ఏపీలో కరోనా టెర్రర్: 10,080 కొత్త కేసులు.. 97 మరణాలు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం ఆగడం లేదు. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో
AP Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం ఆగడం లేదు. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 10,080 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,17,040 కు చేరింది. అలాగే రాష్ట్రంలో కరోనా సోకి తాజాగా 97మంది మరణించగా.. మృతుల సంఖ్య 1,939కు చేరింది. గడిచిన 24 గంటల్లో 9,15 మంది కరోనాను జయించగా.. కోలుకున్న వారి సంఖ్య 1,29,615కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 24,24,393 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 85,486 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇక జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో 976, చిత్తూరులో 963, గుంటూరులో 601, తూర్పు గోదావరిలో 1310, కడపలో 525, కృష్ణాలో 391, కర్నూలులో 1353, నెల్లూరులో 878, ప్రకాశంలో 512, శ్రీకాకుళంలో 442, విశాఖలో 998, విజయనగరంలో 450, పశ్చిమ గోదావరిలో 681 కేసులు నమోదయ్యాయి. అయితే ఇతర రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి వచ్చిన వారిలో ఎలాంటి కొత్త కేసులు నమోదు కాలేదు.
Read This Story Also: ఈడీ ముందుకు రియా: కృతి సనన్ సంచలన పోస్ట్