంది.

    అయితే, తుపాను తీవ్రతను బట్టి కొన్ని ప్రాంతాల్లో సెలవులపై అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు, తల్లిదండ్రులు తమ జిల్లాల అధికారిక ప్రకటనలను ఎప్పటికప్పుడు గమనించాలి.

  • 27 Oct 2026 09:14 PM (IST)

    వేగంగా కదులుతున్న అర్నబ్ తుపాను

    భూభాగాన్ని తాకుతున్న తుపాను బాహ్య వలయం
    తెల్లవారుజామున 2–4 గంటల మధ్య పూర్తిగా తీరాన్ని తాటే అవకాశం ఉంది
    గడిచిన 6 గంటల్లో గంటకు 18 కిమీ వేగంతో కదిలిన అతి తీవ్ర తుపాన్వి
    విశాఖపట్నంకు 170కి.మీ., కాకినాడకు 90 కి.మీ., మచిలీపట్నంకు 170 కి.మీ., బాపట్లకు 240 కి.మీ దూరంలో కేంద్రీకృతం
    దీని ప్రభావంతో బుధవారం ఉదయం వరకు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
    ఈరోజు ఉదయం 8.30గంటల నుంచి 28 ప్రాంతాల్లో కురిసిన అతిభారీ వర్షాలు
    133 ప్రాంతాల్లో నమోదైన భారీ వర్షాలు : ప్రఖర్ జైన్, ఎండీ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
  • 27 Oct 2026 08:56 PM (IST)

    స్టేషన్​కు వచ్చేముందు ఎస్​ఎంఎస్​లు చెక్ చేసుకోవాలని రైల్వేశాఖ రిక్వెస్ట్..

    అర్నబ్ తుపాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. తుపాను నేపథ్యంలో రైళ్ల సర్వీసుల్లో మార్పులు చేర్పులు ఉండవచ్చని, ప్రయాణికులకు వచ్చే ఎస్​ఎంఎస్​లు చూసుకోవాలని కోరింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా సహా పలు ప్రాంతాలపై ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున ప్రయాణికుల భద్రత, రైలు నిర్వహణ దృష్ట్యా పరిస్థితులకు అనుగుణంగా ఈ ప్రాంతంలోని రైళ్లు నడిపే విధానంలో మార్పులు చేయవచ్చని అనౌన్సిమెంట్ ఇచ్చింది.

  • 27 Oct 2026 08:39 PM (IST)

    పలు చోట్ల జోరుగా వర్షం

    అర్నబ్ ప్రభావంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచీ వాతావరణ మేఘామృతమై ఉండగా మధ్యాహ్నం నుంచి వాన జోరందుకుంది. క్రమంగా పెరుగుతూ పలు చోట్ల జోరుగా వర్షం కురుస్తోంది. రాజమహేంద్రవరంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. రాజానగరం, కడియం సహా పలు మండలాలు, గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. గోదావరి నది పాయల్లో ఉండే జాలర్ల కుటుంబాలను రాజమహేంద్రవరంలోని పునరావాస కేంద్రానికి అధికారులు తరలించారు.

  • 27 Oct 2026 08:16 PM (IST)

    ఏపీ వైపు దూసుకొస్తున్న అర్నబ్‌ తుఫాన్‌

    — ఏపీ వైపు దూసుకొస్తున్న అర్నబ్‌ తుఫాన్‌

    — గంటకు 20 కి.మీ. వేగంతో కదులుతున్న తుఫాన్

    — విశాఖకు 170 కి.మీ, కాకినాడకు 140 కి.మీ..

    — బాపట్లకు 300 కి.మీ. దూరంలో తుఫాన్ కేంద్రీకృతం

    — రేపు తెల్లవారుజామున తుఫాన్‌ తీరం దాటే అవకాశం

    — కోనసీమ, యానాం, కాకినాడ మధ్య తీరం దాటే అంచనా

    — తీరం దాటే సమయంలో 125-135 కి.మీ. వేగంతో గాలులు

  • 27 Oct 2026 07:21 PM (IST)

    తుఫాన్ వేళ ప్రజలకు హోం మంత్రి సూచనలు..

    అర్నబ్‌ తుపాను వేళ ప్రజలకు ఆంధ్రప్రదేశ్‌ హోం మంత్రి అనిత కీలక సూచనలు చేశారు. నాలుగు రోజుల పాటు ప్రజలు అలెర్ట్‌గా ఉండాలన్నారు. అత్యవసరమైతే తప్ప 48 గంటల పాటు ఎవరూ బయటకు రావొద్దని సూచించారు. ప్రాణనష్టం జరగకుండా చూడటమే గవర్నమెంట్ ప్రాధాన్య అంశమని చెప్పారు. అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేశామన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, తీర ప్రాంత ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని మంత్రి కోరారు.

  • 27 Oct 2026 06:39 PM (IST)

    రాష్ట్రవ్యాప్తంగా తుఫాన్ షెల్టర్స్..

    ఏపీ వ్యాప్తంగా 20 జిల్లాలో 2131 తుఫాన్‌ షెల్టర్లను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. తుఫాన్‌ ప్రభావిత జిల్లాల ప్రజలకు నిరంతరం హెచ్చరికలు జారీ చేస్తూ అప్రమత్తం చేస్తోంది. తుఫాన్‌ వల్ల ప్రాణ, పంట నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. హాస్టళ్లు, వసతి గృహాల్లో ఉన్న విద్యార్ధులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మంత్రులు ఆదేశించారు. జలాశయాల్లో పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

  • 27 Oct 2026 06:09 PM (IST)

    ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసం అవ్వడంతో తాత్కాలికంగా రాకపోకలు నిలిపివేసిన పోలీసులు

    కాకినాడ జిల్లా ఉప్పాడ లో తుఫాను ప్రభావంతో ఉప్పాడ కాకినాడ రోడ్డు పూర్తిగా ధ్వంసం అయింది.. రాకాసి అలల తాకిడికి బండరాళ్లు రోడ్డుపై ఎగిరి పడడంతో రోడ్డు మొత్తం పెచ్చులూడి గుంతలు మయంగా మారింది… తాత్కాలికంగా రాకపోకలను నిలిపివేశారు పోలీసులు అటు కాకడాని నుంచి ఉప్పాడ వచ్చే రహదారిని.. ఇటు ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్లే రహదారిని బారికేట్లతో క్లోజ్ చేశారు పోలీసులు…. ఒకపక్క వర్షం మరోపక్క తుఫాను తాకిడికి కొన్ని అడుగులు మేర కెరటాలు ఎగిసి పడటంతో సముద్రపు నిరంత రోడ్ల మీదకు చేరి రోడ్లు ధ్వంసం అవుతున్నాయి..

  • 27 Oct 2026 05:57 PM (IST)

    తెలంగాణపై అర్నబ్ తుపాను ఎఫెక్ట్

    అర్నబ్ తుఫాన్ ప్రభావంతో.. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వెదర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.

  • 27 Oct 2026 05:35 PM (IST)

    అర్నబ్‌ తుఫాన్‌తో శ్రీకాకుళం జిల్లా అధికారుల అప్రమత్తం

    అర్నబ్ తుఫాన్‌ కోస్తాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈదురుగాలులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళంలో భారీ వర్షాలు పడుతుండటంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మత్స్యకారులు ఈనెల 30 వరకు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.

    అర్నబ్‌ సైక్లోన్‌ నేపథ్యంలో.. శ్రీకాకుళం జిల్లాలోని నదీ తీర ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. అర్నబ్‌తుఫాన్‌తో భారీ నష్టం తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో… జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తుఫాను ధాటికి నాగావళి నది ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉండటంతో అధికారులు ముందస్తుగా అప్రమత్తం అయ్యారు. గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చూస్తున్నారు.

    ఇప్పటికే జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. జిల్లా ఆర్టీసీ కాంప్లెక్స్‌ జలమయం అయింది. బొందిలిపురం జంక్షన్‌ దగ్గర రోడ్డుపై భారీగా డ్రైనేజీ నీరు ప్రవహిస్తోంది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

  • 27 Oct 2026 05:02 PM (IST)

    సైక్లోన్ అర్నాబ్ లైవ్ ట్రాకర్..

  • 27 Oct 2026 04:32 PM (IST)

    ప్రభావిత ప్రాంతాల కంట్రోల్ రూమ్ నంబర్లు దిగువన చూడండి..

    Control Room Numbers

  • 27 Oct 2026 04:26 PM (IST)

    పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అర్నబ్ తుపాన్

    పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అర్నబ్ తుపాన్
    గడిచిన 6 గంటల్లో గంటకు 20 కిమీ వేగంతో కదిలిన అతి తీవ్ర తుపాన్
    ప్రస్తుతానికి విశాఖపట్నంకు 170కి.మీ., కాకినాడకు 180 కి.మీ., మచిలీపట్నంకు 270 కి.మీ., బాపట్లకు 350 కి.మీ దూరంలో కేంద్రీకృతం
    విశాఖ, శ్రీకాకుళం,విజయనగరం, మన్యం, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు
    సాయంత్రం నుంచి పోలవరం, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు
    తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు
    రేపు ఉదయానికి బాపట్ల- విశాఖ మధ్య యానాంకు సమీపంలో తీరం దాటే అవకాశం
    తీరం దాటే సమయంలో 125-135 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం
    ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ప్రఖర్ జైన్, ఎండీ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
  • 27 Oct 2026 03:36 PM (IST)

    రుషికొండ, ఆర్కే బీచ్‌లు క్లోజ్

    అర్నబ్‌ సైక్లోన్ ప్రభావంతో విశాఖ తీరం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రం 10 మీటర్లు ముందుకు చొచ్చుకొచ్చింది. దీంతో బీచ్‌ల్లో టూరిస్టుల ప్రవేశంపై అధికారులు ఆంక్షలు విధించారు. రుషికొండ, ఆర్కే బీచ్‌లను మూసివేశారు.

  • 27 Oct 2026 03:09 PM (IST)

    Cyclone Arnab: ఏపీ సహా పలు రాష్ట్రాలకు ఫ్లాష్‌ఫ్లడ్‌ అలర్ట్

    ఏపీని అర్నబ్‌ తుఫాన్‌ భయపెడుతోంది. తీరం దాటక ముందే ఈదురుగాలులు, వానలతో అలజడి సృష్టిస్తోంది. దీని ఎఫెక్ట్‌తో ఏపీ సహా పలు రాష్ట్రాలకు ఫ్లాష్‌ఫ్లడ్స్‌ వచ్చే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోని పలు జిల్లాలకు అలర్ట్ జారీ అయింది. రేపు సాయంత్రంలోగా ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని సూచించింది IMD .

  • 27 Oct 2026 03:03 PM (IST)

    Cyclone Arnab News: ఉప్పాడ తీరంలో అర్నబ్‌ బీభత్సం

    ముంచుకొస్తున్న అర్నబ్‌ తుఫానుతో కాకినాడ జిల్లాలో ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయి. సముద్రంలో ఉవ్వెత్తున ఎగసిపడిన రాకాసి అలల ధాటికి ఉప్పాడ రహదారి ధ్వంసమైంది. పెద్దపెద్ద బండరాళ్లు రోడ్డుపైకి చేరాయి. బండరాళ్ల తాకిడికి కిలోమీటర్ల మేర రహదారి ధ్వంసమై పెచ్చులతో నిండిపోయింది.

  • 27 Oct 2026 02:54 PM (IST)

    పలు ప్రధాన రైళ్లు రద్దు

    అర్నబ్‌ తుపాను నేపథ్యంలో పలు ప్రధాన రైళ్లను దక్షిణ మధ్య రైల్వే క్యాన్సిల్ చేసింది. అక్టోబర్‌ 27 హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, లింగంపల్లి నుంచి బయల్దేరే ఫలక్‌నుమా, గోదావరి, గరీబ్‌రథ్‌, విశాఖ, నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ సహా పలు రైళ్లను క్యాన్సిల్ చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఓ ప్రకటనలో తెలిపారు. నాగర్‌సోల్‌-నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ను పాక్షికంగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. 28న శ్రీకాకుళం రోడ్డు నుంచి చర్లపల్లికి వచ్చే రైలును కూడా రద్దు చేసినట్లు సీపీఆర్వో వెల్లడించారు.

    Cancelled Trains

     

  • 27 Oct 2026 02:06 PM (IST)

    ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: సీఎం చంద్రబాబు

    అర్నబ్‌ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష

    ముందస్తు సన్నద్ధతపై అధికారులకు సీఎం దిశానిర్దేశం

    వివిధ జిల్లాల్లో తుఫాన్‌ ప్రభావంపై సీఎం ఆరా

    వివిధ జిల్లాల కలెక్టర్లతో సీఎం టెలికాన్ఫరెన్స్

    ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశం

    లోతట్టుప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలి

    పునరావాసకేంద్రాల్లో ఆహారం,తాగునీరు అందించాలని సూచన

    విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే.. వెంటనే పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలన్న సీఎం

    తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో SDRF, NDRF బలగాలను.. పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచన

  • 27 Oct 2026 01:55 PM (IST)

    రైతులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

    ఖమ్మం జిల్లాపై అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావం ఉండొచ్చన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పటికే పలు పంటలు కోతల దశకు వచ్చాయని.. తుఫాన్ నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

  • 27 Oct 2026 01:53 PM (IST)

    ఫ్లాష్‌ఫ్లడ్స్‌ అలర్ట్..

    ఏపీని అర్నబ్‌ తుఫాన్‌ భయపెడుతోంది. తీరం దాటక ముందే ఈదురుగాలులు, వానలతో అలజడి సృష్టిస్తోంది. దీని ఎఫెక్ట్‌తో ఏపీ సహా పలు రాష్ట్రాలకు ఫ్లాష్‌ఫ్లడ్స్‌ వచ్చే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోని పలు జిల్లాలకు అలర్ట్ జారీ అయింది. అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది.

  • 27 Oct 2026 01:28 PM (IST)

    తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు

    విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి.. మన్యం, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు

    పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం

    తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలం.. ఎగసిపడుతున్న రాకాసి అలలు

    బీచ్‌రోడ్‌లో వాహనాల రాకపోకలకు అంతరాయం

  • 27 Oct 2026 01:09 PM (IST)

    దూసుకొస్తున్న అర్నబ్‌ తుఫాన్‌ .. కంట్రోల్ రూమ్ నెంబర్ల వివరాలివే..

    Cyclone Arnab: ఏపీవైపు అర్నబ్‌ తుఫాన్‌ దూసుకొస్తోంది.. దీంతో తీర ప్రాంతాాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఈ మేరకు సహాయక చర్యల కోసం అధికారులు కంట్రోల్ రూమ్ నెంబర్లను విడుదల చేశారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలు.. ఆయా నెంబర్లకు ఫోన్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించవచ్చు..

    Cyclone Arnab

    Cyclone Arnab

  • 27 Oct 2026 12:52 PM (IST)

    ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలలు

    అర్నబ్ తుఫాన్‌ ధాటికి సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డుపైకి దూసుకొస్తున్నాయి. అలల తాకిడికి రోడ్డుపై ఉన్న వాహనాలు కొట్టుకుపోవడంతో పాటు రహదారి తీవ్రంగా ధ్వంసమైంది.

  • 27 Oct 2026 12:24 PM (IST)

    అర్నబ్‌పై క్షణక్షణం అప్రమత్తతో ఉన్నాం : సీఎం చంద్రబాబు

    ఎల్‌నినోతో ఇబ్బందిపడుతున్న రాష్ట్రంపై అర్నబ్‌ మరో పిడుగు

    అర్నబ్‌పై క్షణక్షణం అప్రమత్తతో ఉన్నాం

    రెండు రోజులు అతిభారీ వర్షాలు కురుస్తాయి

    తుఫాన్‌తో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు

    ఓవైపు కరువు, మరోవైపు తుఫాన్‌ను ఎదుర్కొంటున్నాం

    అధికారయంత్రాంగం రెడీ, ప్రజలు కూడా ప్రభుత్వ అడ్వైజరీ ఫాలో అవ్వాలి: సీఎం చంద్రబాబు

  • 27 Oct 2026 11:51 AM (IST)

    విశాఖకు 220 కి.మీ, కాకినాడకు 240 కి.మీ దూరంలో తుపాన్

    ఏపీవైపు దూసుకొస్తున్న అర్నబ్‌ తుఫాన్‌

    గంటకు 20 కి.మీ. వేగంతో కదులుతున్న తుఫాన్

    విశాఖకు 220 కి.మీ, కాకినాడకు 240 కి.మీ..

    బాపట్లకు 410 కి.మీ. దూరంలో తుఫాన్ కేంద్రీకృతం

    రేపు ఉదయం విశాఖ-బాపట్ల మధ్య తీరం దాటే అవకాశం

    తీరం దాటే సమయంలో 125-135 కి.మీ. వేగంతో గాలులు

  • 27 Oct 2026 11:45 AM (IST)

    జీరో లాస్ ఆఫ్ లైఫ్ లక్ష్యంగా ముందస్తు చర్యలు

    ఏపీ వైపు వేగంగా అర్నబ్ తుపాను దూసుకొస్తున్న నేపథ్యంలో తుపాను సన్నద్ధతపై జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ (NCMC)తో కేంద్ర కేబినెట్ కార్యదర్శి టి.వి. సోమనాథన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు (CS)లతో ఆయన మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. తుపాను వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా జీరో లాస్ ఆఫ్ లైఫ్ సూత్రాన్ని అమలు చేయాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

  • 27 Oct 2026 11:41 AM (IST)

    పవన్, నేను నిరంతరం మానిటర్ చేస్తున్నాం: సీఎం చంద్రబాబు

    అర్నబ్ తుఫాన్ ముంచుకొస్తోంది.. రెండు రోజులు అతిభారీ వర్షాలు కురుస్తాయి.. పవన్, నేను నిరంతరం మానిటర్ చేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తుఫాన్‌తో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

  • 27 Oct 2026 11:34 AM (IST)

    వర్షాలతో డిజిటల్ ప్రచారంపై ఫోకస్

    మున్సిపల్ ప్రచారంపై అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్

    మున్సిపల్ ప్రచారానికి మరో మూడ్రోజులే సమయం

    రేపు అర్నబ్ తుఫాన్ తీరం దాటే అవకాశం

    ఈ మూడ్రోజుల పాటు వర్షాలుండటంతో.. అభ్యర్థులు పెద్దగా ప్రచారం చేసుకోలేని పరిస్థితి నెలకొంది.

    వర్షాలతో డిజిటల్ ప్రచారంపై ఫోకస్ పెట్టారు అభ్యర్థులు.

    సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.

    వాట్సాప్, ఇన్‌ స్టా, ఫేస్‌బుక్‌ల్లో ప్రచారం హోరెత్తుతోంది.

    ఇంటింటికీ వెళ్లి నెంబర్లు సేకరిస్తున్నారు అన్ని పార్టీల కార్యకర్తలు.

    వాయిస్ కాల్స్, వాయిస్ మెసేజ్‌లు పంపడంతోపాటు రాష్ట్రస్థాయి ముఖ్యనేతల వాయిస్‌తో IVRS కాల్స్ చేస్తున్నారు.

    ఓటర్ స్లిప్‌లను కూడా మొబైల్స్‌కే పంపుతున్నారు.

    APలో మూడ్రోజుల పాటు వర్షాలుండటంతో… ఈ మూడురోజుల పాటు డిజిటల్ ప్రచారంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు అభ్యర్ధులు.

  • 27 Oct 2026 11:32 AM (IST)

    తెలంగాణపై అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావం

    తెలంగాణపై అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావం కనిపించనుంది. ఇవాళ ఖమ్మం, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి వరంగల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలతో పాటు పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురువనున్నాయి.

  • 27 Oct 2026 11:21 AM (IST)

    అల్లకల్లోలంగా సముద్రం..

    ర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో ఉమ్మడి విశాఖ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. యారాడ బీచ్‌ దగ్గర సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. భారీ అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతుండటంతో తీర ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా కనిపిస్తోంది.

  • 27 Oct 2026 10:54 AM (IST)

    గంటకు 22 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుఫాన్

    అర్నబ్‌ తుఫాన్‌ వేగంగా తీర ప్రాంతం వైపు దూసుకొస్తోంది. గంటకు 22 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. రేపు ఉదయం బాపట్ల–విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తుఫాన్‌ ప్రభావంతో అన్ని పోర్టుల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

  • 27 Oct 2026 10:30 AM (IST)

    అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

    అర్నబ్‌ తుఫాన్‌ తీవ్రతను అంచనా వేస్తూ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తీర ప్రాంత ప్రజలను సురక్షితంగా షెల్టర్లకు తరలించాలని సూచించారు. తుఫాన్‌ ప్రభావంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

  • 27 Oct 2026 09:51 AM (IST)

    మైకుల ద్వారా అలర్ట్‌

    అర్నబ్ తుఫాన్ హెచ్చరికలతో ఇలా తీర ప్రాంత గ్రామాల్లో అధికారులు మైకుల ద్వారా అలర్ట్‌ చేస్తున్నారు. ఇప్పటికే తుఫాన్ దూసుకొస్తూ.. ఏపీ తీరాన్ని ముప్పు వణికిస్తుంది.. కోస్తాంధ్రకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ కాగా.. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో తుఫాన్ ప్రభావం మొదలైంది..

  • 27 Oct 2026 09:35 AM (IST)

    మున్సిపల్ ప్రచారాలపై అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్

    ఏపీలో మున్సిపల్ ప్రచారాలపై అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్ పడింది.

    వర్షాలతో డిజిటల్ ప్రచారంపై ఫోకస్ పెట్టారు అభ్యర్థులు.

    సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.

    వాట్సాప్, ఇన్‌ స్టా, ఫేస్‌బుక్‌ల్లో ప్రచారం హోరెత్తుతోంది.

    ఇంటింటికీ వెళ్లి నెంబర్లు సేకరిస్తున్నారు అన్ని పార్టీల కార్యకర్తలు.

    వాయిస్ కాల్స్, వాయిస్ మెసేజ్‌లు పంపడంతోపాటు రాష్ట్రస్థాయి ముఖ్యనేతల వాయిస్‌తో IVRS కాల్స్ చేస్తున్నారు.

    ఓటర్ స్లిప్‌లను కూడా మొబైల్స్‌కే పంపుతున్నారు.

    మున్సిపల్ ప్రచారానికి మరో మూడ్రోజులే సమయం ఉంది.

    రేపు తుఫాన్ తీరం దాటే అవకాశం ఉండటం.. ఈ మూడ్రోజుల పాటు వర్షాలుండటంతో పెద్దగా ప్రచారం చేసుకోలేని పరిస్థితులున్నాయి. దీంతో ఈ మూడురోజుల పాటు డిజిటల్ ప్రచారంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు అభ్యర్ధులు.

  • 27 Oct 2026 09:05 AM (IST)

    తుఫాన్ ప్రభావిత జిల్లాలకు 27 కోట్ల నిధుల విడుదల

    అర్న‌బ్ ను ఎదుర్కోవడానికి సిద్ధమైన ప్ర‌భుత్వం

    ప్రాణ న‌ష్టం వాటిల్ల‌కుండా చూడ‌ట‌మే ప్రభుత్వ ల‌క్ష్యం

    ఆయా శాఖ‌ల అధికారుల‌తో ముంద‌స్తు స‌న్న‌ద్ద‌త‌పై సీఎం స‌మీక్ష‌లు

    11 జిల్లాల‌కు ఎస్‌డీఆర్ ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాల త‌ర‌లింపు

    ఈ మ‌ధ్యాహ్నం నుంచి తీర‌ప్రాంత ర‌హ‌దారుల‌పై రాక‌పోక‌ల బంద్‌

    లోత‌ట్టు ప్రాంత ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లింపు

    ముంద‌స్తు చ‌ర్య‌ల్లో భాగంగా బీచ్‌లు మూసివేత‌

    తుఫాన్ ప్రభావిత జిల్లాలకు 27 కోట్ల నిధుల విడుదల

    తుఫాన్ సన్నద్ధత ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

  • 27 Oct 2026 08:46 AM (IST)

    ఈ నెంబర్లకు ఫోన్ చేయండి..

    జిల్లా కంట్రోల్ రూమ్ నెంబర్.. 08856293104..

    అమలాపురం ఆర్డీవో కార్యాలయం:- 08856233208..

    రామచంద్రపురం ఆర్డీవో.. 08857245166..

    కొత్తపేట ఆర్డీవో.. 9989855444..

  • 27 Oct 2026 08:15 AM (IST)

    ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు

    ప్రాణన‌ష్టం జరగకుండా ఏపీ ప్రభుత్వం కూడా సన్నద్ధం అవుతుంది. ఆయా శాఖ‌ల అధికారుల‌తో ముంద‌స్తు చర్యల‌పై స‌మీక్ష‌లు నిర్వహించారు.. ఇప్పటికే 11 జిల్లాల‌కు SDRF, NDRF బృందాల త‌ర‌లించారు. ఇక మ‌ధ్యాహ్నం నుంచి తీర‌ప్రాంత ర‌హ‌దారుల‌పై రాక‌పోక‌లు బంద్‌ అవుతాయి. మరీ ముఖ్యంగా బాపట్ల జిల్లాలోనే అధిక వర్షపాతం నమోదు కాబోతుందన్న అంచనాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్.

  • 27 Oct 2026 08:02 AM (IST)

    ఎగసిపడుతున్న సముద్రం.. సురక్షిత ప్రాంతాలకు తీర ప్రాంత వాసులు

    కోనసీమలో తుఫాన్ ఎఫెక్ట్.. తీర ప్రాంత వాసులు సురక్షిత ప్రాంతాలకు తరలింపు..

    అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్ తీర ప్రాంత ప్రజల సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు

    తుఫాన్ ప్రభావంతో కోనసీమ లో పూర్తిగా మారిపోయిన వాతావరణం..ఎగసిపడుతున్న సముద్రం..

    ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్ప సముద్ర తీరం వద్ద ఉన్న మత్స్యకార కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన ఆర్డిఓ ..

    వేటకు వచ్చిన విశాఖ జిల్లా నక్కపల్లి కి చెందిన 400 మందిని తుఫాన్ షెల్టర్లకు తరలింపు..

    నిన్న రాత్రి నుండి తీర ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు ..

    అమలాపురం డివిజన్లో 1000 నుండి 1500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకున్నామన్న ఆర్డీవో సరళాదేవి..

    నేటి నుండి రెండు రోజులపాటు స్కూల్స్ సెలవులు ప్రకటించిన జిల్లా కలెక్టర్..

    అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ హెచ్చరించిన కలెక్టర్..

    జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసిన కలెక్టర్ మహేష్ కుమార్..

  • 27 Oct 2026 07:46 AM (IST)

    తుపాను ఎంత దూరంలో ఉందంటే..

    బంగాళాఖాతంలో అత్యంత తీవ్ర తుపానుగా ‘అర్నబ్‌’

    గత 6 గంటల్లో గంటకు 25 కి.మీ. వేగంతో పశ్చిమ-వాయవ్య దిశగా పయనం

    విశాఖపట్నానికి ఆగ్నేయంగా 300 కి.మీ. దూరంలో తుపాను

    కాకినాడకు తూర్పు-ఆగ్నేయంగా 360 కి.మీ. దూరంలో కేంద్రం

    గోపాల్‌పూర్‌కు దక్షిణంగా 380 కి.మీ. దూరంలో తుపాను

    సాయంత్రం వరకు పశ్చిమ-వాయవ్య దిశగా తుపాను కదలిక

    అక్టోబర్ 28 ఉదయం ఏపీ తీరాన్ని దాటే అవకాశం

    బాపట్ల–విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో తీరం దాటే సూచనలు

  • 27 Oct 2026 07:29 AM (IST)

    విశాఖ జిల్లాల్లో అలర్ట్

    విశాఖ జిల్లాలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ఆయా ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మత్స్యకారులను ఇప్పటికే ఒడ్డుకు చేర్చారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అంటున్నారు అధికారులు.

  • 27 Oct 2026 07:23 AM (IST)

    కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు

    విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశారు.

    విశాఖ కలెక్టరెట్ 24*7 కంట్రోల్ రూం నెంబర్లు 8912590100, 8912590102

    జీవీఎంసీ టోల్ ఫ్రీ 180042500009, వాట్సాప్ 9014218870

    విశాఖ ఏపీ ఈపీడీసీఎల్ 7382299975, మెడికల్ 8985181874, 9398786818, ఫిషరీస్ 9491808388 కంట్రోల్ రూమ్ నంబర్లు

    విశాఖలో 37 ముంపు ప్రాంతాలు గుర్తింపు.. 54 పునరావాస కేంద్రాల ఏర్పాటు చేశారు.

    అల్లూరి జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ వివరాలు

    ల్యాండ్‌లైన్ నంబర్: 08935-293448, అత్యవసర సంప్రదింపు నంబర్: 92818 56953

  • 27 Oct 2026 07:13 AM (IST)

    ప్రారంభమైన తుపాను ప్రభావం.. భారీ వర్షాలు

    పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుఫాన్ అతి తీవ్ర తుపాన్ గా బలపడింది. పలు ప్రాంతాల్లో తుపాను ప్రభావం ప్రారంభమైంది.

    మరికాసేపట్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు

    శ్రీకాకుళం జిల్లాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాలు

    కోస్తా జిల్లాల్లో ప్రారంభమైన ఈదురుగాలులు

    ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

    మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా తుపాన్ స‌మ‌స్య‌లకు వేగవంతమైన రెస్పాన్స్ : ప్రఖర్ జైన్ ,ఎండీ , విపత్తుల నిర్వహణ సంస్థ

  • 27 Oct 2026 07:03 AM (IST)

    ఏపీలో భారీ వర్షాలు..

    అర్నబ్ తుఫాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు.. లైవ్ వీడియో చూడండి..

  • 27 Oct 2026 06:59 AM (IST)

    స్కూళ్లకు రెండు రోజులు సెలవులు

    16 జిల్లాల్లోని 2,460 రెవెన్యూ గ్రామాలు, 92 ప‌ట్టణ ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువ‌గా ఉంటుంద‌ని అంచ‌నా వేశారు. ఇవాళ, రేపు పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

  • 27 Oct 2026 06:58 AM (IST)

    తీరం దాటేది ఎప్పుడంటే..

    అక్టోబర్ 28 ఉదయం బాపట్ల–విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని IMD తెలిపింది. గరిష్ఠంగా గంటకు 115–125 కి.మీ. వేగంతో గాలులు, 140 కి.మీ. వరకు గాలివానలు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది.

అర్నబ్ తుఫాన్‌ తీరం దాటింది.. యానాం-నరసాపురం మధ్య అర్నబ్ తుఫాన్‌ తీరం దాటింది. దాదాపు 5 గంటలపాటు తీరాన్ని దాటే ప్రక్రియ కొనసాగింది. అర్నబ్ బలహీనపడి తీవ్ర తుఫాన్‌గా మారింది. యానాంకు నైరుతిదిశగా తుఫాన్‌ తీరం దాటింది. తీరం వెంబడి గంటకు 125–135 కి.మీల వేగంతో భీకర గాలులు వీస్తున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. 150 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ, దక్షిణ ఒడిశా తీరాలకు రెడ్ మెసేజ్ హెచ్చరికలు జారీ చేశారు. కాకినాడ, యానాం ప్రాంతాల్లో ఉప్పెన వచ్చే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాధారణం కంటే 2.5 మీటర్ల ఎత్తుకు అలలు ఎగిసిపడుతున్నాయి..

తుపాను ఎఫెక్ట్‌తో ఏపీ ప్రభుత్వం అన్ని శాఖలను మరింత అప్రమత్తం చేసింది. సహాయక చర్యల కోసం 20 జిల్లాలకు రూ.27 కోట్లను విడుదల చేసింది. ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల్లో 15 ఎన్డీఆర్ఎఫ్‌ బృందాలను మోహరించింది. అత్యవసర పరిస్థితుల్లో తాగునీటి సరఫరాకు 2,613 ట్యాంకర్లను సిద్ధంగా ఉంచింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 1,763 తుపాను పునరావాస కేంద్రాలను గుర్తించగా.. జిల్లా, మండల స్థాయిల్లో 2,907 కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేసింది. సహాయక చర్యల కోఆర్డినేషన్ కోసం 3,185 మంది నోడల్‌ అధికారులను నియమించింది. సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు తిరిగి తీరానికి చేరుకున్నారని, 30వేలకు పైగా పడవలు హార్బర్లలోనే ఉంచినట్లు ప్రభుత్వం తెలిపింది.

మరోవైపు తుపాను ప్రభావం రవాణా, విద్య, పర్యాటక రంగాలపైనా పడింది. దక్షిణ కోస్తా రైల్వే పరిధిలో 53 రైళ్లను రద్దు చేశారు.

విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు రావాల్సిన ఇండిగో విమానాలను అధికారులు రద్దు చేశారు. చెన్నై- విజయవాడ , బెంగళూరు- విజయవాడ విమానాలను కూడా రద్దు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు సెలవులను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని ఏపీ సర్కార్ ఆదేశించింది.

Published On - Oct 27,2026 6:57 AM

Follow Us