Andhra Praesh: అరకులో దంపతుల ఆత్మహత్యాయత్నం.. పురుగుల మందు తాగిన జంట.. ఆస్పత్రికి తరిస్తుండగా..
ఏ కష్టం వచ్చిందో ఏమో.. చక్కగా సాగిపోతున్న వారి జీవితంలో సమస్యలు చిచ్చు రేపాయి. భార్య గర్భవతి కావడంతో పుట్టబోయే బిడ్డ కోసం ఆశగా ఎదురుచూశారు. కానీ.. ఆర్థిక సమస్యలు కడదాకా వెంటాడాయి. ఆటుపోట్లు నిండు జీవితాల్ని...
ఏ కష్టం వచ్చిందో ఏమో.. చక్కగా సాగిపోతున్న వారి జీవితంలో సమస్యలు చిచ్చు రేపాయి. భార్య గర్భవతి కావడంతో పుట్టబోయే బిడ్డ కోసం ఆశగా ఎదురుచూశారు. కానీ.. ఆర్థిక సమస్యలు కడదాకా వెంటాడాయి. ఆటుపోట్లు నిండు జీవితాల్ని బలిగొన్నాయి. అరకులోయలో సూసైడ్ అటెంప్ట్ చేసిన హైదరాబాద్ దంపతులు మృత్యుఒడికి చేరారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన దంపతులు మృతి చెందారు. హైదరాబాద్ లోని కొండాపూర్ గోపాలరెడ్డి నగర్ కు చెందిన దంపతులు నిన్న (బుధవారం) అరకు సమీపంలోని చాపరాయి జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చారు. అనంతరం ముందస్తు ప్లాన్ ప్రకారం తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగారు. గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై బాధితులను ఆస్పత్రికి కలించారు. స్థానిక ఆస్పత్రిలో ప్రాథమిక చేశాక వారి పరిస్థితి విషమంగా ఉందని, పెద్దాసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో వారిని వైజాగ్ కు తరలిస్తుండగా భార్యాభర్తలిద్దరూ ప్రాణాలు కోల్పాయోరు.
మృతులు హైదరాబాద్ కొండాపూర్ గోపాలరెడ్డినగర్‌కు చెందిన సంతోష్ కుమార్-సునీతగా గుర్తించారు పోలీసులు. సునీత ఆరు నెలల గర్భిణీ. ఆర్థిక సమస్యలే సూసైడ్‌కు కారణమని పోలీసుల ప్రాథమికంగా నిర్ధారించారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం బస్సులో వెళ్లిన జంట పర్యాటక ప్రాంతాల్ని సందర్శించింది. చాపరాయి దగ్గర చివరకు సూసైడ్ అటెంప్ట్ చేశారు దంపతులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..