విశాఖ జూలో మహేశ్వరి మృతి.. ఆడ సింహం పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే.. గుండె తరుక్కు పోద్ది..
సాధారణంగా అడవిలో తిరిగే సింహాల యొక్క సగటు జీవిత కాలం 16-18 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. జూ లో అయితే సరైన సంరక్షణ ఉంటుంది కాబట్టి మరో ఒకటి రెండు సంవత్సరాల జీవితకాలం అదనంగా జీవించే అవకాశం ఉంటుంది. మహేశ్వరి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం 19వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. సక్కర్బాగ్ జూ నుంచి, విశాఖ జంతు ప్రదర్శనశాలకు తీసుకురావడం ద్వారా లక్షలాది మందికి ఆసియా సింహాల గురించి అవగాహన కల్పించే..
విశాఖపట్నం, సెప్టెంబర్ 24: విశాఖ లోని ఇందిరాగాంధీ జూ పార్క్ లో మహేశ్వరి అనే ఆడ సింహం మృతి చెందింది. మహేశ్వరి ఇటీవలనే 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 19 వ సంవత్సరం లో అడుగు పెట్టింది. మహేశ్వరి సంపూర్ణ జీవితకాలం జీవించి వృద్ధాప్యం తో వచ్చిన అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందినట్టు తెలిపింది జూ క్యూరేటర్ నందని సలారియా.
2019లో గుజరాత్ లోని సక్కర్ బాగ్ జూ నుంచి వచ్చిన మహేశ్వరి విశాఖ జూలో ఉండడం వల్ల ఆసియా సింహాల గురించి అందరికీ వివరించే అవకాశం లభించిందని తెలిపింది జూ యాజమాన్యం. ఇంకా పూర్తి వివరాలు ఏంటంటే..
గుజరాత్‌లో జన్మించి వైజాగ్ చివరి మజిలీ..
ఆదివారం తెల్లవారు జాము సమయంలో 18 సంవత్సరాల వయసున్న -మహేశ్వరి అనే ఆడ సింహం చనిపోయిందని తెలియజేసేందుకు విచారిస్తున్నాం అని ప్రకటించింది విశాఖ లోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శన శాల. మహేశ్వరి 2006లో గుజరాత్ లోని సక్కర్బాగ్ జూ లో జన్మించింది. 2019 లో విశాఖ జూకి తీసుకువచ్చారు.
మహేశ్వరి కి పోస్ట్ మార్టంలో..
ఆదివారం తెల్లవారు జామున విశాఖ లోని ఇందిరా గాంధీ జంతు ప్రదర్శన శాల లో మృతి చెందిన మహేశ్వరి కి జూ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, పోస్ట్ మార్టం నిర్వహించింది. ఆ నివేదిక ప్రకారం వృద్ధాప్యం వలన తీవ్రమైన మయోకార్డియల్ ఇన్ ఫారన్ కారణంతో మరణించినట్టు పేర్కొంది.
సింహం సగటు జీవితకాలం 16-18 సంవత్సరాలే
సాధారణంగా అడవిలో తిరిగే సింహాల యొక్క సగటు జీవిత కాలం 16-18 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. జూ లో అయితే సరైన సంరక్షణ ఉంటుంది కాబట్టి మరో ఒకటి రెండు సంవత్సరాల జీవితకాలం అదనంగా జీవించే అవకాశం ఉంటుంది. మహేశ్వరి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం 19వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. సక్కర్బాగ్ జూ నుంచి, విశాఖ జంతు ప్రదర్శనశాలకు తీసుకురావడం ద్వారా లక్షలాది మందికి ఆసియా సింహాల గురించి అవగాహన కల్పించే అవకాశం కల్పించింది మహేశ్వరి. ఆమె తన జీవితాంతం సంపూర్ణంగా జీవించిందని విశాఖ జూ ఎల్లప్పుడూ మహేశ్వరికి కృతజ్ఞతగా ఉంటుందనీ ఆవేదన వ్యక్తం చేసింది జూ క్యూరేటర్ నందనీ.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం