Kodali Nani: కాంగ్రెస్‌లో షర్మిల చేరికపై కొడాలి నాని రియాక్షన్ ఇదే

Kodali Nani: కాంగ్రెస్‌లో షర్మిల చేరికపై కొడాలి నాని రియాక్షన్ ఇదే

Ram Naramaneni

|

Updated on: Jan 04, 2024 | 2:27 PM

షర్మిల కాంగ్రెస్‌లో చేరితే తమకొచ్చే ఇబ్బందేం లేదన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. ఆమె కాంగ్రెస్‌లో చేరితే మా ఓటు బ్యాంక్ ఎందుకు చీలుతుందన్నారు. అలాంటప్పుడు పురంధేశ్వరి బీజేపీలో చేరితే టీడీపీ ఓటు బ్యాంక్ చీలదా? అని ప్రశ్నించారు. ఏపీలో కాంగ్రెస్‌కు ఒక శాతం ఓటు బ్యాంక్‌ కూడా లేదని చెప్పారు.

వైఎస్‌ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల.. ఇప్పుడు కాంగ్రెస్‌ నేతగా మారిపోయారు. తన పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసి… ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు ఖర్గే సమక్షంలో కండువా మార్చేశారు. ఏపీ కాంగ్రెస్‌ నేతలు సమక్షంలో ఆమె కాంగ్రెస్‌ సభ్యత్వాన్ని తీసుకున్నారు. దీంతో ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయనే చర్చ జోరందుకుంది. ఇన్నాళ్లూ తెలంగాణకే పరిమితమై రాజకీయాలు చేసిన షర్మిల.. ఇప్పుడు బ్యాక్‌ టు ఏపీ అనడంతో… సీఎం జగన్‌తో ఆమె పోరాటం ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ఏర్పడింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌లో షర్మిల చేరికపై వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు.

షర్మిల కాంగ్రెస్‌లో చేరితే తమకొచ్చే ఇబ్బందేం లేదన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. ఆమె కాంగ్రెస్‌లో చేరితే తమ ఓటు బ్యాంక్ ఎందుకు చీలుతుందన్నారు. అలాంటప్పుడు పురంధేశ్వరి బీజేపీలో చేరితే టీడీపీ ఓటు బ్యాంక్ చీలదా? అని ప్రశ్నించారు. ఏపీలో కాంగ్రెస్‌కు ఒక శాతం ఓటు బ్యాంక్‌ కూడా లేదని చెప్పారు. చంద్రబాబు కుటుంబాల మధ్య చిచ్చు పెడతారన్నారు నాని. తమకు పనికిరాని వాళ్లు టీడీపీకి పనికొస్తారని కామెంట్స్ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Published on: Jan 04, 2024 02:20 PM