AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyundai: హ్యుందాయ్ నుంచి అదిరిపోయే ఈవీ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 496 కి.మీ రేంజ్.. బడ్జెట్‌ ధరల్లోనే..

Hyundai EV: హ్యుందాయ్ ఈ కారును సుమారు 25,000 యూరోల (దాదాపు రూ.26 - రూ.28 లక్షలు) ప్రారంభ ధరతో గ్లోబల్ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను బట్టి చూస్తే, భవిష్యత్తులో హ్యుందాయ్ ఈ మోడల్‌ను ఇక్కడి మార్కెట్‌కు..

Hyundai: హ్యుందాయ్ నుంచి అదిరిపోయే ఈవీ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 496 కి.మీ రేంజ్.. బడ్జెట్‌ ధరల్లోనే..
Hyundai Ioniq 3
Subhash Goud
|

Updated on: Apr 29, 2026 | 8:35 AM

Share

Hyundai EV: ఎలక్ట్రిక్ వాహన రంగంలో హ్యుందాయ్ తన పట్టును మరింత బిగించేందుకు సిద్ధమైంది. తాజాగా గ్లోబల్ మార్కెట్లోకి ‘అయోనిక్ 3’ (Ioniq 3) అనే కాంపాక్ట్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ను పరిచయం చేసింది. మెరుగైన రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్, స్మార్ట్ ఫీచర్లతో వస్తున్న ఈ కారు మధ్యతరగతి ఈవీ ప్రియులను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు.

డిజైన్, కొలతలు:

  • అయోనిక్ 3 ని హ్యుందాయ్ తన ‘ఏరో హ్యాచ్’ (Aero Hatch) డిజైన్ ఫిలాసఫీతో నిర్మించింది. దీనివల్ల కారు గాలిని సులువుగా చీల్చుకుంటూ వెళ్తుంది.
  • పొడవు: 4,155 మి.మీ (దాదాపు హ్యాచ్‌బ్యాక్ సైజులో ఉన్నా, లోపల స్పేస్ మాత్రం ఎస్‌యూవీ తరహాలో ఉంటుంది).
  • వీల్‌బేస్: 2,680 మి.మీ ఉండటం వల్ల లెగ్ రూమ్ చాలా ఎక్కువగా లభిస్తుంది.
  • లైటింగ్: ఇతర అయోనిక్ మోడల్స్ లాగే దీనికి కూడా ‘పిక్సెల్ స్టైల్’ ఎల్‌ఈడీ లైట్లు ఉన్నాయి.

బ్యాటరీ, పర్ఫార్మెన్స్:

ఈ కారు రెండు బ్యాటరీ ఆప్షన్లలో అందుబాటులో ఉంది: స్టాండర్డ్ ప్యాక్ (42.2 kWh): ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 344 కి.మీ రేంజ్ ఇస్తుంది. లాంగ్ రేంజ్ వెర్షన్ (61 kWh): ఇది గరిష్టంగా 496 కి.మీ (WLTP) రేంజ్ అందిస్తుంది.

పవర్: 147 PS పవర్, 250 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది 0 నుండి 100 కి.మీ వేగాన్ని కేవలం 9 సెకన్లలో అందుకుంటుంది.

ఇవి కూడా చదవండి

ఫాస్ట్ ఛార్జింగ్:

ఈ కారులోని అతిపెద్ద ప్లస్ పాయింట్ ఛార్జింగ్ వేగం. డీసీ (DC) ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 29 నుండి 30 నిమిషాల్లో 10% నుండి 80% వరకు బ్యాటరీని నింపవచ్చు.

ఇంటీరియర్, ఫీచర్లు:

లోపల 14.6 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. V2L (Vehicle-to-Load): ఈ ఫీచర్ ద్వారా కారు బ్యాటరీని ఉపయోగించి ల్యాప్‌టాప్స్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక భద్రత విషయానికొస్తే.. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్-కీపింగ్ అసిస్ట్ వంటి అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) ఇందులో ఉన్నాయి. హ్యుందాయ్ ఈ కారును సుమారు 25,000 యూరోల (దాదాపు రూ.26 – రూ.28 లక్షలు) ప్రారంభ ధరతో గ్లోబల్ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను బట్టి చూస్తే, భవిష్యత్తులో హ్యుందాయ్ ఈ మోడల్‌ను ఇక్కడి మార్కెట్‌కు అనుగుణంగా రూ.20 – రూ.30 లక్షల బడ్జెట్‌లో లాంచ్ చేసే అవకాశం ఉంది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!