AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు. మళ్లీ ఉద్యమం. స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటైజేషన్‌ చేయాలన్న నిర్ణయంతో రోడ్డెక్కుతోన్న పార్టీలు, సంఘాలు

విశాఖ ఉక్కు కోసం ఉద్యమం మళ్లీ మొదలైంది. స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటైజేషన్‌ చేయాలని కేంద్రం నిర్ణయించడంతో వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాలు రోడ్డెక్కుతున్నారు...

విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు. మళ్లీ ఉద్యమం. స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటైజేషన్‌ చేయాలన్న నిర్ణయంతో రోడ్డెక్కుతోన్న పార్టీలు, సంఘాలు
Venkata Narayana
|

Updated on: Feb 05, 2021 | 2:27 AM

Share

విశాఖ ఉక్కు కోసం ఉద్యమం మళ్లీ మొదలైంది. స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటైజేషన్‌ చేయాలని కేంద్రం నిర్ణయించడంతో వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాలు రోడ్డెక్కుతున్నారు. ఉక్కు ఫ్యాక్టీరీ కోసం ఉక్కు సంకల్పంతో ముందుకు కదులుతున్నారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు.. స్టీల్‌ ప్లాంట్‌ సాధన కోసం వినిపించిన ఈ నినాదం మరోసారి మార్మోగుతోంది. ప్రైవేటైజేషన్‌కు వ్యతిరేకంగా విపక్షాలు, ప్రజా, కార్మిక సంఘాలు రోడ్డెక్కాయి. స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుని తీరాలనే ఉక్కు సంకల్పంతో ముందుకు కదులుతున్నారు వివిధ పార్టీల నేతలు, ప్రజాసంఘాల నేతలు.

ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఆనాడు స్టీల్‌ ప్లాంట్‌ కోసం పోరాటం చేశారని గుర్తుచేశారు టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు. ప్రైవేటైజేషన్‌పై కేంద్రం మనసు మార్చుకునేలా ఇప్పుడాయన చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు. కేంద్రం నిర్ణయం సరికాదన్నారాయన. వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.

విశాఖలోని గాంధీ విగ్రహం దగ్గర ఆందోళన నిర్వహించారు సీపీఎం కార్యకర్తలు. స్టీల్ ప్లాంట్‌పై 40 వేల మంది ఆధారపడి ఉన్నారని గుర్తుచేశారు నాయకులు. కేంద్రం నిర్ణయంతో వాళ్ల బతుకులు రోడ్డున పడతాయన్నారు. సొంత గనులు కేటాయించకుండా సంస్థను అప్పుల్లోకి నెట్టేశారని.. దాని పరిరక్షణకు అన్ని పార్టీలు కలిసి రావాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.

40 వేల మంది కార్మికుల జీవితాలతో ముడిపడిన స్టీల్‌ ప్లాంట్‌ కోసం ఆందోళన ఉధృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించడం లేదని గత కొంతకాలంగా ప్రజాసంఘాల నేతలు సమయం వచ్చినప్పుడు తమ వాదన వినిపిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఏకంగా స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటైజేషన్‌ చేయాలని కేంద్రం నిర్ణయించడంతో అగ్గిమీద గుగ్గిలంలా మండిపడుతున్నారు. కేంద్రం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

3 గంటల పాటు హెలికాప్టర్‌ ద్వారా పూలతో స్వాగతం పలికేందుకు ఆర్జీ, చిన్నమ్మ వస్తోంది.! తమిళ రాజకీయాల్లో ఏం జరుగబోతోంది?

అమెరికా ఈజ్ బ్యాక్ : కొత్త అధ్యక్షుడి ఫారిన్ పాలసీ ఫస్ట్ స్పీచ్, భారీ సంస్కరణల దిశగా జో బైడెన్ అడుగులు

ఇండోర్ వన్డే తర్వాత రో-కో మాయం..గుండెలు బాదుకుంటున్న ఫ్యాన్స్
ఇండోర్ వన్డే తర్వాత రో-కో మాయం..గుండెలు బాదుకుంటున్న ఫ్యాన్స్
విశాఖలో మరో కీలక కార్యాలయం.. కేంద్ర హోం శాఖ నిర్ణయంతో..
విశాఖలో మరో కీలక కార్యాలయం.. కేంద్ర హోం శాఖ నిర్ణయంతో..
రవితేజ, కృష్ణవంశీ ఎందుకు మాట్లాడుకోరు.! ఓపెన్‌గా చెప్పేసిన టాలీవు
రవితేజ, కృష్ణవంశీ ఎందుకు మాట్లాడుకోరు.! ఓపెన్‌గా చెప్పేసిన టాలీవు
నాగోరే నాగోబా.. నేడే మహాపూజ.. అర్థరాత్రి నుండి జాతర షురూ..
నాగోరే నాగోబా.. నేడే మహాపూజ.. అర్థరాత్రి నుండి జాతర షురూ..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్