విశాఖ ఉక్కు.. ఇక నుంచి ప్రైవేటు హక్కు.. స్టీల్‌ప్లాంట్‌ను వంద శాతం ప్రైవేటీకరించేందుకు కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌

ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కు.. అది ఇప్పటి వరకే.. ఇక నుంచి అది ప్రైవేటు హక్కు కాబోతుంది. ఎన్నో పోరాటాల ద్వారా సాధించికున్న..

విశాఖ ఉక్కు.. ఇక నుంచి ప్రైవేటు హక్కు.. స్టీల్‌ప్లాంట్‌ను వంద శాతం ప్రైవేటీకరించేందుకు కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌
Follow us
K Sammaiah

|

Updated on: Feb 04, 2021 | 2:36 PM

ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కు.. అది ఇప్పటి వరకే.. ఇక నుంచి అది ప్రైవేటు హక్కు కాబోతుంది. ఎన్నో పోరాటాల ద్వారా సాధించికున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేయడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది. స్టీల్‌ప్లాంటట్‌ ప్రైవేటీకరణకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. స్టీల్‌ ప్లాంట్‌లో 100 శాతం వాటా విక్రయించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ నుంచి వైదొలగాలని కేంద్రం నిర్ణయించుకుంది. స్టీల్‌ ప్లాంట్‌ మేనేజ్‌మెంట్‌ బాధ్యతలతో సహా పూర్తిగా ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర క్యాబినేట్‌ ఎకనామిక్‌ అఫైర్స్‌ ఈ నిర్ణయాన్ని అధికారికంగా ఆమోదించింది.

ప్రభుత్వరంగ సంస్ధల అమ్మకం ద్వారా రూ.1.75 లక్షల కోట్ల నిధులు సమకూర్చుకొనే పనిలో బాగంగా విశాఖ ఉక్కు లాంటి ప్రభుత్వరంగ సంస్దను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడానికి కేంద్ర కేబినెట్‌ గ్నీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రస్తుతం విశాఖ ఉక్కు కర్మాగారం భూముల విలువే 2లక్షల కోట్ల పైమాటే. అలాంటి స్టీల్‌ప్లాంట్‌ను కారు చౌకగా స్ట్రాటజిక్ సేల్ పేరుతో అమ్మకానికి పట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బడ్జెట్ సమావేశాలకు ముందుగానే కేబినెట్ ఆమోదం పొందినా గోప్యంగా ఉంచినట్లు తెలుస్తుంది. కేంద్ర నిర్ణయంతో విశాఖ ఉక్కు కర్మాగారంపై ఆదారపడ్డ లక్షలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్దితి నెలకొంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంవత్సరానికి 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో నడుస్తుంది. 2030 వరకు 20 మిలియన్ టన్నుల విస్తరణకు కూడా వెళ్లాలనే లక్ష్యం పెట్టుకున్నారు. అలాంటి కంపెనీని అమ్మేయాలనే ఆలోచన వెనక కుట్ర దాగి ఉందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై పోరాటానికి సిద్ధమవుతున్నాయి.

Read more:

పోలవరం గురంచి మట్లాడే అర్హత ఆ పార్టీలకు లేదు.. వారికి రూలింగ్‌ కన్నా ట్రేడింగే ముఖ్యమన్న సోము వీర్రాజు

పంచాయతీ ఎన్నికలపై ఆ పిటిషన్‌ను కొట్టి వేసిన ఏపీ హైకోర్టు.. పిటిషనర్‌ వాదనతో ఏకీభవించని ధర్మాసనం

ప్రశాంత్ కిశోర్ వ్యానిటీ వ్యాన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
ప్రశాంత్ కిశోర్ వ్యానిటీ వ్యాన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
బీజీటీ ఆస్ట్రేలియాదే.. సిడ్నీలో భారత్ ఘోర పరాజయం
బీజీటీ ఆస్ట్రేలియాదే.. సిడ్నీలో భారత్ ఘోర పరాజయం
వారందరికీ నో రైతు భరోసా..? నగదు సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలా..?
వారందరికీ నో రైతు భరోసా..? నగదు సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలా..?
అత్యంత స్పెషల్ వికెట్ ఇదే.. క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా
అత్యంత స్పెషల్ వికెట్ ఇదే.. క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా
రైల్వేలో 32,000 ఉద్యోగాలు.. విద్యార్హతలపై రైల్వే శాఖ కీలక ప్రకటన
రైల్వేలో 32,000 ఉద్యోగాలు.. విద్యార్హతలపై రైల్వే శాఖ కీలక ప్రకటన
నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులకు డేంజర్ బెల్స్‌..!
నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులకు డేంజర్ బెల్స్‌..!
మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు షురూ.. చివరి తేదీ ఇదే
మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు షురూ.. చివరి తేదీ ఇదే
ఆసీస్ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన కింగ్ కోహ్లీ
ఆసీస్ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన కింగ్ కోహ్లీ
సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు!
సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు!
టీమిండియా విజయానికి 7 వికెట్లు.. ఆసీస్‌కు 91 పరుగులు..
టీమిండియా విజయానికి 7 వికెట్లు.. ఆసీస్‌కు 91 పరుగులు..