Andhra Pradesh: ఏపీలో మందుబాబులకు గుడ్​న్యూస్ – రేట్లు తగ్గింపు..!

ఏపీలో నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం.. మందుబాబులకు మరిన్ని గుడ్‌న్యూస్‌లు చెప్పింది. త్వరలో మరిన్ని మంచి బ్రాండ్స్ రాష్ట్రంలోకి అనుమతించనున్నట్లు వెల్లడించింది. అంతేకాదు.. రేట్లు తగ్గించేందుకు కూడా కీలక నిర్ణయం తీసుకుంది.

Andhra Pradesh: ఏపీలో మందుబాబులకు గుడ్​న్యూస్ - రేట్లు తగ్గింపు..!
Andhra Liquor Shops
Follow us

|

Updated on: Oct 29, 2024 | 5:46 PM

ఇప్పటికే క్వాలిటీతో పాటు తక్కువ ధరకే లిక్కర్‌ను అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం, మద్యం ప్రియులకు మరిన్ని శుభవార్తలు చెప్పింది. త్వరలోనే కొత్త మద్యం బ్రాండ్స్ అందుబాటులోకి తేనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. మద్యం రేట్లు కూడా తగ్గించే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం కమిటీ సైతం వేశామన్నారు. త్వరలోనే ఆ కమిటీ రిపోర్ట్ ఇస్తుందని.. ఆ మేరకు రేట్లు తగ్గిస్తామని వెల్లడించారు. అలానే ఏపీలోని లిక్కర్ షాపుల్లో డిజిటల్ పేమెంట్ చేసేందుకు అనుమతులు ఇచ్చామని మంత్రి స్పష్టం చేశారు. జీపీఎస్​ పెట్టి సరుకు పంపుతున్నట్లు వివరించారు. అనుమతి లేకుండా పబ్బుల్లో మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. గత ప్రభుత్వం హయాంలో మద్యం అమ్మకాల్లో జరిగిన గోల్‌మాల్‌పై విచారణ చేస్తున్నామన్నారు. కూటమి సర్కార్ మద్యాన్ని ఆదాయ వనరుగా చూడలేదన్నారు.

ఏపీలో ఇటీవల కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ప్రభుత్వమే లిక్కర్ విక్రయాలు జరపగా.. కూటమి సర్కార్ మద్యాన్ని గతంలో ఉన్న విధంగా ప్రవేట్ వ్యక్తులకు అప్పగించింది. ఈ క్రమంలోనే 2019కి ముందున్న మద్యం బ్రాండ్లు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. దీంతో మందుబాబులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కింగ్ ఫిషర్, రాయల్ స్టాగ్, మాన్షన్ హౌస్, ఇంపీరియల్ బ్లూ వంటి బ్రాండ్లను చూసి మందుబాబులు ఆనందంలో తేలియాడుతున్నారు. అయితే 99 రూపాయల క్వార్టర్ అందుబాటులోకి వచ్చేసరికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

మరోవైపు లిక్కర్‌ షాపుల విషయంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యం పాలసీ, అమ్మకాల విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేశారు. లిక్కర్ పాలసీలో ఎవరు వేలు పెట్టిన ఊరుకోమని హెచ్చరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..