AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి ముహూర్తం దాటిపోయింది.. కానీ పెళ్లి కొడుకు జాడ లేదు.. ఏంటా అని వెళ్లి చూడగా.!

బీహార్‌లోని బక్సర్ జిల్లాలో నెలకొన్న తీవ్ర ఇంధన కొరత సామాన్యుల జీవితాలను అతలాకుతలం చేయడమే కాకుండా, ఒక జంట జీవితంలో ఎంతో ముఖ్యమైన పెళ్లి వేడుకలో తీరని నిరాశ మిగిల్చింది. పెట్రోల్, డీజిల్ దొరక్కపోవడంతో పెళ్లికొడుకు కారు మార్గమధ్యంలోనే ఆగిపోయి, ముహూర్త సమయానికి పెళ్లి వేదికకు చేరుకోలేకపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పెళ్లి ముహూర్తం దాటిపోయింది.. కానీ పెళ్లి కొడుకు జాడ లేదు.. ఏంటా అని వెళ్లి చూడగా.!
Groom Car Stuck On Road
Balaraju Goud
|

Updated on: Apr 29, 2026 | 8:05 AM

Share

బీహార్‌లోని బక్సర్ జిల్లాలో నెలకొన్న తీవ్ర ఇంధన కొరత సామాన్యుల జీవితాలను అతలాకుతలం చేయడమే కాకుండా, ఒక జంట జీవితంలో ఎంతో ముఖ్యమైన పెళ్లి వేడుకలో తీరని నిరాశ మిగిల్చింది. పెట్రోల్, డీజిల్ దొరక్కపోవడంతో పెళ్లికొడుకు కారు మార్గమధ్యంలోనే ఆగిపోయి, ముహూర్త సమయానికి పెళ్లి వేదికకు చేరుకోలేకపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

బక్సర్‌లో ఒక వివాహ వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెళ్లికూతురు ముస్తాబై, పెళ్లి మంటపంలో వరుడి రాక కోసం ఆత్రుతగా ఎదురుచూస్తోంది. బంధుమిత్రులతో కోలాహలంగా ఉన్న ఆ ఇంట్లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. కారణం, పెళ్లికొడుకు ప్రయాణిస్తున్న కారులో పెట్రోల్ అయిపోవడం. దారి పొడవునా ఉన్న పెట్రోల్ పంపుల వద్ద “నో స్టాక్” అనే బోర్డులు కనిపించడంతో, ఆ వాహనం రోడ్డు మధ్యలోనే నిలిచిపోయింది.

వరుడు తోపాటు అతని కుటుంబ సభ్యులు ప్రత్యామ్నాయ వాహనం కోసం, ఇంధనం కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, బక్సర్‌లోని మహారాజా పెట్రోల్ పంప్ సహా దాదాపు అన్ని ప్రధాన కేంద్రాల వద్ద వందలాది వాహనాలు క్యూలో ఉండటం, చాలా చోట్ల సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు. పెట్రోల్, డీజిల్‌తో పాటు సీఎన్‌జీ స్టేషన్ల వద్ద కూడా పరిస్థితి దారుణంగా ఉంది. ఈ జాప్యం వల్ల పెళ్లికి నిర్ణయించిన శుభ ముహూర్తం కాస్తా దాటిపోయింది.

ఈ ఇంధన సంక్షోభం కేవలం ఈ ఒక్క పెళ్లికే పరిమితం కాలేదు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో అనేక ఊరేగింపు వాహనాలు (బారాత్) మార్గమధ్యంలోనే ఆగిపోయాయి. దీనివల్ల కుటుంబాల బడ్జెట్ తలకిందులైంది. శుభకార్యాల ప్రణాళికలు తారుమారు అయ్యాయి. నిత్యావసరాల రవాణా నిలిచిపోయి సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.

ప్రస్తుతం బక్సర్ ప్రజలు జిల్లా యంత్రాంగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో కూడా ఇంధనం అందుబాటులో లేకపోవడం అధికారుల వైఫల్యమేనని స్థానికులు మండిపడుతున్నారు. సరఫరా ఎప్పుడు పునరుద్ధరించబడుతుందో తెలియక, ప్రజలు గంటల తరబడి పంపుల వద్ద నిరీక్షిస్తున్నారు. ఒక పెళ్లి వేడుక ఇలా అర్ధాంతరంగా ఆగిపోవడం ఇంధన సంక్షోభం యొక్క తీవ్రతకు అద్దం పడుతోంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us