AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG SSC 10th Class Results 2026: మరికాసేపట్లో పదో తరగతి ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ చెక్ చేసుకోండి

TS SSC 10th Class Results 2026 Today: నెల రోజులుగా పదో తరగతి విద్యార్ధులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న ఆ సమయం రానేవచ్చింది. ఈ రోజే పబ్లిక్ పరీక్షల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ మేరకు ఇప్పటికే విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది..

TG SSC 10th Class Results 2026: మరికాసేపట్లో పదో తరగతి ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ చెక్ చేసుకోండి
Telangana SSC 10th Class Results
Srilakshmi C
|

Updated on: Apr 29, 2026 | 7:27 AM

Share

హైదరాబాద్‌, ఏప్రిల్ 29: తెలంగాణ పదో తరగతి (SSC) పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 29) విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఫలితాల విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ రోజు (బుధవారం) మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు చేతుల మీదగా ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌లోని బహీర్‌బాగ్‌లో ఉన్న ఎల్బీ స్టేడియం వేదికగా ఫలితాలు వెల్లడించనున్నారు. దీంతో నెల రోజులుగా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నలక్షలాది విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది. ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లో మార్కుల మెమోను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అలాగే టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌లోనూ విద్యార్ధులు తమ రోల్ నంబర్‌ను నమోదు చేసి ఒక్క క్లిక్‌తో మార్కుల మెమోను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

తెలంగాణ పదో తరగతి ఫలితాలు 2026 ఇక్కడ చెక్‌ చేసుకోండి..

కాగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి 14న ప్రారంభమై ఏప్రిల్ 13తో ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,28,239 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచే జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమవగా ఏప్రిల్‌ 23వ తేదీతో ఈ ప్రక్రియ ముగిసింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు పదో తరగతి ఫలితాలు మే మొదటి వారంలో వెల్లడిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రక్రియను ఇంకాస్త ముందుగానే ముగించాలని భావించి ఏప్రిల్ 29న వెల్లడించేందుకు ముహూర్తం ఖరారు చేశారు.

ఇక పదో తరగతి ఫలితాలను ఎస్సెస్సీ బోర్డు వెబ్‌సైట్‌లతోపాటు వాట్సాప్‌లోనూ తెలుసుకునే వెసులుబాటు కల్పించింది. వాట్సాప్‌ ద్వారా మార్కుల మెమోను డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే 80969 58096 నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్‌ పంపించాలి. ఆ తర్వాత ఎస్సెస్సీ రిజల్ట్స్‌ అని టైప్‌చేసి హాల్‌టికెట్‌ నంబర్‌, ఇతర వివరాలు నమోదు చేయాలి. ఆ వెంటనే ఫలితాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.

Follow Us
200 కాదు.. ఇక 180 ప్రశ్నలతోనే NEET PG 2026 పరీక్ష.. కొత్త రూల్స్
200 కాదు.. ఇక 180 ప్రశ్నలతోనే NEET PG 2026 పరీక్ష.. కొత్త రూల్స్
మటన్‌లో బీఫ్ కల్తీని ఎలా గుర్తించాలి..?
మటన్‌లో బీఫ్ కల్తీని ఎలా గుర్తించాలి..?
జులైలో ఆషాఢ మాసం ప్రారంభం.. దక్షిణాయనం, గురుపూర్ణిమతో పాటు పండగలు
జులైలో ఆషాఢ మాసం ప్రారంభం.. దక్షిణాయనం, గురుపూర్ణిమతో పాటు పండగలు
వరల్డ్ కప్ గెలిస్తే చంద్రుడిపైకి తీసుకెళ్తాం.. ఆ టీమ్‌కు నాసా
వరల్డ్ కప్ గెలిస్తే చంద్రుడిపైకి తీసుకెళ్తాం.. ఆ టీమ్‌కు నాసా
ఆడపిల్లలకు మూడు రెట్లు బలాన్నిచ్చే పెసరపప్పు గారెలు..
ఆడపిల్లలకు మూడు రెట్లు బలాన్నిచ్చే పెసరపప్పు గారెలు..
విద్యార్ధులకు ఎగిరిగంతేసే న్యూస్.. జూలై 19 వరకు స్కూళ్లకు సెలవులు
విద్యార్ధులకు ఎగిరిగంతేసే న్యూస్.. జూలై 19 వరకు స్కూళ్లకు సెలవులు
తేనెటీగలు పెంచండి.. ఆదాయం పెంచుకోండి.. ఆరోగ్యం కాపాడుకోండి
తేనెటీగలు పెంచండి.. ఆదాయం పెంచుకోండి.. ఆరోగ్యం కాపాడుకోండి
పల్లెటూరి ఆకు కూరల పచ్చడి తింటే.. తాతల లాంటి బలం
పల్లెటూరి ఆకు కూరల పచ్చడి తింటే.. తాతల లాంటి బలం
చెన్నై‌లోకి హార్దిక్ పాండ్యా..? సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్..!
చెన్నై‌లోకి హార్దిక్ పాండ్యా..? సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్..!
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. రాబోయే 15 రోజుల పాటు భారీ వర్షాలు
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. రాబోయే 15 రోజుల పాటు భారీ వర్షాలు