బ్రేకింగ్ న్యూస్: బాలకృష్ణ చిన్నల్లుడికి భారీ షాక్
టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్నల్లుడు, గీతం సంస్థల అధినేత శ్రీ భరత్‌కు భారీ షాక్ తగిలింది. భరత్ తండ్రి పట్టాభి రామారావు, చిన్నాన్న లక్షణరావు, ఇతర కుటుంబ సభ్యులకు కరూర్ వైశ్యా బ్యాంక్ నోటీసులు జారీ చేసింది. ఈ విషయంపై శ్రీ భరత్ స్పందించకపోవడంతో.. ఏకంగా ఆస్తుల జప్తుకు సిద్ధమైంది బ్యాంక్. దాదాపు రూ.124 కోట్లా 39 లక్షల 21 వేలు తిరిగి చెల్లించాలని.. లేని పక్షంలో తాకట్టుపెట్టిన ఆస్తులను జప్తు చేస్తామని నోటీసులో […]
టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్నల్లుడు, గీతం సంస్థల అధినేత శ్రీ భరత్‌కు భారీ షాక్ తగిలింది. భరత్ తండ్రి పట్టాభి రామారావు, చిన్నాన్న లక్షణరావు, ఇతర కుటుంబ సభ్యులకు కరూర్ వైశ్యా బ్యాంక్ నోటీసులు జారీ చేసింది. ఈ విషయంపై శ్రీ భరత్ స్పందించకపోవడంతో.. ఏకంగా ఆస్తుల జప్తుకు సిద్ధమైంది బ్యాంక్. దాదాపు రూ.124 కోట్లా 39 లక్షల 21 వేలు తిరిగి చెల్లించాలని.. లేని పక్షంలో తాకట్టుపెట్టిన ఆస్తులను జప్తు చేస్తామని నోటీసులో పేర్కొంది బ్యాంకు.
టెక్నో యూనిట్ ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట శ్రీ భరత్ కుటుంబం వైజాగ్‌లోని గాజువాక, భీమిలీలోని భూములను తాకట్టు పెట్టి.. దాదాపు రూ.124 కోట్లకు పైగా డబ్బును అప్పుగా తీసుకున్నారు. అప్పటినుంచీ ఇప్పటివరకూ వడ్డీ కూడా కట్టకపోవడంతో.. బ్యాంకు నోటీసులు జారీ చేసింది. కాగా.. ఈ అప్పును 21.01.2020 నాటికి కంపెనీ పేరిట తీసుకున్న వడ్డీతో కలిపి అసలు కూడా కలిపి చెల్లించాలని నోటీసులో తెలిపింది బ్యాంకు. కాగా గతంలో ఆంధ్రాబ్యాంక్ విషయంలో కూడా శ్రీ భరత్‌పై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి.