AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP POLYCET 2026 Results: మరోవారంలో పాలిసెట్‌ 2026 ఫలితాలు విడుదల.. ఇక్కడ ఆన్సర్‌ కీ డౌన్‌లోడ్ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ పాలిసెట్‌ 2026) ప్రవేశ పరీక్ష ఈ నెల 25న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు మొత్తం 92 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,77,581 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. ఇందులో 1,63,008 మంది పరీక్ష రాశారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాధమిక ఆన్సర్‌ కీ..

AP POLYCET 2026 Results: మరోవారంలో పాలిసెట్‌ 2026 ఫలితాలు విడుదల.. ఇక్కడ ఆన్సర్‌ కీ డౌన్‌లోడ్ చేసుకోండి
AP Polycet Answer Key
Srilakshmi C
|

Updated on: Apr 29, 2026 | 8:21 AM

Share

అమరావతి, ఏప్రిల్‌ 29: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్‌ 25న ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ పాలిసెట్‌ 2026) ప్రవేశ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు మొత్తం 92 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,77,581 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. ఇందులో 1,63,008 మంది పరీక్ష రాశారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాధమిక ఆన్సర్‌ కీని తాజాగా ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈ మేరకు అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి సెట్ల వారీగా ఆన్సర్ కీని డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఉన్నత విద్య కమిషనర్‌ నారాయణ భరత్‌ గుప్తా తెలిపారు.

ఏపీ పాలీసెట్‌ 2026 ఆన్సర్‌ కీ డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఆన్సర్ కీపై అభ్యంతరాలను స్వీకరిస్తామని, అనంతరం తుది ఆన్సర్‌ కీ రూపొందించి ఫలితాలు వెల్లడించనున్నట్లు ఆయన వివరించారు. విద్యార్థులు పరీక్షలో రాసిన సెట్ A, B, C, Dలకు సంబంధించిన సమాధానాల కీని ఈ కింది లింక్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పాలీసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా విద్యార్థులకు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (SBTET AP) కౌన్సెలింగ్‌ నిర్వహించి సీట్లు కేటాయించనుంది. మరోవైపు ఏపీ పాలీసెట్‌ ఫలితాలను మే 5న వెల్లడించేందుకు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి ఏర్పాట్లు చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఏపీ పాలీసెట్‌ 2026 ఆన్సర్‌ కీ డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ICAI CA 2026 మే సెషన్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) మే 2026 సెషన్‌కు సంబంధించి సీఏ ఫౌండేషన్ పరీక్షల అడ్మిట్ కార్డులను ICAI తాజాగా విడుదల చేసింది. విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ICAI CA 2026 మే సెషన్‌ అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.

Follow Us