Vizag Steel Plant: వైజాగ్‌ స్టీల్ ప్లాంట్ కార్మికుడి మృతి కేసులో కీలక ట్విస్ట్..! మృతదేహంలో అదెలా వచ్చింది..?

|

Jan 04, 2024 | 12:02 PM

విశాఖ స్టీల ప్లాంట్‌ కార్మికుడు పైడిరాజు మృతి కేసులో పలు అనుమానాలు తెరమీదికొస్తున్నాయి. ఆయన శరీరంలోకి పెల్లెట్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పైడిరాజు మృతి కేసులో పలు అనుమానాలకు తావిస్తోంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లోని సెక్టార్‌ 11లో కార్మికుడు పైడి రాజు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. అసలు పైడి రాజు మృతికి కారణాలు ఏంటి? ఎవరు ఈ ఘాతుకానికి..

విశాఖపట్నం, జనవరి 4: విశాఖ స్టీల ప్లాంట్‌ కార్మికుడు పైడిరాజు మృతి కేసులో పలు అనుమానాలు తెరమీదికొస్తున్నాయి. ఆయన శరీరంలోకి పెల్లెట్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పైడిరాజు మృతి కేసులో పలు అనుమానాలకు తావిస్తోంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లోని సెక్టార్‌ 11లో కార్మికుడు పైడి రాజు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. అసలు పైడి రాజు మృతికి కారణాలు ఏంటి? ఎవరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

స్టీల్‌ ప్లాంట్‌ కాంట్రాక్ట్ కార్మికుడు పైడిరాజు విధులు ముగించుకుని వెళ్తుండగా.. గుర్తు తెలియని దుండగుడు కత్తితో పొడిచి చంపేశాడు. విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పైడిరాజు స్నేహితుడు సాయిసాగర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తుపాకి పొరపాటున పేలిందని సాయిసాగర్‌ పోలీసులకు తెలిపాడు. అయితే అది నిజంగా పొరబాటున పేలిందా లేదా ఉద్దేశ్య పూర్వకంగా పేలిందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.