AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

3 గంటల పాటు హెలికాప్టర్‌ ద్వారా పూలతో స్వాగతం పలికేందుకు ఆర్జీ, చిన్నమ్మ వస్తోంది.! తమిళ రాజకీయాల్లో ఏం జరుగబోతోంది?

తమిళనాడులో అసలు సిసలు రాజకీయం ఇప్పుడు మొదలవుతోంది.. ఎందుకంటే..మరో మూడు రోజుల్లో శశికళ రాష్ట్రంలో అడుగుపెట్టబోతున్నారు...

3 గంటల పాటు హెలికాప్టర్‌ ద్వారా పూలతో స్వాగతం పలికేందుకు ఆర్జీ, చిన్నమ్మ వస్తోంది.! తమిళ రాజకీయాల్లో ఏం జరుగబోతోంది?
Venkata Narayana
|

Updated on: Feb 05, 2021 | 2:06 AM

Share

తమిళనాడులో అసలు సిసలు రాజకీయం ఇప్పుడు మొదలవుతోంది.. ఎందుకంటే..మరో మూడు రోజుల్లో శశికళ రాష్ట్రంలో అడుగుపెట్టబోతున్నారు. నాలుగేళ్ల తర్వాత అరవనాట ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీంతో తమిళనాడులో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. జైలుకు వెళ్లేముందు జయలలిత సమాధి దగ్గర శశికళ వీరశపథం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వచ్చీరాగానే మళ్లీ జయసమాధిని సందర్శించే ప్లాన్‌లో ఉన్నారు చిన్నమ్మ. ఈ నెల 8న చెన్నైకి రానున్న శశికళకు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమైంది చిన్నమ్మ వర్గం.

భారీ స్వాగత ఏర్పాట్ల మధ్య శశికళను చెన్నైకి తీసుకురాబోతున్నారు. ఆ తర్వాత తన శపథం నెరవేర్చుకుంటారంటోంది చిన్నమ్మ వర్గం. వందలాది కార్లలో ర్యాలీగా వెళ్లిన శశికళ ఇప్పుడు విడుదల అనంతరం అంతకు మించి హడావిడి… ఆర్భాటంగా చెన్నై రావాలని చూస్తోంది… ఏకంగా హోసూరు నుంచి చెన్నై వరకు హెలికాప్టర్‌ ద్వారా పూలవర్షం కోసం మాజీ ఎమ్మెల్యే జయంతి పద్మనాభన్‌ అనుమతి కోరారు. మూడు గంటల పాటు హెలికాప్టర్‌ ద్వారా పూలతో స్వాగతం పలికేందుకు అనుమతి ఇవ్వాలని వేలూరు కలెక్టర్‌ను అభ్యర్థించారు.

అంతవరకు ఒకే… కానీ.. శశికళ అంటేనే గిట్టని అన్నాడీఎంకే ప్రభుత్వ, పార్టీ పెద్దలు ఆమెను కట్టడి చేయాలన్న ప్లాన్‌లో ఉన్నారు. ముందస్తుగా జయ స్మారకమందిరాన్ని 15రోజుల పాటు క్లోజ్ చేశారు. అంటే శశికళకు నో చెబుతున్నట్లు కాకుండా..ఏవో అనివార్యకారణాలను తెరపైకి తెస్తున్నారన్నమాట. సో…ఈ పరిస్థితుల్లో శశికళ వ్యూహమేంటన్నది ఉత్కంఠ రేపుతోంది. అయితే శశికళ రావాలి.. జయ స్మారకం దర్శించాలి.. ఆపై తమిళనాట పొలిటికల్ క్వీన్‌ అవ్వాలి.. అనేది శశికళ మద్దతుదారుల ఆలోచన.

ఆరోజున ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తమిళనాట పాలిటిక్స్ ఇపుడు మరింత రసవత్తరంగా మారుతున్నాయి.. తమిళనాడు రాజకీయాలు ఇప్పటిదాకా ఒక లెక్క…ఇకపై మరో లెక్క అంటోంది చిన్నమ్మ వర్గం.. ఏంటా లెక్క… చిన్నమ్మ స్కెచ్ ఎలా ఉండబోతోంది..? ఎఐఏడిఎంకేలో చీలిక రాబోతోందా.. ? పార్టీ హస్తగతానికి రంగం సిద్ధమవుతోందా..? ఇప్పుడు ఈ విషయాలన్నీ తమిళనాడులో హాట్‌టాపిక్‌గా మారాయి.

చిన్నమ్మ స్కెచ్ భారీగానే ఉంది. 2017 లో సీఎంగా ప్రమాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నా..జైలుకెళ్లడంతో పదవికి దూరమయ్యారు. అప్పట్లో చేసేదేమీ లేక ఊరుకున్నా… ఇపుడు మాత్రం అలా కాదంటోంది చిన్నమ్మ వర్గం. అన్నాడీఎంకేలో ఉన్న నేతలు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. మరోవైపు శశికళకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్లు వెలిశాయి. వారిపై సీఎం చర్యలు కూడా ప్రారంభించారు. ఇక బెంగళూరు లో ఉన్న శశికళ చెన్నైకి రాగానే అసలు కార్యాచరణ ఉండబోతోంది.

ఇప్పటికే ఎమ్మెల్యేలలో సగానికి పైగా..చిన్నమ్మకు టచ్ లోకి వెళ్లారని సమాచారం. అలాగే శశికళ గతంలో పార్టీ ప్రధాన కార్యదర్శి తానే అని వేసిన పిటిషన్‌పై ఇపుడు మళ్లీ దృష్టి పెట్టారు. గతంలో తనను ప్రధాన కార్యదర్శిగా ప్రతిపాదించి.. ఆమోదించిన వారి సంతకాలు చూపించి కోర్టు ద్వారానే తేల్చుకోవాలని చూస్తున్నారు. ఇటు తన బలంతో పార్టీలో ఉన్న వారిని తన వైపు తిప్పుకుని పార్టీ క్యాప్చర్ కోసం తీవ్ర ప్రయత్నాల్లో ఉంది చిన్నమ్మ వర్గం.

అమెరికా ఈజ్ బ్యాక్ : కొత్త అధ్యక్షుడి ఫారిన్ పాలసీ ఫస్ట్ స్పీచ్, భారీ సంస్కరణల దిశగా జో బైడెన్ అడుగులు

గత 60 ఏళ్లలో ఏనాడూ పంచాయతీ ఎన్నికల పోలింగ్ చూడని ఊరది, ఇప్పుడు కొత్త టర్న్.. ఆరుగురు మహిళలు నువ్వా, నేనా.? అంటున్నారు

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్