ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్‌ల ప్రింటింగ్ బంద్.. రీజన్ “పసుపు-కుంకుమే”అట..!

ఏపీలో గత కొద్దిరోజులుగా డ్రైవింగ్ లైసెన్స్ కార్డుల ప్రింటింగ్ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. డ్రైవింగ్ టెస్ట్‌లో ఉత్తీర్ణులైన వారికి రావాల్సిన డ్రైవింగ్ లైసెన్స్ కార్డు.. రెండు నెలలు గడిచినా ఇంకా.. వారికి లేటెస్ట్ చిప్ బేస్డ్ సింథటిక్ కార్డు రాలేదు. ఇంకా ఎందుకు రాలేదని ప్రశ్నిస్తే.. అధికారుల నుంచి వచ్చిన మాటల్ని చూసి ఖంగుతిన్నారు సదరు వ్యక్తులు. కార్డులు ప్రింటింగ్ చేయించడానికి తమ శాఖ వద్ద డబ్బులు లేవని పేర్కొన్నారట. తమ డిపార్ట్‌మెంట్‌కు రావాల్సిన నిధులు.. పసుపు కుంకుమ […]

ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్‌ల ప్రింటింగ్ బంద్.. రీజన్ పసుపు-కుంకుమేఅట..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 07, 2020 | 12:25 PM

ఏపీలో గత కొద్దిరోజులుగా డ్రైవింగ్ లైసెన్స్ కార్డుల ప్రింటింగ్ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. డ్రైవింగ్ టెస్ట్‌లో ఉత్తీర్ణులైన వారికి రావాల్సిన డ్రైవింగ్ లైసెన్స్ కార్డు.. రెండు నెలలు గడిచినా ఇంకా.. వారికి లేటెస్ట్ చిప్ బేస్డ్ సింథటిక్ కార్డు రాలేదు. ఇంకా ఎందుకు రాలేదని ప్రశ్నిస్తే.. అధికారుల నుంచి వచ్చిన మాటల్ని చూసి ఖంగుతిన్నారు సదరు వ్యక్తులు. కార్డులు ప్రింటింగ్ చేయించడానికి తమ శాఖ వద్ద డబ్బులు లేవని పేర్కొన్నారట. తమ డిపార్ట్‌మెంట్‌కు రావాల్సిన నిధులు.. పసుపు కుంకుమ కోసం కేటాయించడంతో.. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ కార్డులను ముద్రించలేకపోతున్నట్లు రవాణా శాఖ సిబ్బంది తెలిపారట.

రాజమహేంద్రవరానికి చెందిన ఓ వ్యక్తి.. గతేడాది డిసెంబర్ నెలాఖరి వారంలో డ్రైవింగ్ లైసెన్స్ కోసం పెట్టిన టెస్ట్‌లో ఉత్తీర్ణుడయ్యాడు. అయితే అతడికి ఇప్పటి వరకు ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ గుర్తింపు కార్డు రాలేదు. దీంతో కార్డు వివరాలు తెలుసుకునేందుకు ఆర్టీవో ఆఫీస్‌కు వెళ్లాడు. అయితే విషయం తెలుసుకున్న సదరు వ్యక్తి షాక్ తిన్నాడు. ఇంకా కార్డు ప్రింటింగ్ కాలేదని.. ప్రస్తుతం కార్డు ప్రింటింగ్ చేసేందుకు మా శాఖ వద్ద డబ్బులు లేవని తెలిపారట. గత ప్రభుత్వంలో తమ శాఖకు రావాల్సిన నిధులను.. పసుపు కుంకుమ కార్యక్రమం కోసం విడుదల చేయడంతో.. తమ వద్ద ప్రస్తుతం నిధుల కొరత ఏర్పడిందని పేర్కొన్నారట.

డబ్బులు ముందే చెల్లించినా..

కాగా.. ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకుంటే.. వారి కార్డుకు సంబంధించిన డబ్బులను కూడా రవాణా శాఖ దరఖాస్తుదారుడి వద్ద నుంచే వసూలు చేస్తుంది. కానీ అధికారులు మాత్రం ప్రభుత్వం పేరు చెప్పడమేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డబ్బులు ముందే చెల్లించాక కూడా ఇంకా కార్డులు రాకపోవడంతో.. వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

“పసుపు-కుంకుమ” కారణం ఎలా..?

ఇక.. 2019 ఏప్రిల్‌లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. అప్పటి సీఎం చంద్రబాబు హయాంలో పసుపు కుంకుమ పథకాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు ఈ పథకం కింద.. రూ.10వేలు ఇస్తామని ప్రకటించింది. ఆ డబ్బును మూడు దశల్లో ఇస్తామని హామీ కూడా ఇచ్చింది. 2019 ఫిబ్రవరి, 2019 మార్చిలో రెండు విడుతలుగా ఈ నిధులను విడుదల చేసింది అప్పటి టీడీపీ ప్రభుత్వం. ఆ తర్వాత మూడో విడుత నిధులను.. ఎన్నికలు ముగిసిన తర్వాత ఇస్తామని ప్రకటించింది. అయితే.. పసుపు కుంకుమ కింద డ్వాక్రా మహిళలకు ఇవ్వాల్సిన నిధులను.. వివిధ శాఖల నుంచి మళ్లించారు. అందులో రవాణా శాఖకు చెందిన నిధులు కూడా ఉన్నాయని ఆ శాఖ సిబ్బంది పేర్కొంటున్నారు.

ఈ నూనెను వంటలో వాడుతున్నారా? క్యాన్సర్‌ ప్రమాదం.. షాకింగ్ నిజాలు
ఈ నూనెను వంటలో వాడుతున్నారా? క్యాన్సర్‌ ప్రమాదం.. షాకింగ్ నిజాలు
తండేల్ నుంచి శివ శక్తి సాంగ్ రిలీజ్..
తండేల్ నుంచి శివ శక్తి సాంగ్ రిలీజ్..
KYC పేరుతో ఆఫీసర్‌కి మెసేజ్‌.. క్షణాల్లోనే రూ.13 లక్షలు మయం!
KYC పేరుతో ఆఫీసర్‌కి మెసేజ్‌.. క్షణాల్లోనే రూ.13 లక్షలు మయం!
'గేమ్ ఛేంజర్' బెనిఫిట్‌ షోలకు గ్రీన్ సిగ్నల్.. టికెట్ రేట్లు ఇవే
'గేమ్ ఛేంజర్' బెనిఫిట్‌ షోలకు గ్రీన్ సిగ్నల్.. టికెట్ రేట్లు ఇవే
ఘాటు ఘాటుగా మటన్ దాల్ ఘోస్ట్.. ఇలా చేస్తే టేస్ట్ వేరే లెవల్!
ఘాటు ఘాటుగా మటన్ దాల్ ఘోస్ట్.. ఇలా చేస్తే టేస్ట్ వేరే లెవల్!
మోడీ చేతుల మీదుగా.. చర్లపల్లి టెర్మినల్ ఓపెనింగ్ కు సర్వం సిద్దం
మోడీ చేతుల మీదుగా.. చర్లపల్లి టెర్మినల్ ఓపెనింగ్ కు సర్వం సిద్దం
విమానంలో ఉచిత Wi-Fi ఎక్కడ నుండి వస్తుంది? డేటా ఎందుకు పని చేయదు?
విమానంలో ఉచిత Wi-Fi ఎక్కడ నుండి వస్తుంది? డేటా ఎందుకు పని చేయదు?
అలా అయితేనే వైసీపీకి రాష్ట్రంలో పూర్వవైభవం.. జగనే మారాలట..!
అలా అయితేనే వైసీపీకి రాష్ట్రంలో పూర్వవైభవం.. జగనే మారాలట..!
శంకర్ గారితో పనిచేయడాన్ని ఎంజాయ్ చేశాను.. రామ్ చరణ్
శంకర్ గారితో పనిచేయడాన్ని ఎంజాయ్ చేశాను.. రామ్ చరణ్
బ్రహ్మకమలాలు విరబూస్తే నిజంగా సిరులు కురుస్తాయా?
బ్రహ్మకమలాలు విరబూస్తే నిజంగా సిరులు కురుస్తాయా?