Vizag: మత్తెక్కించే మాటలతో పెళ్లి చేసుకుందామంది..! చివరకు పోలీసులకే మైండ్ బ్లాక్..

అందమైన అమ్మాయి ఆన్లైన్లో పలకరిస్తే.. హాయ్ చెప్పని కుర్రాడు ఎవరైనా ఉంటారా..? అది కూడా లైఫ్ లో సెటిలై పెళ్లి కోసం వేచి చూస్తున్నా వాళ్లకు అటువంటి అవకాశం వస్తే.. ప్రొసీడ్ కాక తప్పదు. అందుకు కాస్త కండిషన్స్ అప్లై అయినా.. ఇద్దరి మాటలు కలిస్తే మనసులు కలిసి పెళ్లి పీటల వరకు వెళతాయి. కొన్ని ఫ్రెండ్షిప్ తో మొదలై.. గిఫ్టులు డేటింగ్ ల వరకు వెళ్లి బ్రేకప్ అయిపోతుంటాయి.

Vizag: మత్తెక్కించే మాటలతో పెళ్లి చేసుకుందామంది..! చివరకు పోలీసులకే మైండ్ బ్లాక్..
cyber crime
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 29, 2024 | 6:31 PM

అందమైన అమ్మాయి ఆన్లైన్లో హలో అన్నది.. అప్పటికే పెళ్లి కోసం చూస్తున్న ఓ మెకానికల్ ఇంజనీర్ పసిడయ్యాడు. ఇద్దరి మాటలు కలిసాయి.. కానీ డైరెక్ట్ చూపులు లేవు. అయినా సరే చాటింగ్ తో ఆ అమ్మాయి కట్టే పడేసింది. అప్పుడప్పుడు వాయిస్ కాల్స్ తో తెగ ఎమోషన్ టచ్ ఇచ్చేది. దీంతో ఆ అమ్మాయికి ఫిదా అయినా ఆ అబ్బాయి.. లక్షలు ఇచ్చేశాడు. మూడు పదుల లక్షల వరకు వదిలించుకున్నాడు. చివరికి ఎక్కడో చిన్న అనుమానం వచ్చి సైబర్ క్రైమ్ పోలీస్ ను టచ్ చేసాడు. చెక్ చేస్తే.. ఆ బాధితుడికి దిమ్మ జరిగింది.. పోలీసులకు మైండ్ బ్లాక్ అయింది..? ఎందుకో తెలుసా.. ఈ స్టోరీ చదివేయండి మరి ..!

అందమైన అమ్మాయి ఆన్లైన్లో పలకరిస్తే.. హాయ్ చెప్పని కుర్రాడు ఎవరైనా ఉంటారా..? అది కూడా లైఫ్ లో సెటిలై పెళ్లి కోసం వేచి చూస్తున్నా వాళ్లకు అటువంటి అవకాశం వస్తే.. ప్రొసీడ్ కాక తప్పదు. అందుకు కాస్త కండిషన్స్ అప్లై అయినా.. ఇద్దరి మాటలు కలిస్తే మనసులు కలిసి పెళ్లి పీటల వరకు వెళతాయి. కొన్ని ఫ్రెండ్షిప్ తో మొదలై.. గిఫ్టులు డేటింగ్ ల వరకు వెళ్లి బ్రేకప్ అయిపోతుంటాయి. కానీ.. విశాఖలో ఓ మెకానికల్ ఇంజనీర్ అందమైన అమ్మాయి కి ఫిదా అయిపోయాడు. ఆమె మెసేజ్లు.. అప్పుడప్పుడు మాటలు అతగాడిని పడేసాయి. ఫోటోలు చూడడమే.. అప్పుడప్పుడు మాట్లాడటమే తప్ప నేరుగా కలిసింది లేదు చూసింది లేదు. మరి..

విశాఖకు చెందిన ఆ ఇంజనీర్ అలా అలా..

డైరెక్ట్ గా స్టోరీ లోకి వెళ్ళిపోదాం.. విశాఖ కు చెందిన ఓ యువకుడు ఓ కార్ల కంపెనీలో క్వాలిటీ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. సోషల్ మీడియాలో బ్రౌజింగ్ చేస్తున్న సమయంలో డేటింగ్ యాప్ లో.. ఓ అందమైన అమ్మాయి పరిచయమైంది. పేరు సంయుక్త గౌడ్.. విశాఖలోని ఓ పేరు మోసిన కాలేజీలో ఇంజనీరింగ్ స్టూడెంట్. ఇన్స్టా ఎకౌంటు ద్వారా పరిచయం మరింత పెరిగింది. రోజు రోజు ఆ పరిచయం కాస్త మరింత ఇద్దరిని క్లోజ్ చేసింది. చాటింగ్ ద్వారా ఇద్దరూ దగ్గరయ్యారు. ఒక నెల రోజుల తర్వాత.. పర్సనల్ నెంబర్స్ ఇచ్చిపుచ్చుకున్నారు. అక్కడ నుంచి మరింత పర్సనల్ ఫొటోస్ చాటింగ్స్ మరింత పెరిగాయి.

సంయుక్త గౌడ్ గా ఇన్స్టాలో పరిచయమై..

సంయుక్త గౌడ్.. తన అందమైన ఫోటోలు తీసుకొని సెండ్ చేసేది. ఆ ఫోటోలకు ఈ మెకానికల్ ఇంజనీర్ ఫిదా అయిపోయాడు. ఆమె మాటల్లో పడి పిచ్చెక్కిపోయాడు. అప్పటికే పెళ్లికి సిద్ధంగా ఉన్న ఈ యువకుడు.. ఆమె మాటల్లో పడిపోయాడు. ఫోటోలు, మెసేజ్లకు ఫ్లాట్ అయిపోయాడు. చాలాకాలం వరకు కేవలం మెసేజ్లు చాటింగ్లే. నేరుగా కాల్స్ లేవు. ఓ రోజు నీతో నేరుగా మాట్లాడాలని ఉంది.. అంటే.. సమయం చెబుతాను అప్పుడు మాట్లాడుకుందాం అంది. ఓ రోజు కాల్ కలిసింది. హలో హాయ్ తో మొదలై.. మధురమైన ఆ గొంతు, ఆమె మాటలు విని ఈ కుర్రాడు మరింత దగ్గరయ్యాడు. కాల్స్ ఎలా తక్కువ కేవలం చాటింగ్ ఎక్కువ.

ఎమోషన్ టచ్ తో రూ.28 లక్షలు..

కొన్నాళ్లు సాగిన తర్వాత.. ఫ్యామిలీ పర్సనల్ డీటెయిల్స్ కూడా షేర్ చేసుకున్నారు. ఈ సమయంలో కొంత ఎమోషనల్ టచ్ అయింది. ఆమె ఒక్కసారిగా మాటల్లో కాస్త స్వరం తగ్గేసరికి అయ్యో ఏమైంది అని అడిగాడు. ఏముందిలే.. మదర్ కి హెల్త్ బాగోలేదు.. మంచి డాక్టర్ కి చూపించాలి. అంత అమౌంట్ నా దగ్గర లేదు. హెల్ప్ చేయగలరా అని అడిగింది. అప్పటికే క్లోజ్గా అమౌంట్ తో ఆమె మాటని కాదనుకున్నాడు. ఆమె పంపిన ఎకౌంట్కి కొంత పంపించాడు. ఆ తర్వాత మనకోసం ఒక మంచి సైట్ కొంటున్నాను. అని చెప్పగానే మరి కొంత అమౌంట్. నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు.. వాడ్ని వదిలించుకోవాలంటే కొంతవరకు నేను ఖర్చు చేయాలి. అనగానే మరికొంత అమౌంట్.. ఇలా దఫ దఫా లాగా ఒకటి కాదు రెండు కాదు 28 లక్షలు లాగేసారని అన్నారు విశాఖ సైబర్ క్రైమ్ సీఐ భవాని ప్రసాద్.

విచారణలో పోలీసులకే మైండ్ బ్లాంక్..

అప్పటివరకు ఆమె మాటల మత్తులో పడిపోయిన ఈ మెకానికల్ ఇంజనీర్.. ఎక్కడో ఓ చోట చిన్న డౌట్ వచ్చింది.. దీంతో ఇక కళ్ళు తెరిచి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులు అలర్ట్ అయ్యారు. సి పి శంకర్ బాగ్చి కూడా ఈ కేసులో ప్రత్యేక చొరవ చూపించారు. జాయింట్ సీపీ ఫకీరప్ప అవసరమైన టెక్నికల్ గైడెన్స్ ఇచ్చారు. సీఐ భవాని ప్రసాద్ తన టీం తో రంగంలోకి దిగిపోయారు. బ్యాంకు ఖాతాలో సెల్ఫోన్ లొకేషన్స్ ట్రాక్ చేశారు. దీంతో అవన్నీ హైదరాబాద్ వైపు చూపించాయి. ప్రత్యేక బృందం హైదరాబాద్కు వెళ్ళింది. అక్కడ వారం రోజులపాటు తిష్ట వేశారు. చివరకు అమ్మాయిని ట్రాక్ చేసేందుకు వెళ్లిన పోలీసులకు ఓ యువకుడు పట్టుబడ్డాడు. వాడి పేరు లోకేష్. నల్గొండ జిల్లా నరకట్పల్లి. కూపీ లాగితే.. సాయి ధీరజ్ అనే మరొకటి లింకు తగిలింది. ఇంకాస్త డెప్త్ కి వెళితే శాలిని అనే పేరు పోలీసులకు తెలిసిందని అన్నారు సైబర్ క్రైం సిఐ భవాని ప్రసాద్.

ఆమె కాదు అతడు..!

ఇంతకీ.. 28 లక్షల లాగేసిన ఆ యువతి ఎవరో కాదు సాయి ధీరజ్ అనే యువకుడు. అతనికి లోకేష్, శాలిని సహకరించారు. అవాక్కయ్యారు కదూ.. మీరే కాదు పోలీసులు కూడా ఇదంతా నడిపించింది అమ్మాయి కాదు అబ్బాయి అని తెలుసుకొని షాక్ అయ్యారు. వాస్తవానికి.. లోకేష్ డిగ్రీ డిస్కంటిన్యూ. లోకేష్ కు ఫ్రెండ్ సాయి ధీరజ్. వాడు జులాయిగా తిరుగుతున్నాడు. ఇద్దరూ బెట్టింగ్లకు అలవాటు పడ్డారు. క్రికెట్ బెట్టింగ్లు చేస్తూ ఉన్నారు. ఇంతలో సాయి ధీరజ్ డేటింగ్ యాప్ లో అమ్మాయి ఫోటోను పెట్టి.. తనకు తాను సంయుక్త గౌడ్ గా ప్రొఫైల్ పోస్ట్ చేశాడు. ఆ ప్రొఫైల్ ను చూసిన విశాఖకు చెందిన మెకానికల్ ఇంజనీర్ ఓ అడుగు ముందుకు వేశాడు. అదే వాడికి 28 లక్షలు వదిలించుకుంది.

వాడొకడు.. వాడితో మరో ఇద్దరు..

సాయి ధీరజ్ అంతా నడిపించేవాడు.. సంయుక్త గౌడ్ గా ఆన్లైన్లోకి వచ్చిన మెకానికల్ ఇంజనీర్ తో చాటింగ్ చేసేవాడు. సాయి ధీరజ్ కాస్త బిజీగా ఉన్న టైంలో.. ఆ పని లోకేష్ చేసేవాడు. ఎంతలా అంటే డైరెక్ట్ గా వీడియో కాల్స్ గాని, ఆడియో కాల్స్ గాని అవకాశం ఇవ్వలేదు సాయి ధీరజ్. కొన్నాళ్లపాటు అలాగే మైంటైన్ చేసిన.. ఈ మెకానికల్ ఇంజనీర్ మాత్రం ఓ రోజు డైరెక్ట్ గా మాట్లాడాలని కోరాడు. ఇక ఎలా అని అనుకున్నారు సాయిధరస్ లోకేష్. అందుకు లోకేష్ కు పరిచయం ఉన్న షాలినిని రంగంలోకి దింపారు. ఈ మెకానికల్ ఇంజనీర్ కోరినప్పుడల్లా.. ఆమెతోనే హస్కీ వాయిస్ లో మాట్లాడించేవారు. మరింత దగ్గర అయ్యేలా మాట్లాడించి.. ఎమోషన్స్ తో ఆడుకున్నారు. వారి మాటల్లో పడి ఆ మెకానికల్ ఇంజానీర్ చివరకు ఉన్నదంతా సమర్పించుకున్నాడు.

కటకటలోకి లోకేష్.. అసలు నిందితుడు పరార్

అయితే.. ఎట్టకేలకు లోకేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 28 లక్షల్లో ఆరు లక్షలతో ఓ బైక్, రెండు గ్రాముల గోల్డ్, ఓ యాపిల్ ఐఫోన్ కూడా కొనుక్కున్నాడు లోకేష్. వాటిని సీజ్ చేశారు. మిగిలిన దాంట్లో కొంత శాలినికి ఇస్తూ.. మిగతాదంతా సాయి దిరజ్ నొక్కేశాడు. ప్రస్తుతం శాలిని సాయి ధీరజ్ పరారీలో ఉన్నారు. అయితే అసలు విషయాన్నీ తెలుసుకున్న బాధితుడు నోరెళ్లపెట్టాడు. మగాళ్ళతోన నేను చాటింగ్ చేసింది అనుకొని షాక్ లోకి వెళ్ళాడు. మోసం చేస్తుందని అమ్మాయి కోసం వెళ్ళిన సైబర్ క్రైమ్ పోలీసులకు.. అక్కడ వ్యవహారం నడిపిస్తున్నంత అబ్బాయిలని తెలుసుకొని అవాక్కయ్యారు.

సోషల్ మీడియాలో ఫోటోలు అప్లోడ్ చేసిన వారికి అలర్ట్..

అయితే ఈ కేసులో.. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఆ అమ్మాయి ఫోటోలు. ఆ ఫోటోలు పంపినవారు అసలు వ్యక్తులు కాదు. ఎవరివో ఫోటోలను డౌన్లోడ్ చేసి వాటిని అప్లోడ్ చేసి ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిగా నమ్మించి మోసం చేశారు. మీరు ఆ విషయాన్ని గమనిస్తే.. చాలామంది సోషల్ మీడియాలో అనేక రకాలుగా ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. అటువంటి వాటిలో కొన్నిటిని డౌన్లోడ్ చేసి ఆ ఫోటోలను తమ మోసానికి వినియోగించుకుంది ఈ ముఠా. చూశారు కదా.. మీ ప్రమేయం లేకుండానే మీ ఫోటోలు ఇతర చేతుల్లోకి వెళితే అవి ఎటువంటి పరిస్థితులకు ధర తీస్తాయో..?! బి అలర్ట్

మత్తెక్కించే మాటలతో పెళ్లి చేసుకుందామంది.. పోలీసులకే మైండ్ బ్లాక్
మత్తెక్కించే మాటలతో పెళ్లి చేసుకుందామంది.. పోలీసులకే మైండ్ బ్లాక్
బంగారం షాపులోకి చొరబడ్డ దుండగులు.. గన్‌తో బెదిరించి నగలతో పరార్‌!
బంగారం షాపులోకి చొరబడ్డ దుండగులు.. గన్‌తో బెదిరించి నగలతో పరార్‌!
ఇది సుగంధ ద్రవ్యాల రాజు..రోజూ వాడితే ఈ వ్యాధులకు చెక్..!
ఇది సుగంధ ద్రవ్యాల రాజు..రోజూ వాడితే ఈ వ్యాధులకు చెక్..!
వాస్తు ప్రకారం ఈ మొక్కలు అస్సలు ఇంట్లో ఉండకూడదట..
వాస్తు ప్రకారం ఈ మొక్కలు అస్సలు ఇంట్లో ఉండకూడదట..
వారెవ్వా.. శ్రీశైలం ప్రాజెక్టులో అద్భుత దృశ్యం.. డ్రోన్ విజువల్స్
వారెవ్వా.. శ్రీశైలం ప్రాజెక్టులో అద్భుత దృశ్యం.. డ్రోన్ విజువల్స్
మిస్టర్ బచ్చన్ టీజర్‌లో అవి గమనించారా ??
మిస్టర్ బచ్చన్ టీజర్‌లో అవి గమనించారా ??
జూబ్లీ హిల్స్ డ్రైనేజీ సమస్యపై హీరో రాజశేఖర్ సంచలన ట్వీట్‌
జూబ్లీ హిల్స్ డ్రైనేజీ సమస్యపై హీరో రాజశేఖర్ సంచలన ట్వీట్‌
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 966కిలోమీటర్ల రేంజ్.. శామ్సంగ్ నుంచి
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 966కిలోమీటర్ల రేంజ్.. శామ్సంగ్ నుంచి
ఈ హెయిర్ ప్యాక్స్ ట్రై చేశారంటే.. తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం
ఈ హెయిర్ ప్యాక్స్ ట్రై చేశారంటే.. తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం
ఏటా 50 వేల మందిని బలి తీసుకుంటున్న పాములు- బీజేపీ ఎంపీ
ఏటా 50 వేల మందిని బలి తీసుకుంటున్న పాములు- బీజేపీ ఎంపీ
వారెవ్వా.. శ్రీశైలం ప్రాజెక్టులో అద్భుత దృశ్యం.. డ్రోన్ విజువల్స్
వారెవ్వా.. శ్రీశైలం ప్రాజెక్టులో అద్భుత దృశ్యం.. డ్రోన్ విజువల్స్
కనువిందు చేస్తున్న జలపాతలు.. తరలివస్తున్న పర్యాటకులు.!
కనువిందు చేస్తున్న జలపాతలు.. తరలివస్తున్న పర్యాటకులు.!
భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. తమ పౌరులకు అమెరికా సూచన.!
భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. తమ పౌరులకు అమెరికా సూచన.!
కార్మికుడుకి దొరికిన ఒక్క వజ్రం.. అతన్ని లక్షలకు అధిపతిని చేసింది
కార్మికుడుకి దొరికిన ఒక్క వజ్రం.. అతన్ని లక్షలకు అధిపతిని చేసింది
ఎంపీ పదవి విషయంలో కంగనా రనౌత్‌ చిక్కుల్లో పడనుందా.?
ఎంపీ పదవి విషయంలో కంగనా రనౌత్‌ చిక్కుల్లో పడనుందా.?
ఆ రైతుబజారు ముందు జనం బారులు.. ఎందుకో తెలుసా.? వీడియో.
ఆ రైతుబజారు ముందు జనం బారులు.. ఎందుకో తెలుసా.? వీడియో.
బోనులో చిక్కిన పునుగు పిల్లి.. ఏం చేశారంటే.! వీడియో వైరల్..
బోనులో చిక్కిన పునుగు పిల్లి.. ఏం చేశారంటే.! వీడియో వైరల్..
డేంజరస్‌ ‘టేబుల్‌ టాప్‌ రన్‌వే’ అసలు కథేంటి.? ఘోర విమాన ప్రమాదం..
డేంజరస్‌ ‘టేబుల్‌ టాప్‌ రన్‌వే’ అసలు కథేంటి.? ఘోర విమాన ప్రమాదం..
హీరోల కన్నా ఎక్కువగా సంపాదిస్తున్న సల్మాన్​ ఖాన్ బాడీగార్డ్.!
హీరోల కన్నా ఎక్కువగా సంపాదిస్తున్న సల్మాన్​ ఖాన్ బాడీగార్డ్.!
రూ.500 అద్దె గదిలో.. డెలివరీ బాయ్‌ హోం టూర్‌.. చూశారంటే షాకే!
రూ.500 అద్దె గదిలో.. డెలివరీ బాయ్‌ హోం టూర్‌.. చూశారంటే షాకే!