YS Sharmila: పార్టీని విలీనం చేసి కాంగ్రెస్‌లో చేరిన వైఎస్ షర్మిల.. లైవ్ వీడియో
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరారు. వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన షర్మిల గురువారం రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరారు. వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన షర్మిల గురువారం రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ మేరకు షర్మిల, మరికొందరు నేతలు బుధవారం రాత్రే ఢిల్లీ చేరుకున్నారు. కాగా.. ముందుగా షర్మిల.. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపారు. ఆ తర్వాత వారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే, షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో కాంగ్రెస్ అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఆమె సేవలు ఉపయోగించుకునేలా బాధ్యతలు ఇవ్వనున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Jan 04, 2024 10:39 AM
వైరల్ వీడియోలు
Latest Videos