AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Roja: మూడు రాజధానుల బిల్లు పెట్టి తీరుతాం.. రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని మంత్రి రోజా సవాల్

మంత్రి ఆర్కే రోజా (Minister Roja) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే మూడు రాజధానుల అంశంపై బిల్లు పెడతామని తేల్చి చెప్పారు. రాజధానిపై సీఎం జగన్ చిత్తశుద్ధితో ఉన్నారని వెల్లడించారు. రాష్ట్రం సమగ్రాభివృద్ధి..

Roja: మూడు రాజధానుల బిల్లు పెట్టి తీరుతాం.. రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని మంత్రి రోజా సవాల్
Minister Roja
Ganesh Mudavath
|

Updated on: Sep 15, 2022 | 11:33 AM

Share

మంత్రి ఆర్కే రోజా (Minister Roja) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే మూడు రాజధానుల అంశంపై బిల్లు పెడతామని తేల్చి చెప్పారు. రాజధానిపై సీఎం జగన్ చిత్తశుద్ధితో ఉన్నారని వెల్లడించారు. రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందడానికి మూడు రాజధానులు అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని వివరించారు. మూడు రాజధానుల బిల్లను అసెంబ్లీలో పెడతామని, ఈ అంశంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలో రాజీనామా చేసి ఎన్నికలకు (Elections) రావాలని డిమాండ్ చేశారు. ప్రజలుకు మూడు రాజధానులు కావాలో లేదో అప్పుడు అర్ధమవుతుందని ఎద్దేవా చేశారు. ప్రజలు మళ్లీ జగన్ ప్రభుత్వమే కావాలని కోరుకుంటున్నట్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ్టి నుంచి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా రాష్ట్ర రాజధానులపై ప్రభుత్వం చర్చించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. రాష్ట్రానికి అమరావతి ఒకటే రాజధాని అంటూ రైతులు ఒకవైపు మహాపాదయాత్ర చేస్తుండగా, మరోవైపు 3 రాజధానుల అంశమే ప్రధాన ఎజెండాగా ప్రభుత్వం సమావేశాలకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

గతంలో నారా లోకేశ్ తీరుపై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. పదో తరగతి ఫలితాలపై జూమ్ మీటింగ్ లో కొడాలి నాని, వల్లభనేని వంశీ వస్తే లోకేశ్ ఎందుకు పారిపోయాడో చెప్పాలని ప్రశ్నించారు. ఇక జీవితంలో లోకేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టలేరని వెల్లడించారు. అంతే కాకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తలకిందులుగా తపస్సు చేసినా ఇప్పుడున్న 23 సీట్లు కూడా గెలవలేరని విమర్శించారు. ప్రజల్లో టీడీపీకి ఏ మాత్రం ఆదరణ ఉందో తెలుసుకోవాలంటే అచ్చెన్నాయుడు టెక్కలిలో రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. చంద్రబాబు, లోకేశ్‌కు స్త్రీల గురించి మాట్లాడే అర్హత లేదని పేర్కొన్నారు. ప్రతి మహిళా ఆత్మగౌరవంతో జీవించలానే సంకల్పంతో వారి కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..