గత 60 ఏళ్లలో ఏనాడూ పంచాయతీ ఎన్నికల పోలింగ్ చూడని ఊరది, ఇప్పుడు కొత్త టర్న్.. ఆరుగురు మహిళలు నువ్వా, నేనా.? అంటున్నారు

చిత్తూరు జిల్లాలోని ఆ పంచాయతీకి గత 60 ఏళ్లలో ఎప్పుడూ ఎన్నికలే జరుగలేదు. 60 ఏళ్లుగా ఓటింగ్ ఎరుగని పంచాయతీ అది. పార్టీలతో సంబంధం లేకుండా..

గత 60 ఏళ్లలో ఏనాడూ పంచాయతీ ఎన్నికల పోలింగ్ చూడని ఊరది, ఇప్పుడు కొత్త టర్న్.. ఆరుగురు మహిళలు నువ్వా, నేనా.? అంటున్నారు
Follow us
Venkata Narayana

|

Updated on: Feb 05, 2021 | 1:09 AM

చిత్తూరు జిల్లాలోని ఆ పంచాయతీకి గత 60 ఏళ్లలో ఎప్పుడూ ఎన్నికలే జరుగలేదు. 60 ఏళ్లుగా ఓటింగ్ ఎరుగని పంచాయతీ అది. పార్టీలతో సంబంధం లేకుండా గ్రామ పెద్దలే పంచాయితీ సర్పంచ్ పీఠాన్ని ఎవరు అధిరోహించాలనేది నిర్ణయిస్తూ వచ్చారు. ఇప్పటి వరకు ఏకగ్రీవమైన ఆ పంచాయతీ తొలిసారి పోటీకి సిద్ధమైంది. ఇద్దరుకాదు.. ముగ్గురుకాదు, ఏకంగా ఆరుగురు మహిళలను బరిలో నిలిపింది.

చిత్తూరు జిల్లా వెదురుకుప్పం. డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న గంగాధర నెల్లూరు నియోజక వర్గంలోని మండల కేంద్రం. ఏపీ పంచాయతీ రాజ్ చట్టం 1959 లో అమల్లోకి వచ్చిన నాటి నుంచి పార్టీలకు అతీతంగా పంచాయతీ తీర్మానమే వెదురుకుప్పం సర్పంచులను ఏకగ్రీవం చేస్తూ వచ్చింది. దీంతో 60 ఏళ్లుగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు ఎరగని వెదురుకుప్పం ఎట్టకేలకు పోటీకి సిద్ధమైంది. సమితిలుగా ఉన్న నాటి నుంచి గ్రామపంచాయతీ ఏర్పడిన నేటి వరకు ఒక్కసారి కూడా వెదురుకుప్పం ఓటర్లు ఎన్నికల్లో ఓటు వేయలేదంటే ఇక్కడి పంచాయితీ పెద్దల నిర్ణయం, గ్రామం చేసే తీర్మానం ఇప్పటి దాకా ఐక్యత ను చాటుతూ వచ్చింది. ఇప్పటి వరకు ఏకగ్రీవ సర్పంచుల పాలన కొనసాగేలా చేసింది.

స్థానిక సంస్థల ఎన్నికల నగర మోగిన వేళ వెదురుకుప్పంలో పంచాయతీ పీఠం ఎక్కించేందుకు పెద్దలు ఎప్పటిలాగానే రచ్చబండ నిర్వహించారు. దాదాపు 1900 మంది ఓటర్లు ఉన్న వెదురుకుప్పం పంచాయతీలో రాజకీయ పార్టీలు వేరైనా… ఎన్ని విభేదాలున్నా అన్ని పార్టీ నాయకులు ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చే ఎన్నిక ఈ ఏడాది పోలింగ్ అనివార్యం చేసింది. గ్రామంలోని ధర్మరాజుల గుడిలో పంచాయతీ పెద్దలు కలిసి నిర్ణయించే నిర్ణయమే సర్పంచ్ పదవి ఏకగ్రీవం ఆనవాయితీగా రాగా, ఎస్ సి మహిళకు రిజర్వ్ అయిన వెదురుకుప్పం పంచాయతీ పీఠం కోసం ఆరుగురు మహిళలు పోటీకి సిద్ధమయ్యారు. 13 మంది నామినేషన్ లు దాఖలు చేయగా ఏడుగురు వెనక్కి తగ్గడంతో చివరికి ఆరుగురు బరిలో నిలిచారు.

100 మంది ఓటర్లతో ప్రారంభమైన పంచాయతీ, ఇప్పుడు దాదాపు 1900 మంది ఓట్లర్లకు పెరిగాక జరుగుతున్న పంచాయతీ పోరు ఏకగ్రీవ అనవాయితీని బ్రేక్ చేసింది. పంచాయతీ ఏర్పడిన తొలినాళ్ళలో రాజకీయాలపై అవగాహన లేని నాటి నుంచే పంచాయతీ సర్పంచ్ ఎంపిక మాత్రం పంచాయతీ ప్రజల ఉమ్మడి నిర్ణయంతోనే వెదురుకుప్పంలో అమలు అయ్యేది. ఈ క్రమంలోనే పంచాయతీలో మొట్టమొదటి సర్పంచ్ గా బండి చెంగారెడ్డి ఎంపికకాగా, పంచాయతీ సర్పంచ్ ల రిజర్వేషన్ స్థానాలు ఏర్పడినప్పటికీ వెదురుకుప్పంలో మాత్రం మార్పు రాలేదు. ఈ కారణంగానే మండలానికి చెందిన శివశంకర్ రెడ్డి వరుసగా ఐదు పర్యాయాలు 30 ఏళ్ళ పాటు సర్పంచ్ గా కొనసాగారు.

అనంతరం మహిళా సర్పంచ్ గా నీరజా రాధా రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక. ఇదే క్రమంలో ఎస్సీ సామాజికవర్గం నుంచి చిన్నబ్బ పంచాయతీ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం చిరంజీవి రెడ్డి, నవనీతమ్మలు సైతం ఏకగ్రీవ సర్పంచులు గానే ఎన్నికై సేవలందించారు. అయితే, 2021లో సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు కావడం గతంలో ఎన్నడూ లేనివిధంగా సర్పంచ్ పదవికి పోటీ పడి నామినేషన్ లు దాఖలు చేశారు. పంచాయతీ నిర్ణయం మేరకే అభ్యర్థి ఏకగ్రీవం అవుతుందన్న ఆసక్తి ఎట్టకేలకు ఎన్నిక అనివార్యమని తేల్చడంతో వెదురుకుప్పంలో ఎన్నికల సందడి మొదలైంది. ఏకగ్రీవ సాంప్రదాయానికి మంగళం పాడిన పెద్దల పంచాయితీ ఎవరిని మహారాణి గా చేస్తుందో మరి.

అమెరికా కొత్త అధ్యక్షుడి ఫారిన్ పాలసీ ఫస్ట్ స్పీచ్, భారీ సంస్కరణల దిశగా జో బైడెన్ అడుగులు

గత 60 ఏళ్లలో ఏనాడూ పంచాయతీ ఎన్నికల పోలింగ్ చూడని ఊరది, ఇప్పుడు కొత్త టర్న్.. ఆరుగురు మహిళలు నువ్వా, నేనా.? అంటున్నారు

ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన