పోలవరం గురంచి మట్లాడే అర్హత ఆ పార్టీలకు లేదు.. వారికి రూలింగ్ కన్నా ట్రేడింగే ముఖ్యమన్న సోము వీర్రాజు
బీజేపీలోకి ఇతర పార్టీల నుంచి భారీగా వలసలు పెరగబోతున్నాయని ఆపార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. ఇతర పార్టీల్లోని కీలక..
బీజేపీలోకి ఇతర పార్టీల నుంచి భారీగా వలసలు పెరగబోతున్నాయని ఆపార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. ఇతర పార్టీల్లోని కీలక నేతలంతా త్వరలోనే కాషాయ కండువా కప్పుకుంటారని తెలిపారు. వారిలో మాజీ ఎంపీ లు, ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు.
వైసీపీ, టీడీపీ పార్టీలకు పోలవరం గురించి మాట్లాడే అర్హత లేదని సోము వీర్రాజు విమర్శించారు. భద్రాచలాన్ని ఏపీలో కలపాలని డిమాండ్ చేసింది తానేనని గుర్తు చేశారు. వైసీపీ, టీడీపీలకు రూలింగ్ కన్నా ట్రేడింగే ముఖ్యన్నారు. అచ్చన్నాయుడు హోమ్ మంత్రి అంటే చంద్రబాబు ఫ్యామిలీ కి హోమ్ మంత్రిలాగా అని ఎద్దేవా చేశారు.
ఏపీలో వారసత్వ రాజకీయాలను తరిమికొట్టాలని సోము వీర్రాజు పిలుపునిచ్చారు. చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఒక బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చెయ్యగలరా అని సవాల్ విసిరారు. ఏపీలో ఉన్న ఇద్దరు నేతలు ఒకరు సింగిల్ స్టిక్కర్ అయితే మరొకరు డబల్ స్టిక్కర్ అంటూ చంద్రబాబు, జగన్ ను ఉద్దేశించి అన్నారు.
రాయలసీమకు చెందిన ఇద్దరు వ్యక్తులు ముఖ్యమంత్రులుగా ఉండి రాయలసీమను అభివృద్ధి చెయ్యలేకపోయారని విమర్శించారు. టీడీపీ మహిళా ఎంపీ పోలవరం వద్దని పార్లమెంట్ వేదికగా ప్రకటించిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదన్నారు. వైసీపీ, టీడీపీ నేతలకు సిమెంట్ ఘనులు కావాలి కానీ సిమెంట్ పరిశ్రమలు మాత్రం ఏర్పాటు చెయ్యరని సోము వీర్రాజు విమర్శించారు.
Read more:
పంచాయతీ ఎన్నికలపై ఆ పిటిషన్‌ను కొట్టి వేసిన ఏపీ హైకోర్టు.. పిటిషనర్ వాదనతో ఏకీభవించని ధర్మాసనం